- 89.76 శాతం మంది ఉత్తీర్ణత
- అభ్యర్థులకు మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి(చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఏపీపీఈసీఈటీ) ఫలితాలను మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రకటించారు. మొత్తం 89.76 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పీఈసెట్ కోసం మొత్తం 4,037 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వారిలో 2,958 మంది పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో 2,655 మంది అర్హత సాధించారు. ఫలితాల్లో పురుష అభ్యర్థులు అధికం గా ఉత్తీర్ణత సాధించారు. పరీక్షకు హాజరైన పురుషుల్లో 92.91 శాతం మంది (1,993 మంది) అర్హత సాధించగా, మహిళల్లో 81.43 శాతం (662 మంది) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఫిజికల్ ఎడ్యుకేషన్, క్రీడల రంగంలో కెరీర్‌ను ఎంచు కోవాలనుకునే అభ్యర్థులందరికీ మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వారి భవిష్యత్ ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్‌సైట్ (https://cets.apsche.ap.gov.in/PECET)ద్వారా చూసుకోవచ్చు. అలాగే ర్యాంక్ కార్డులను కూడా అదే పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదనంగా మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా ఫలి తాలు తెలుసుకునే సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
















