- స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీదే పేటెంట్
- భారత్‌కు ఎకనమిక్ పవర్‌హౌస్‌గా ఎదుగుతోంది
- రెండో నివాసంగా అమరావతిని ఎంచుకోండి
- సింగపూర్‌తో ప్రత్యేకించి సంబంధాలు ఉన్నాయి
- లీ క్వాన్ యూ అంటే నాకు చాలా అభిమానం
- మÖడు దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాం
- హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్‌షిప్‌నూ నిర్మించాం
- భవిష్యత్ స్టార్టప్‌లదే..ప్రాజెక్టులతో ముందుకురండి
- ఇదే అవకాశం..అభివృద్ధిలో భాగస్వాములు కండి
- సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్‌షోలో చంద్రబాబు
- సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి పిలుపు
సింగపూర్: భూమి, నీరు, మౌలికవసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల కేంద్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీ పేటెంట్‌గా పేర్కొంటూ పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖలో తలపెట్టిన పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు సన్నాహకంగా సింగపూర్‌లో సీఐఐ నిర్వ హించిన బిజినెస్ రోడ్‌షోలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించా రు. సింగపూర్‌తో భారత్‌కు.. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే నాకు చాలా అభిమానం. మÖడు దశాబ్దాలుగా సింగపూర్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబా ద్‌లో సింగపూర్ టౌన్‌షిప్‌నే నిర్మించాం. రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయా రు చేసి ఇచ్చింది. బ్లూ, గ్రీన్ రాజధానిగా ఓ అద్భుతమైన బృహత్ ప్రణాళికను రూపొందించి అందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి తదితర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. పెట్టుబ డులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతం. సింగపూర్ పారిశ్రామి కవేత్తలు ఆంధ్రప్రదేశ్‌ను రెండో నివాసంగా అమరావతిని, ఎంచు కోవాలని పిలుపునిచ్చారు.
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం
ఏపీలో పరిశ్రమలకు భూమి కేటాయింపు, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్‌కు అనతికాలంలోనే అన్ని అనుమతులు వేగంగా ఇచ్చాం. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ఉత్పత్తి కూడా ప్రారం భించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుంది. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా హబ్ కూడా ఏర్పాటు అవుతోంది. ఆ సంస్థకు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయాలని నిర్ణయించాం. పెట్టుబడులు వచ్చిన మరు క్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా ఓ నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్ణయిస్తున్నాం. గూగుల్‌తో పాటు దాదాపు 10 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా రూ.7 వేల కోట్లతో శ్రీసిటీలో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ప్రారం భించనుంది. నైపుణ్యం ఉన్న మానవవనరులను తయారు చేసేం దుకు ఆపరేషనల్ స్కిల్ యూనివర్సిటినీ కూడా ఏర్పాటు చేస్తు న్నాం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతి పెరిగింది. దీని ఆధారంగానే నిర్ణయాలు ఉంటున్నాయి. ఏపీలోనూ అదే తరహాలో డేటా డ్రైవెన్ నిర్ణయాలను తీసుకుని పౌరసేవలు అంది స్తున్నామని వివరించారు.
ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్
వికసిత్ భారత్ 2047 విజన్‌లాగే స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు రూపకల్పన చేశాం. త్వరలోనే భారత ఎకనామిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. ప్రపంచ ఆర్థికశక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. సుదీర్ఘమైన తీరప్రాంతం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం. ఆక్వా, హార్టికల్చర్, వ్యవసా యం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రంగా ఉంది. దేశం, రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా వివిధ దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. పూర్తిస్థాయి సన్నద్ధతతో ఈ సంక్షోభాన్ని కూడా భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలిగింది. ఏపీ నుంచి ఎగుమతులు పెంచేందుకు మేం విస్తృతంగా ప్రయ త్నాలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా పోర్టులు, ఎయిర్ పోర్టు లు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించేలా పనిచేస్తున్నాం. పారిశ్రామిక అనుకూల పరిస్థితులను కల్పించేలా 26 పాలసీలు అమలు చేస్తున్నాం. ఏపీలో భూమి లభ్యత, నీటి లభ్యత ఉంది. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా ఉంది. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాలను పెద్దఎత్తున కల్పిస్తున్నామని వివరించారు.
