అమరావతి (చైతన్య రథం):కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో తెలుగుదేశం పార్టీ గొప్ప మైలురాయి సాధించిందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈమేరకు ఎక్స్లో పోస్టు పెడుతూ.. “ఇంటింటికీ తెలుగుదేశం-2026″ కార్యక్రమం విజయవంతంగా కోటికి పైగా ఇళ్లకు తీసుకెళ్లిన కార్యకర్తలు, నేతలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంటింటి పర్యటనల్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను కలిసి వివరించిన తీరు చాలా బాగుంది. కోటి ఇళ్లు సందర్శించడమే కాకుండా ఆయా కుటుంబాల సమస్యలు, స్థానిక అవసరాలు, ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన తెలుగుదేశం కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.














