- పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఎంవోయూ
- సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
- సైబర్ నేరాలు, మోసాలకు అడ్డుకట్టే లక్ష్యం
అమరావతి(చైతన్యరథం): అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలకమైన ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందుకు వచ్చింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ లో క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఏపీ క్వాంటం మిషన్- పంజాబ్ నేషనల్ బ్యాంక్ మధ్య ఒప్పందం కుది రింది. ముఖ్యమంత్రి చంద్రబాబు- పీఎన్బీ సీఈవో, ఎండీ అశోక్ చంద్ర సమక్షంలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. దేశం లో బ్యాంకింగ్ రంగం కోసం ప్రత్యేకంగా క్వాంటం ఫైనాన్స్ ఇన్నో వేషన్ హబ్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న మొట్టమొదటి బ్యాంక్గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిలిచింది. బ్యాంకింగ్ సేవల్లో సైబర్ భద్రతను పటిష్టం చేయటంతో పాటు ఆర్థిక మోసాలను ముందుగా గుర్తించే వ్యవస్థ ఏర్పాటు, భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలను సురక్షితంగా నిర్వహించేం దుకు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తోంది. పరిశ్రమలు, విద్యా సంస్థలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలతో పాటు ప్రభుత్వ ఏజెన్సీలను కూడా ఒకే వేదికపైకి తెచ్చేలా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ పని చేయ నుంది. క్వాంటం కంప్యూటింగ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేం దుకు అవసరమైన నైపుణ్యాలను కూడా పెంపొందించేలా ఈ హబ్ పనిచేయనుంది.
డిజిటల్ లిటరసీపై ప్రత్యేక కార్యాచరణ
అమరావతిని క్వాంటం సహా డీప్ టెక్నాలజీలకు కేంద్రంగా మార్చాలని సంకల్పించామని సీఎం చంద్రబాబు స్పష్టం. చేశారు. ఏక్యూవీలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్వాంటం ఏఐ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయటం మరో కీలకమైన మైలురాయి అవుతుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వ హించే వినియోగదారులతో పాటు ప్రజలకు డిజిటల్ లిటరసీ పెంచే దిశగా కృషి చేయాలని పీఎన్బీ ఉన్నతాధికారులకు సూచిం చారు. ఈ దిశగా ప్రభుత్వాలు- బ్యాంకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలకు:
అడ్డుకట్ట వేయటంలో టెక్నాలజీ మరింత విస్తృతమవ్వాలని సూచించారు. క్వాంటం టెక్నాలజీ ద్వారా డిజిటల్ లావాదేవీలకు భద్రతను అత్యుత్తమ స్థాయిలో అందించాలని స్పష్టం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ను మరింత పటిష్టంగా, సులభతరంగా సేవ లు అందించేలా క్వాంటం ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ను అమరావ తిలో ఏర్పాటు చేస్తున్నట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఈవో ఎండీ అశోక్ చంద్ర సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో పీఎన్బీ ఉన్నతాధికారులు, అమరావతి క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ పాల్గొన్నారు.














