- ఆళ్లగడ్డ డిగ్రీ కాలేజీకి నూతన భవనాన్ని నిర్మిస్తాం
- 175 నియోజకవర్గాల్లో మోడల్ లైబ్రరీలు ఏర్పాటు చేస్తాం
- త్వరలో అమరావతి సెంట్రల్ లైబ్రరీ డిజైన్ ఫైనల్
- విశాఖ, రాయలసీమ కేంద్రంగా జోనల్ లైబ్రరీలు
- శాసనసభలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంతభవనాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళా శాల శాశ్వత భవనాల నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ప్రభు త్వం వద్ద ఉన్న ప్రతిపాదనలకు సంబంధించి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో సొంత భవనాలు అవసరమైన ఒక్కొక్క డిగ్రీ కాలేజీ పూర్తి చేసి అన్ని హంగులు కల్పించడానికి రూ.15 కోట్లు ఖర్చవు తుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మొత్తం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పా టు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇదే సమయంలో నిధులు కూడా సమకూర్చుకోవాల్సి ఉందని తెలిపారు. ఆళ్లగడ్డకు డిగ్రీ కాలేజీకి సంబంధించి మొదటి సంవత్సరం కేవలం 18 మంది పిల్లలు ఉంటే, 2025-26 సంవత్సరానికి 103 మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీలో చేరారు. ఈ కళాశాలకు కావాల్సిన భూమి ఉంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, భవనాలు, ప్రత్యేకంగా క్లాస్ రూము లు కావాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి గతంలో అక్కడకు వెళ్లినప్పుడు కాంపౌండ్ వాల్ ధ్వంసం చేశారు..తిరిగి కట్టించాలని ఎమ్మెల్యే అఖిలప్రియ అడిగారు. ఈ మొత్తాన్ని ఎస్టిమేట్ చేసి ప్రత్యేకంగా సాస్కి స్కీమ్ కింద పూర్తిచేసే బాధ్యత ప్రభుత్వం తీసు కుంటుంది. అవసరమైన మేరకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తాం. ఇంకా అవసరమైన ల్యాబ్స్, కంప్యూటర్స్, బెంచీలు హామీ ఇచ్చిన మేరకు ఎమ్మెల్యే పీ4 కింద సమకూర్చు కోవాలని మంత్రి సూచించారు.
9 నెలల్లో కడప గ్రంథాలయ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం
కడపలో లైబ్రరీకి సంబంధించి ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవీరెడ్డి అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్ట డం జరిగింది. ప్రత్యేకించి మంగళగిరిలో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశాం. సుమారు కోటి రూపాయలతో ఇక్కడ పిల్లలకు అవసరమైన వసతులు, కాంపిటీటివ్ పుస్తకాలు, ఇతర సౌకర్యాలు కల్పించాం. దీనివల్ల రాత్రి 8 గంటలకు కూడా అక్కడ 300 మంది వరకు ఉండి పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. నియోజ కవర్గం, జిల్లా, జోనల్, సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. కొన్నిచోట్ల ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసి కొత్త ఇన్‌ఫ్రా ఏర్పాటు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో జిల్లా గ్రంథాలయాలకు చేరాల్సిన సెస్సును సీఎఫఎంఎస్ ద్వారా డైరెక్ట్‌గా ట్రెజరీకి తెచ్చారు. ఆ విషయాన్ని సీఎం, ఆర్థికమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఈ ఏడాది నుంచి ఆ నిధులు మా శాఖకు అందిస్తున్నారు. తొమ్మిది నెలల్లో కడప గ్రంథాలయాన్ని పూర్తిచేసే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.
దాతల సహకారంతో బలోపేతానికి అవకాశం
ప్రజాప్రతినిధులు వారి ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, ఉన్నత స్థానాలకు చేరిన అలూమినీల ద్వారా నిధులు సమకూరిస్తే గ్రంథా లయాలను మరింత బలోపేతం చేయడానికి అవకాశమేర్పడు తుంది. గుంటూరులో ఎంపీ, ఎమ్మెల్యేలు సంయుక్తంగా సీఎసఆర్ నిధులతో జోనల్ గ్రంథాలయాన్ని అభివృద్ధి చేశారు. మండలి బుద్దప్రసాద్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని కోరారు. సెంట్ర ల్ లైబ్రరీ, గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ రెండూ ఇంటిగ్రేట్ చేసి అద్భుతమైన సెంట్రల్ లైబ్రరీ, ట్రైనింగ్ సెంటర్, తెలుగు కల్చరల్ సెంటర్ అమరావతిలో ఒకే క్యాంపస్‌లో ఏర్పా టు చేస్తాం. త్వరలో డిజైన్ ఫైనలైజ్ చేసి దేశంలోనే అత్యుత్తమ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేసే బాధ్యత తమదని లోకేష్ తెలిపా రు. చదవడం వల్ల క్రియేటివిటీ, కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. పిల్లలను స్మార్ట్‌ఫోన్లు, ఐప్యాడ్‌లకు దూరం పెట్టడంలో గ్రంథాల యాలు కీలకపాత్ర వహిస్తాయి.
రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. కొన్ని చోట్ల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. ఇందుకు ఒక కార్యాచరణ రూపొందించాం. రాబోయే మూడేళ్లలో అవి పూర్తిచేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో ఉన్న అద్భుతమైన జోనల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. అది ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తే విద్యార్థులు, యువతకు పోటీపరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుంది. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీకి దీటుగా విశాఖలో ఏర్పాటు చేస్తాం. రాయలసీమ కేంద్రంగా కూడా అద్భుతంగా, అన్ని హంగులతో జోనల్ లైబ్రరీ యాంపి థియేటర్, ఆడిటోరియం, పోటీపరీక్షలకు కావాల్సిన పుస్తకాలు ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.











