జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ
జపాన్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, ఆమె తండ్రి సురేంద్రకుమార్ గారిని ఉండవల్లి నివాసంలో కలిశాను. ఏషియన్ గేమ్స్‌లో తన ప్రతిభతో స్వర్ణం కైవసం చేసుకున్న జ్యోతి సురేఖను అభినందించాను. అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని ప్రశంసించాను. 2028 ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని, అన్నివిధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చాను.