చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దశాబ్దాల నిరీక్షణకు తెర

నెల్లూరులో సర్వేపల్లి కట్ట ఇళ్ల పట్టాల పంపిణీని వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

by చైతన్యరధం
Oct 12, 2026 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దశాబ్దాల నిరీక్షణకు తెర
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రూ.600 కోట్ల విలువైన 22.31 ఎకరాల భూమిపై పేదలకు హక్కులు
  • 701 మంది మహిళల పేరిట పట్టాలు…
  • వచ్చే సంక్రాంతిలోగా నెల్లూరులో మరో 4వేల ఇళ్ల పట్టాల పంపిణీకి సీఎం ఆదేశం

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ వారి సొంతింటి కలను సాకారం చేసింది కూటమి ప్రభుత్వం, నెల్లూరులోని సర్వేపల్లి కట్ట ప్రాంతంలో 22.31 ఎకరాల పరిధిలో 939 కుటుంబాలకు సుమారు రూ.600 కోట్ల విలువైన ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉండటం తమ ప్రభుత్వం మహిళా సాధికారతకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. వచ్చే సంక్రాంతిలోగా నెల్లూరులో మరో 4వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు భద్రత, ఆత్మగౌరవం, ఆస్తి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన సాగిస్తోందన్నారు. కాగా దసరా పండుగ వేళ తమకు శాశ్వత ఆస్తి హక్కు కల్పించిన సీఎం చంద్రబాబుకు లబ్ధిదారులు, మహిళలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు
నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 22.31 ఎకరాల భూమిపై 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం అమరావతిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై పేదలకు హక్కులు కల్పించామని తెలిపారు. మొత్తం లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉండటం మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేసి, ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో కలిసి పేదలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం 28 నెలల పాలనలో ఆచరణలో చూపిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు సుపరిపాలనకు నాంది పలికామని, పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం సుపరిపాలనలో భాగమని చెప్పారు. పేదల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-10-2026

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

పేదలకు భద్రత, ఆత్మగౌరవం, శాశ్వత ఆస్తి
ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు భద్రత కల్పించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్యమంలా పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో 60వేల కుటుంబాలకు రూ.52వేల కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందించామని వెల్లడించారు. ‘ప్రతి ఒక్కరికీ భద్రత, ఆత్మగౌరవం, ఒక ఆస్తి సమకూరాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో పట్టాలు పొందేందుకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా పేదలకు పట్టాలు అందిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు రూ.900 కోట్ల విలువైన 2,600 ఇళ్ల పట్టాలను పేదలకు అందించామని కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. వచ్చే సంక్రాంతి నాటికి మరో 4వేల పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది భగత్ సింగ్ కాలనీలో 1,407 కుటుంబాలకు 36 ఎకరాల భూమిపై పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

ఇళ్ల స్థలాలతో పాటు మౌలిక వసతులు
పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం, మరుగుదొడ్లు, రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ అందించేలా కార్యాచరణ చేపట్టామన్నారు. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతులను మరింత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాలను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నామని చెప్పారు.

సంక్షేమ పథకాల అమలులో రాజీ లేదు
సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజీ పడట్లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతినెలా సామాజిక పింఛన్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ‘స్త్రీ శక్తి’ ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఇప్పటికే 100 కోట్ల ప్రయాణాలు చేయడం సంతృప్తి ఇచ్చిందన్నారు. దీపం-2 పథకం కింద లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తామని తెలిపారు. విద్యుత్ చార్జీలను ఒక్క రూపాయి కూడా పెంచలేదని, ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. అన్నదాత సుఖీభవ, నేతన్న సేవలో, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ సేవలో వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. గీత కార్మికులకు ఎక్సైజ్ దుకాణాలు, వడ్డెరలకు మైనింగ్ లీజులు ఇచ్చి వారి జీవనోపాధికి తోడ్పడుతున్నామని చెప్పారు.

