- గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు
- ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
- మంత్రి అచ్చెన్న, అధికారులతో వర్చువల్ మీట్
అమరావతి(చైతన్యరథం): సముద్రంలో గల్లంతైన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల ఆచూకీని కనుగొనేందుకు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయా లని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అల్లవరం మండలంలోని ఓడలరేవు, దుమ్మలపేట, వాసలతిప్ప గ్రామాలకు చెందిన ఏడుగురు మత్స్యకారుల గల్లంతు ఘటనలో జరుగుతున్న గాలింపు చర్యలపై మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులతో వర్చు వల్‌గా మాట్లాడారు. గాలింపు చర్యలు ఏ మేరకు జరుగుతున్నా యని అడిగి తెలుసుకున్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసులు గాలిస్తున్నారని… జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇప్పటికే రెండు డార్నియర్ విమానాలు.. నేవీ బోట్లతో పాటు మరో ఏడు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు. కాకినాడ, భైరవపాలెం, విశాఖపట్నం, పారాదీప్ ప్రాంతాలకు చెందిన మత్స్యకారుల బోట్లను కూడా అప్రమత్తం చేసి గల్లంతైన బోటు ఆచూకీపై సమాచారం సేకరి స్తున్నామన్నారు. అయితే పారాదీప్‌కు 14 నాటికల్ మైళ్ల దూరం లో కొన్ని పడవలను గుర్తించామని, వాటి గురించి ఆరా తీస్తు న్నా మని అధికారులు సీఎంకు తెలిపారు. గాలింపు చర్యలకు సంబం ధించిన వివరాలను ఎప్పటికప్పుడు ఆ ఏడు కుటుంబాలకు తెలి యజేస్తూ ఉండాలని సీఎం ఆదేశించారు.












