- సీబీఐ కేసులతో పాటే ఈడీ కేసులు
- ఇక రోజువారీగా విచారణకు నిర్ణయం
హైదరాబాద్(చైతన్యరథం): జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ కేసులతో పాటు ఈడీ కేసులనూ రోజువారీగా విచారించాలని సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. రోజువారీ విచారణకు హాజరుకావాలని ఈడీ న్యాయ వాదులకు సూచించింది. సీబీఐ కోర్టులో పదేళ్లుగా 9 ఈడీ ఛార్జిషీట్లు పెండింగ్లో ఉన్నాయి. డిశ్చార్జి పిటిషన్లు తేలక పోవడంతో ఈడీ కేసుల విచారణ ముందుకు సాగడం లేదు. ఈడీ కేసులను రోజువారీగా విచారించాలని ఇప్పటికే హైకోర్టును అధికా రులు ఆశ్రయించారు. ఇప్పటివరకూ సీబీఐ కేసులనే న్యాయస్థానం విచారిస్తోంది. తమ కేసులనూ విచారించాలని హైకోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. ఈ కేసును త్వరగా తేల్చేలా సీబీఐ న్యాయస్థా నాన్ని ఆదేశించాలని కోరింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఈడీ కేసులను రోజు వారీగా సీబీఐ కోర్టు విచారించే అవకాశం ఉంది. జగన్ సహా 70 మంది నిందితులను వ్యక్తిగతంగా సీబీఐ కోర్టు విచారించనుంది.