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
అన్నింటికీ మించి రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. బుర్రిపాలెం నుంచి ఇటీవలే 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఇప్పటికే 28 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో 5.50 లక్షల ఇళ్లను అందించామని చెప్పారు. ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్లు అందరికీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవల ప్రకాశం జిల్లాలో గర్భకండ్రిక భూముల సమస్యకు పరిష్కారం చూపామని తెలిపారు. భూముల విషయంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకుండా హక్కులను పరిరక్షిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం రీ సర్వే పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలను వేసుకుందన్నారు. వాటి స్థానంలో ఇప్పుడు ప్రభుత్వం రాజముద్రతో, అత్యంత భద్రతా ప్రమాణాలతో పాస్ పుస్తకాలను అందిస్తున్నట్టు తెలిపారు. సరిహద్దు రాళ్లపై గతంలో ముద్రించిన బొమ్మలను సైతం తొలగించామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ చెప్పారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజలకు ఉపశమనం కలిగించామన్నారు.

ఆర్థిక అసమానతలను తగ్గించడమే లక్ష్యం
రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా పీ4 వంటి కార్యక్రమాలను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆర్థిక అసమానతలను తగ్గించి సమాజంలోని ప్రతి కుటుంబానికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే తమ సంకల్పమని చెప్పారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా నిలిస్తే ట్రిపుట్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మేయర్లు, చైర్మన్లను ప్రజలే నేరుగా ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. నీతి, నిజాయితీ, నిస్వార్థంతో పనిచేసే నాయకులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు వేసిన ఓటు ప్రతి ఒక్కరి జీవితంలో, ప్రతి కుటుంబంలో, రాష్ట్రంలో మార్పునకు కారణమైందని ముఖ్యమంత్రి అన్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా గతంలో కంటే రెట్టించిన వేగంతో, ఉత్సాహంతో పనిచేస్తున్నానని తెలిపారు. పేదలకు శాశ్వత ఆస్తి కల్పించడంతో పాటు వారి జీవితాల్లో గౌరవం, భద్రత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన సమన్వయంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ను నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అవధుల్లేని ఆనందంలో లబ్ధిదారులు
నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి పి. నారాయణ, కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. మంత్రి నారాయణ లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను స్వయంగా అందజేశారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించి పట్టాలు అందించిన ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ, లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల పట్టాలు అందుకోవడంతో దసరా పండుగ ముందుగానే వచ్చిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు ఎంతో తోడ్పాటునిస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారుల ఆనందానికి హద్దులు లేవని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 11-10-2026

Next Post

బీసీలకు 40% సీట్లు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 12-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 12-10-2026

కార్యకర్త
@ October 12, 2026
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ October 12, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

చైతన్యరధం
@ October 12, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

బీసీలకు 40% సీట్లు

చైతన్యరధం
@ October 12, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-10-2026

కార్యకర్త
@ October 11, 2026
పట్టిసీమ లిఫ్ట్లో ఏపీకి జల భద్రత
ఆంధ్రప్రదేశ్

పట్టిసీమ లిఫ్ట్లో ఏపీకి జల భద్రత

చైతన్యరధం
@ October 11, 2026
100% స్థానాల్లో విజయం సాధించాలి 
ఆంధ్రప్రదేశ్

‘స్థానిక’ పోరులో బీసీలకు రక్షణ

చైతన్యరధం
@ October 11, 2026
100% స్థానాల్లో విజయం సాధించాలి 
ఆంధ్రప్రదేశ్

100% స్థానాల్లో విజయం సాధించాలి 

చైతన్యరధం
@ October 11, 2026
Load More

ముఖ్య వార్తలు

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

చైతన్యరధం
@ October 12, 2026
దశాబ్దాల నిరీక్షణకు తెర

దశాబ్దాల నిరీక్షణకు తెర

చైతన్యరధం
@ October 12, 2026
పట్టిసీమ లిఫ్ట్లో ఏపీకి జల భద్రత

పట్టిసీమ లిఫ్ట్లో ఏపీకి జల భద్రత

చైతన్యరధం
@ October 11, 2026
50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

50 ఏళ్ల ‘గర్భకండ్రిక’ భూ చిక్కులకు చరమగీతం

చైతన్యరధం
@ October 10, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

చైతన్యరధం
@ October 12, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

చైతన్యరధం
@ October 12, 2026
బీసీలకు 40% సీట్లు

బీసీలకు 40% సీట్లు

చైతన్యరధం
@ October 12, 2026
దశాబ్దాల నిరీక్షణకు తెర

దశాబ్దాల నిరీక్షణకు తెర

చైతన్యరధం
@ October 12, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist