- అదే హింస…అవే అబద్ధాలు…అవే అరాచకాలు
- వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా?
- ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు
- స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు
- నేం రాజకీయాలతో ఫ్యాక్షనిజం, నక్సలిజం తరహా సమస్యలు
- దాడులు చేస్తుంటే రాష్ట్రాన్ని రాక్షసులకు వదిలేయాలా?
- ఎన్నికలే కాదు…మేనకోడలు పెళ్లికి సైతం అడ్డుపడుతున్నాడు
- గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి విలువలే కాదు… బంధాలూ లేవు
- నేరాలు, రౌడీయిజం చేసే వారిని ప్రజలు హర్షించరు
- జగన్రెడ్డి లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి రాష్ట్రానికే ప్రమాదం
- ఆ పార్టీ హింసా రాజకీయాలపై ప్రజల్లోనూ చర్చ జరగాలి
- రాష్ట్ర ప్రతిష్ఠ దిగజార్చాలని చూస్తే ఏమాత్రం సహించబోం
- మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లు, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలను వివరిస్తూ శనివారం క్యాంప్ కార్యాల యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిం చారు. గొడ్డలి పార్టీ ఘాతుకాలను, అకృత్యాలను వీడియోలు ప్రదర్శించి ఎండగట్టారు. అదే హింస, అవే అబద్ధాలు, అవే అరాచకాలు పేరుతో బుక్లెట్ విడుదల చేశారు. జగన్లాంటి వ్యక్తులను ఎంచుకోవటం వల్ల సమాజానికి భద్రత ఉంటుందా అనేది ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల జరక్కూడదన్నదే వైసీపీ సింగిల్ అజెండా.. అందుకే బరితెగించి హింసాత్మక ఘటనలకు తెగబడుతోంది.. వారి అరాచ కాలను చూస్తూ వదిలివేయలేం.. రాష్ట్ర ప్రతిష్ఠ దిగజార్చాలని చూస్తే ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. ఎవరు మంచి చేశారో వారికి మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు.
అమరావతి(చైతన్యరథం): జగన్ అన్ని విధాలా ఫెయిల్యూర్ వ్యక్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ చేసిన అరాచకాలను వివరిస్తూ శనివారం క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో గొడ్డలి పార్టీ ఘాతుకాలను, అకృత్యాలను వీడియోలు ప్రదర్శించి ఏకరువు పెట్టారు. అదే హింస, అవే అబద్దాలు, అవే అరాచకాలు పేరుతో బుక్లెట్ విడుదల చేశా రు. ఇదే క్రమంలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడి నైజాన్ని వివరించారు. సీఎంగా, పార్టీ నాయకుడిగా, విద్యార్థిగా, కొడుకుగా, అన్నగా, ఓ పౌరుడిగా ఇలా అన్నిట్లోనూ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు విఫలం అయ్యాడు. కనీసం పౌరుడిగానూ ఆలోచన చేసే శక్తి అతనికి లేకుండా పోయింది. ఇలాంటి వ్యక్తులను ఎంచుకోవటం వల్ల సమాజానికి భద్రత వస్తుందా అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరికి నేర చరిత్ర ఉందో ప్రజలు అర్థం చేసుకుని వ్యవహరించా లి. ప్రజాహితం కోసం కూటమి రాజ్యాంగబద్ధంగా పని చేస్తుంది. అందరి చరిత్ర తెరిచిన పుస్తకమే. ఎవరు మంచి చేశారో వారికి మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కోరారు.
తొలిరోజు నుంచి అరాచకాలు
రాష్ట్రంలో వైసీపీ నేరమయ రాజకీయాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలిరోజు నుంచి అడ్డంకులు సృష్టించే ప్రయ త్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దౌర్జన్యాలకు పాల్పడ్డారు. గొడ్డలి పార్టీకి చెందిన ఓ ఎంపీ వాహనంతో ఎన్డీఏ కార్యకర్తలను తొక్కించారు. ఆ కారులో మద్యం బాటిళ్లు మారణా యుధాలు ఉన్నాయి. పుంగనూరు, రాయచోటి, కనిగిరి, దర్శి, కడప తంబళ్లపల్లె, తిరుపతి ఇలా వేర్వేరు ప్రాంతాల్లో అరాచకం సృష్టించారు. రాష్ట్రం తగులబడి పోయినా ఫర్వాలేదని… తమ అజెండా నెగ్గాలనే ఆలోచనతోనే వైసీపీ ఇదంతా చేసింది. పంజాబ్ రాష్ట్రం నుంచి కిరాయి ముఠాలను తీసుకువచ్చి భయబ్రాంతులకు గురిచేశారు. కనిగిరిలో నామినేషన్ కేంద్రంలోకి వైసీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. తంబళ్లపల్లెలో జనసేన కార్యాలయంపై దాడి చేశారు. హింసాత్మక రాజకీయాలను ప్రొత్సహిస్తున్న వైసీపీ విధానంపై ప్రజల్లో చర్చ జరగాలని పేర్కొన్నారు.
