- విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి
- సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి
- తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి
- 22వ ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 22వ రాష్ట్రస్థాయి. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఎస్ఐపీబీ సమావేశానికి వర్చువల్‌గా మంత్రులు లోకేష్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నారాయ ణ, కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారు. లకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, ఇంధన శాఖ, పర్యాటకం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో వివిధ పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీలో అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలి పారు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు పెట్టుబడులుగా మారి ఉత్పత్తి ప్రారంభించే అంశంపై దృష్టి పెట్టాలని దిశా నిర్దేశం చేశారు. మొత్తం 714 ఒప్పందాల్లో 519 ప్రాజెక్టులకు సంబంధిం చి కార్యాచరణ ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు. పెట్టుబడుల సదస్సు నిర్వహించేందుకు వీలుగా విశాఖపట్నంలో ఓ అంతర్జాతీయ స్థాయి అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటయ్యే లా చూడాలని ఆదేశించారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖలు కీలకమని సీఎం మార్గనిర్దేశం చేశారు. లాజిస్టిక్స్ హబ్ భాగంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్ రైల్ కనెక్టివిటీతో పాటు తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశా రు. సెమీ కండక్టర్ రంగంలో తయారీ యూనిట్లతో కూడిన ఎకోసిస్టం రాష్ట్రంలో ఏర్పాటు కావాలని సూచించారు.













