- రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది
- రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు నిధులు విడుదల చేయండి
- వైజాగ్ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధికి సహకరించండి
- ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీలో సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీలో రెండు భారీ తుఫాన్లతో భారీ నష్టం సంభవించిం దని… రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయాన్ని అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం ఆమెతో భేటీ అయ్యారు. రెండు తుఫాన్ల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారమే సుమారు రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు చెప్పారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటిం చాయని… వారు కూడా వీలైనంత త్వరలో నివేదిక సమర్పిస్తా యని చెప్పారు. రాష్ట్రంలో విశాఖ, అమరావతి, తిరుపతి రీజియ న్ల వారీగా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు చేపట్టినట్టు తెలిపారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్, విశాఖ ఎకనమిక్ రీజియన్ అభి వృద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని కోరారు. అలాగే విశాఖ సీఐఐ సదస్సులో వచ్చిన పెట్టుబడుల వివరాలను వివరించారు.
న్యూఢిల్లీ(చైతన్యరథం): ఏపీలో రెండు భారీ తుఫాన్ల తాకిడితో పంటలు సహా వివిధ రంగాలకు భారీ నష్టం సంభవించిందని… రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయాన్ని అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మంగళవారం నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, హార్టికల్చర్ హబ్, పూర్వోదయ నిధులు విడుదల, ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు వంటి అంశాలపై కేంద్రమంత్రితో చర్చించారు. అలాగే విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు, ఆ సదస్సు వేదికగా తీసుకున్న నిర్ణయాలపై భేటీలో ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రాన్ని ఇటీవల కాలంలో తాకిన ఆర్నబ్, మురసు తుఫాన్ల వల్ల కలిగిన నష్టం గురించి సీఎం చంద్రబాబు వివరించారు. ఈ రెండు తుఫాన్ల వల్ల ప్రాథమిక అంచనా ప్రకారమే సుమారు రూ.7 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు చెప్పారు.
తుఫాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను సీఎం వివరించారు. చేతికందే పంట నీటి పాలైందని ముఖ్యమంత్రి వివ రించారు. ఎలినినో ప్రభావం ఉన్నా… రైతులను గట్టెక్కించేం దుకు పట్టిసీమ ద్వారా కొన్ని ప్రాంతాలకు సాగు నీరందిం చామని… కానీ తుఫాన్ల తాకిడితో పంటలు వేసుకున్న రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. దీంతో పాటు తీర ప్రాంతంలో మౌలికవసతులు భారీఎత్తున దెబ్బతిన్నాయని… ముఖ్యంగా విద్యు త్ వ్యవస్థ ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. రాష్ట్రానికి తుఫాన్ల వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆర్నబ్, మురసు తుఫాన్ల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయని… వారు కూడా వీలైనంత త్వరలో నివేదిక సమ ర్పిస్తాయని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తక్షణ సాయం అందించగలిగితే కొంతమేర ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని వివరించారు.
ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
కేంద్ర ఆర్థిక మంత్రితో జరిగిన భేటీలో రాష్ట్రంలో చేపడుతోన్న అభివృద్ధి ప్రణాళికల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్ల వారీగా ఆర్థికాభివృద్ధికి ప్రణాళికలు చేపట్టినట్టు తెలిపారు. దీంట్లో భాగంగా రాయలసీమ హార్టికల్చర్ హద్‌కు ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హార్టికల్చర్ హబ్‌లో భాగంగా వివిధ స్థాయిల్లో మౌలికవసతుల అభివృద్ధి చేపడుతున్నామని చెప్పారు. గ్రామాలకు రోడ్ నెట్వర్క్, ఇరిగేషన్ అభివృద్ధి పనులు, డ్రిప్ ఇరిగేషన్ వంటి మీద ఫోకస్ పెట్టామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.
అలాగే విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృ ద్ధికి అవసరమైన నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఎకనమిక్ రీజియన్ శర వేగంగా అభివృద్ధి చెందుతోం దని… దీనికి ఇప్పటికే కేంద్రం నుంచి వివిధ మార్గాల్లో సహకా రం అందుతోందని.. దీనికి అదనంగా మరింత సాయం అందిం చగలిగితే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని వివరిం చారు. ఈ సందర్భంగా ఇటీవల సీఐఐ భాగస్వామ్య సదస్సు అంశం ప్రస్తావనకు వచ్చింది. రెండురోజుల పాటు జరిగిన సదస్సులో తీసుకున్న నిర్ణయాలు, వచ్చిన పెట్టుబడులు, వివిధ అంశాలపై జరిగిన చర్చల సారాంశాన్ని నిర్మలా సీతారామను సీఎం వివరించారు. ఈ సదస్సు పారిశ్రామిక అభివృద్ధికి తోడ్ప డేలా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు సహా ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




