గ్లోబల్ నగరాలకు ఏపీ కనెక్టివిటీ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిఒక్కరినీ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం తెచ్చాం. అలాగే ఎంఎసఎంఈ సహా వివిధ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతపై కూడా దృష్టిపెట్టాం. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ఎక్కడా జాప్యం లేకుండా అనుమతులు వేగంగా వచ్చేలా చూస్తు న్నాం. ఏపీకి ఉన్న వెయ్యి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతంలో 6 ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయి. ఈ పోర్టులను దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశీ పోర్టులకు కనెక్ట్ చేసేలా ప్రయత్నాలు చేస్తు న్నాం. 7 ఆపరేషనల్ ఎయిర్‌పోర్టులు ఏపీలో ఉన్నాయి. భోగాపు రం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్ నగరాలకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. లాజిస్టిక్స్, అగ్రికల్చర్, సివిల్ ఏవియేష న్, ఎనర్జీ లాంటి వివిధ అంశాల్లో ఫంక్షనల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో ఉన్న పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించేలా రహదారి, రైల్ నెట్‌వర్క్‌ను కూడా పెద్దఎత్తున నిర్మిస్తున్నాం. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరో స్పేస్, డ్రోన్, డిఫెన్స్ క్లస్టర్లతో పాటు రాష్ట్రంలోని 175 చోట్ల నియోజ¿ £వర్గ ఎంఎసఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పారిశ్రామిక పార్కులకు నీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. రాయలసీమలోని పుట్టపర్తి వద్ద 5వ తరం ఫైటర్ జెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ కూడా వస్తోంది. ఈవీల వినియోగం పెంచటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేలా ప్రయత్నా లు చేస్తున్నామని ఏపీ స్థితిగతులను వివరించారు.
నాలెడ్జ్ హబ్‌గా అమరావతి
అమరావతిని ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయటం తో పాటు దేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తాం. హైస్పీడ్ రైల్ నెట్‌వర్క్ కూడా అమరావతిని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను కనెక్ట్ చేస్తుంది. బ్లూ, గ్రీన్ సిటీగా అమరావతిని నిర్మించటంతో పాటు ఈవీల వినియోగం, గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. అమరావతి లోనే ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబ రు నాటికల్లా క్వాంటం అమరావతిలో కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణ లు, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం. ప్రాజెక్టులు పెట్టే వారికి ఎలాం టి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. త్వరలోనే విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతా లు కూడా ఉన్నాయి. దేవాలయాలు, పర్యాటక, బుద్దిస్ట్ సర్క్యూట్ లు ఉన్నాయి. అక్వా, వ్యవసాయం, హార్టికల్చర్‌లో ఏపీ అగ్రస్థానం లో ఉంది. పెద్దఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవకాశం ఉంది. పెద్దఎత్తున ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను పండిస్తున్నాం. ఏపీకి వచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను పరీక్షించి పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తున్నాను. పెట్టుబడులు పెట్టడానికి ఇది సువర్ణ అవకాశం. ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావాలని స్పష్టం చేశారు.
భవిష్యత్ అంతా స్టార్టప్‌లదే
భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి. ఇందులో 25 శాతం మేర ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ముందు కువచ్చాయి. భారత్‌లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పోర్టులు, ఎయిర్‌పోర్టులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నాయి. అంత ర్జాతీయంగా ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కునేలా కొన్ని దేశాలు సొంతంగా నిధిని ఏర్పాటు చేశాయి. సింగపూర్ కూడా సావరిన్ ఫండ్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. సమీప భవిష్యత్ అంతా స్టార్టప్ లదే. వాటిని ప్రోత్సహిస్తే పెద్దఎత్తున ఉత్పత్తికి అవకాశం ఉంటుం ది. పెద్ద కంపెనీలు, సంపన్నులు స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడం విజయవంతమైన మార్గంగా భావిస్తున్నాయి. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఆర్థిక సంస్థ లు ఈ ఆర్థిక నగరంలో ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సమావే శంలో మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరా జ్, ఈడీబీ సీఈవో షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
