హింస చేస్తోంది వాళ్లే… పిటిషనర్లూ వాళ్లే…
ఎస్ఈసీ నిబంధనల ప్రకారమే కూటమి పార్టీలు వ్యవహరి స్తున్నాయి. కానీ దీనికి విరుద్ధంగా వైసీపీ వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఫేక్ ప్రచారం, సొంత మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. హింస చేస్తోంది వాళ్లే, పిటిషనర్లూ వాళ్లే.. ఇదెక్కడి అరాచకం. గతంలో బాబాయిని హత్య చేసి ఫేక్ ప్రచారం చేశారు. ఇప్పుడూ అదే తంతు. ఫేక్ ప్రచారం చేసి పిటిషన్లు వేస్తున్నారు. కోర్టులకు వెళ్లి తప్పుడు లిటిగేషన్లు వేసి క్రిమినల్ లిటిగెంట్లుగా తయారయ్యారు. హైకోర్టుతో పాటు సుప్రీం కోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్ఈసీ ఆదేశాలు అనుసరిస్తామని కూటమి పార్టీల తరపున ప్రకటన విడుదల చేశాం. ప్రజాస్వామ్యంలో ఉండి దానికి అనుగుణంగా పనిచేయటమే మాకు తెలుసు. రాజకీయ పార్టీగా వాళ్లు చేసే అరాచకాలను చూస్తూ వదిలివేయలేం. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దాడులు చేసి వాహనాలు దహనం చేసి హింసా త్మక ఘటనలకు పాల్పడింది. రాజకీయ ముసుగులో గొడ్డలి పార్టీ నిరంతరం ఇదే తరహా ఘటనలకు పాల్పడుతోంది. అసత్యాలను పదేపదే చెబుతూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కేవ లం ప్రెస్మిట్లు పెట్టడానికే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు బెంగుళూరు నుంచి అమరావతికి వచ్చి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.
ఇలాంటి క్రిమినల్స్ను ఎప్పుడూ చూడలేదు
బెంగుళూరులో కుట్రలు చేయడం… ఏపీకి వచ్చి ఆరోపణలు చేయడం ఇదే గొడ్డలి పార్టీ చేస్తున్న పని. హిట్ అండ్ రన్ తరహా లో బురద చల్లేసి వెళ్లిపోతున్నాడు. వైసీపీకి చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ జరిగిందని స్పష్టంగా చెబితే ఆ పార్టీ అధ్యక్షుడు మాత్రం అసత్యాలు చెబుతాడు. గత పాలనలో జరిగిన స్థానిక సంస్థల్లో 24 శాతం ఏకగ్రీవాలు చేసు కున్నారు. రాజ్యాంగ పదవిలో పనిచేసిన వ్యక్తి అరాచకాలు సృష్టిం చి ఏకంగా అప్పటి ఎస్ఈ సీనే భయపెట్టారు. ఆయన ప్రాణ భయంతో కేంద్రం నుంచి భద్రత తీసుకోవాల్సిన పరిస్థితి. రాజకీ యాల్లో ఇలాంటి క్రిమినల్స్ను నేనెప్పుడూ చూడలేదు. నేరస్థులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి నానాయాగీ చేస్తున్నారు. రాజకీయ పార్టీగా వైసీపీ దాడులకు తెగబడింది, హింసకు ప్రేరేపించింది. మా కూటమి ఎప్పుడూ హింసకు పాల్పడదు, ప్రేరేపించదని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థలు జరక్కూడదన్నదే వైసీపీ అజెండా
స్థానిక సంస్థల ఎన్నికల జరక్కూడదన్నదే వైసీపీ సింగిల్ అజెం డా. అందుకే బరితెగించి హింసాత్మక ఘటనలకు తెగబడుతోంది. గతంలోనూ.. ఇప్పుడూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే బాధితులు. మా వాళ్లనే కొట్టి ఎదురుదాడికి పాల్పడుతోంది వైసీపీ. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అభివృద్ధికి ఓ అవకాశంగా భావించాం. ఆ పార్టీ ఈ అభివృద్ధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. నేరమయ రాజకీయాల్ని ఛేదించటం సవాలే కానీ కష్టమేమీ కాదు. ఫ్యాక్ష నిజం, నక్సలిజం వంటి సమస్యలు చూశాం. కానీ ఏకంగా ఓ రాజకీయ పార్టీ చేస్తున్న నేరమయ రాజకీయాలతో అలాంటి సమ స్యలు ఉత్పన్నం కావడం తొలిసారి చూస్తున్నా. వైసీపీ వాళ్లు నామి నేషన్లు వేసుకునేందుకు పోలీసులు పూర్తి భద్రత కల్పించారు. ఇంత చేస్తున్నా కోర్టుకు వెళ్లి లేనిపోని పిటిషన్లు, ఫిర్యాదులు చేస్తున్నారు. పోటీ చేయకుండా టీడీపీ వెనక్కు తగ్గిపోవాలా? ప్రజాస్వామ్యంలో ఇదెక్కడి చోద్యం. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు తెచ్చి ప్రజల ఆస్తులపై ఫొటోలు వేసుకున్న వ్యక్తి కూడా ఆస్తుల గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు.
నాడు పులివెందుల, కడపలో ఏకగ్రీవాలు దౌర్జన్యం కాదా?
గత స్థానికసంస్థల ఎన్నికల్లో పులివెందులలో 33 సీట్లూ ఏకగ్రీవ కావటం దౌర్జన్యం కాదా? కడపలో 79 శాతం ఎంపీ టీసీలు, జెడ్పీటీసీలు 76 శాతం ఏకగ్రీవం చేసుకున్నారు. జగన్ గురి వింద తరహాలో మాట్లాడుతున్నారు. కుప్పం, పిఠాపురం, మంగళగిరిలో స్వేచ్ఛగానే నామినేషన్లు వేశారు. శాంతి భద్రత లకు ఎట్టి పరిస్థితుల్లోనూ విఘాతం కలగనివ్వం. హింసకు ప్రతిహింస మా విధానం కాదు. అదే సమయంలో భయపడి వెన్ను చూపేది లేదు. నిన్న మూడుగంటల పాటు గొంతు చించు కున్న వ్యక్తి తమ కార్యకర్తలది తప్పని ఎక్కడా చెప్పలేదు. పులి వెందులలో ఎప్పుడూ ప్రజాస్వామ్యం లేదు. నాడు ఎదురు మాట్లాడిన వారి గొంతు నొక్కేశారు. ఇప్పుడు కూటమి పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థను చూశాక వారికి ఫ్రస్టేషన్ పెరిగిపో తోంది. కుట్రలు కుతంత్రాలతో రక్తపాతం సృష్టించాలని ప్రయ త్నం చేస్తున్నారు. వారి ఆటలు సాగనివ్వం. రాష్ట్ర ప్రతిష్ఠ దిగజా రేందుకు మేం ఏమాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.
స్వేచ్ఛగా నామినేషన్లు వేసుకుని గగ్గోలు పెడుతారా
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. 28 జిల్లాల్లో 9829 ఎంపీటీసీలకు గానూ మొత్తం 51,902 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 659 జెడ్పీటీసీ స్థానాలకు గానూ మొత్తం 5724 నామినేషన్లు వేసుకోగలిగారు. 2021లో జరిగిన స్థానిక ఎన్నిక ల్లో నాటి ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. నామినేషన్లు వేసు కునే అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ ఇప్పుడు స్వేచ్ఛగా ఇంత పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు పడినా గొడ్డలి పార్టీ గగ్గోలు పెడుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపే మా ప్రయత్నాలకు ఇలాంటి వ్యక్తులు అడ్డుపడితే అది కుంటు పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
గొడ్డలి పార్టీ చర్యలతో రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతోంది
2019-24 మధ్య ప్రజలు నిద్రలేని రాత్రులు గడిపారు. కనీసం రోడ్లపైకి కూడా రాలేని పరిస్థితి. 2024లో కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో ప్రజల మద్దతు సాధించింది. ప్రజలు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ అను నిత్యం కష్టపడుతున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనపై దృష్టి పెట్టి కోల్పోయిన బ్రాండ్ను పునరుద్ధరించాం. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీ బ్రాండ్తోనే సాధించగలిగాం. వేగంగా అనుమతులు ఇస్తే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, ఎక్కువ మందికి ఉద్యోగాల కల్పన జరుగుతుంది. కేవలం ఒప్పందాలే కాదు ఉత్పత్తి దశకు వెళ్లేంత వరకూ ఫాలో అప్ చేస్తున్నాం. ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయని పొరుగు రాష్ట్రాలు యావత్ దేశం గుర్తించింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రా మివేత్తలు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టుబడుల కోసం… పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్గించడం కోసం ఎస్రో ఖాతాల ద్వారా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు అంది స్తున్నాం. ప్రజలు ఒక్క నిముషం ఏమరు పాటుగా ఉన్నా వైసీపీకి చెందిన వ్యక్తులు నిలువునా ముంచేస్తారు. గొడ్డలి పార్టీ చేసే చర్యల వల్ల రాష్ట్ర ప్రతిష్ట దిగజారుతోందని ఆవేదన చెందారు.
బీసీలకు న్యాయం చేస్తున్నా ఆడ్డుకున్నారు
సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపించాం. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే కేసులతో అడ్డుకున్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు, రాయలసీమ రైజింగ్ గ్లోబల్ హార్టీ కల్చర్ హబ్ మార్చాం. ఎల్నినో లాంటి తీవ్ర కరువుతో లోటు వర్షపాతం ఉంది. కానీ సమర్ధ నీటి నిర్వహణతో ప్రభావాన్ని తగ్గించగలిగాం. గత పాలకులు జల్ జీవన్ మిషన్ సక్రమంగా వినియోగించుకుని ఉంటే ఇవాళ రాష్ట్రానికి ఇబ్బందులు ఉండేవి కావు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిర్వీర్యం చేసి నిధులు మళ్లించేశారు. కేంద్రంతో సంప్రదింపులు జరిపి జగ్జీవన్ మిషన్ లాంటి వాటిని పున
రుద్ధరించాం. స్థానిక సంస్థలకు నిర్దేశించిన ఆర్థిక సంఘం నిధుల్ని కూడా సక్రమంగా వాటికే వెళ్లేలా చేస్తున్నాం. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేకపోతే స్థానిక సంస్థలకు అభివృద్ధి నిధు లు వచ్చే పరిస్థితి ఉండదు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక సంస్థల ద్వారా స్వపరిపాలన ఉంటేనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందు తాయి. బీసీలకు న్యాయం చేయాలని 34 శాతం రిజర్వేషన్ చేస్తే వైసీపీ 59 పిటిషన్లతో అడ్డుకుంది. దీనికోసం ఓ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు పూర్తిస్థాయి న్యాయం జరిగేలా చేశాం. జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇవ్వటంతో పాటు పార్టీ పరంగానూ న్యాయం చేయగలిగామని తెలిపారు.
మేనకోడలు వివాహానికీ అడ్డంకులే.. విలువలు లేని వ్యక్తి
రాజకీయ పార్టీలకు వ్యక్తిగత విద్వేషాలు ఉండకూడదు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కలిసి పనిచేయాలి. కానీ ఏపీలోని ఓ పార్టీకి అవేమీ పట్టవు. వ్యక్తిగత కక్షలే వారి అజెండా. ఫ్యాక్షన్ మనస్తత్వం కలిగిన వ్యక్తి నుంచి అంతకంటే ఎక్కువ ఊహించ లేం. సీబీఐ, ఈడీ లాంటి కేసులు చుట్టూ ఉన్నాయి. అక్రమాస్తుల కేసులు, మద్యం అక్రమాలు ఇలా ఎన్నో కేసులు ఎదు ర్కొంటున్నారు. అతని కారణంగా ఎంతోమంది అధికారులు, రాజకీయ పార్టీ నేతలు జైలుకు వెళ్లారు. ఆ పార్టీ అధ్యక్షుడి వ్యవహార శైలి అంతా విధ్వంసం మాత్రమే. బాబాయిని చంపేసి నేరం చెల్లెలిపై నెట్టేశాడు. నిందితుడిని అరెస్టు చేయడానికి సీబీడా వస్తే అడ్డుకున్న వ్యక్తి విలువల గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. రాజకీయ విలువలు ఎటూ లేవు.
కనీసం నైతిక విలువలు కూడా లేకుండా పోయా యి. కుటుంబ విలువలు వదిలేసి ఆస్తుల కోసం సొంత తల్లికి, చెల్లికి కూడా అన్యాయం చేస్తున్నాడు. మేనకోడలు వివాహానికి యలహంక ప్యాలెస్ ఇవ్వనని చెబుతున్నాడు. ఇదేం చోద్యం. ఆస్తిలో చెల్లెలికి కూడా భాగం ఉంది. మేనకోడలి పెళ్లిని అడ్డుకు ని కంస మామగా తయారయ్యాడు. అతని మనస్తత్వం రాష్ట్రానికి ఎంత ప్రమాదకరం అన్నది ప్రజలకు కూడా తెలియాలి. రక్త బంధానికి కూడా విలువ ఇవ్వని వ్యక్తి ఇక ప్రజలకు ఏం విలువ ఇస్తారు. ప్రజల సమస్యల గురించి చర్చించడానికి అసెంబ్లీకి రమ్మంటే అక్కడికీ రావటం లేదు. అలాంటి వ్యక్తులను ఎంచుకోవటం వల్ల సమాజానికి భద్రత వస్తుందా అనేది ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరికి నేర చరిత్ర ఉందో ప్రజలు అర్థం చేసుకుని వ్యవహరించాలని కోరారు.















