చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • జిల్లా వెబ్ సైట్ లు
    • అనంతపురం
    • అనకాపల్లి
    • అన్నమయ్య
    • అల్లూరి సీతారామరాజు
    • ఎన్టీఆర్
    • ఏలూరు
    • కర్నూలు
    • కాకినాడ
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • నంద్యాల
    • పల్నాడు
    • పశ్చిమ గోదావరి
    • పార్వతీపురం మన్యం
    • ప్రకాశం
    • బాపట్ల
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • వైఎస్ఆర్
    • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • శ్రీసత్యసాయి
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సీమకు వైఎస్‌, జగన్‌ చేసింది శూన్యం: కాలవ

చేయనివి చేసినట్టు చెప్పడం, జగన్‌ రెడ్డి ఏదో ఉద్ధరించినట్టు తప్పుడు రాతలు రాయడం ఇదే సాక్షి తీరు అంటూ విమర్శ

by చైతన్యరధం
Jan 4, 2024 at 10:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు, రాయలసీమ
సీమకు వైఎస్‌, జగన్‌ చేసింది శూన్యం: కాలవ
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తండ్రీకొడుకులిద్దరూ సీమప్రజల భావోద్వేగాల్ని స్వార్థ రాజకీయాలకు వాడుకున్నారు
  • రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి దొంగసాక్షిలో ప్రచురించింది మొత్తం అవాస్తవమే
  • తప్పుడు మాటలు, తప్పుడు పనులు, తప్పుడు కథనాలతో జగన్‌ రెడ్డి ఎల్లకాలం ప్రజల్ని సగించలేడు
  • పదేపదే అవాస్తవాలతో ప్రజల్ని మోసగించడం, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమేనా దొంగ సాక్షి పని?
  • రాయలసీమ ప్రాజెక్టుల నిర్మాణంపై పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే దమ్ము జగన్‌ రెడ్డికి ఉందా?
  • టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లు ఖర్చుపెడితే, జగన్‌రెడ్డి పెట్టింది కేవలం రూ.2011 కోట్లే
  • హంద్రీనీవా నిర్మాణానికి చంద్రబాబు రూ.4,188 కోట్లు ఖర్చుచేస్తే, జగన్‌రెడ్డి కేవలం రూ.515 కోట్లతో సరిపెట్టాడు

అమరావతి: జగన్మోహన్‌రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పడకేశాయని, ప్రాధాన్యతా రంగ మైన సాగునీటి రంగం చతికిలబడిరదని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చూపుతున్న అంతులేని నిర్లక్ష్యం సీమ పాలిట పెనుశాపంగా పరిణమించిందని ఆవేదన వ్య క్తం చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాల యంలో బుధవారం ఆయన టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరుల తో మాట్లాడుతూ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తే, జగన్‌ రెడ్డి ఇప్పటివరకు కేవలం రూ.2,011కోట్లు మాత్రమే ఖర్చుచేశాడు.ఇంత తక్కువ ఖర్చు పెట్టిన జగన్‌రెడ్డి.. రాయలసీమ ద్రోహి కాక ఏమవుతాడో ప్రజలే ఆలోచించాలి. టీడీపీ పాలనలో చంద్రబాబునాయుడు రాయలసీమ ప్రాజెక్టులను, ముఖ్యంగా అనంతపురం జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనుల్ని పరుగులు పెట్టించారు. ఎక్కడికకక్కడ ఎప్పటి కప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, కాంట్రాక్ట ర్లు… ఇంజనీర్లతో మాట్లాడి ఆగి పోయిన ప్రాజెక్టు పనుల్ని కూడా కొనసాగేలా చూశారు. టీడీపీ ప్రభుత్వంలో ఇరి గేషన్‌ మంత్రిగా ఉన్న దేవినేని ఉమామహేశ్వరరావు కూడా అధికారులతో కలిసి స్వయంగా సాగునీటి ప్రాజె క్టుల పనుల్ని పర్యవేక్షించారు. ఆనాడు జరిగిన పనుల తో పోలిస్తే, ఈ ప్రభుత్వంలో జరిగినవి శూన్యమనే చెప్పాలని కాలవ పెదవి విరిచారు.

 

సంబంధితవార్తలు

‘తల్లికి వందనం’పై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు

నరేంద్ర మోదీ అంటే దమ్ము, ధైర్యం, భరోసా!

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది

జగన్‌ రెడ్డి ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహించారు?

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ఎన్నిసార్లు అధికారులతో సమీక్షలు చేశాడు? ఎన్నిసార్లు రాయలసీమ ప్రాజెక్టులపై చర్చలు జరిపాడు? ఇరిగేషన్‌ మంత్రిగా గతంలో ఉన్న అనిల్‌కుమార్‌ గానీ, ఇప్పుడు న్న మంత్రి అంబటి రాంబాబుగానీ ఎన్నిసార్లు అధికారు లతో సమీక్షలు జరిపి, ఎన్నిసార్లు ఏ ప్రాజెక్టుల్ని సంద ర్శించారో ప్రజలకు చెప్పాలి. రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహ న్‌రెడ్డి ఇద్దరూ రాయలసీమలో భావోద్వేగాలు రెచ్చగొ ట్టి, తమ పబ్బం గడుపుకున్నారు తప్ప సీమ ప్రజలకు చేసిందేమీ లేదు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడటంలో జగన్‌రెడ్డి ఘోరంగా వైఫల్యం చెందాడని కాలవ ఆరోపించారు.

 

శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్‌రెడ్డికి ఉందా?

రాయలసీమ శాశ్వత దుర్భిక్ష నివారణ పథకం కింద, రూ.33,868 కోట్లతో 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపడతానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చాడు. అది ఏమైందని ప్రశ్నిస్తున్నాం. తాను చెప్పిన 23 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ఎంత వరకు జరిగిందో, వాటిలో ఎన్ని పూర్తయ్యాయో, ప్రాజెక్టుల నిర్మాణానికి తన ప్రభు త్వం ఎంత ఖర్చు పెట్టిందో, ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చిం దో పూర్తి వాస్తవాలతో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము జగన్‌రెడ్డికి ఉందా అని కాలవ ప్రశ్నించారు.

 

హంద్రీనీవా కు జగన్‌రెడ్డి మొక్కుబడిగా రూ.515 కోట్లు ఖర్చుపెట్టాడు

స్వర్గీయ నందమూరి తారకరామారావు తన హయాంలో రాయలసీమ నుంచి కరువును శాశ్వతంగా పార దోలాలని గొప్ప ఆలోచన చేశారు. దానిలో భాగంగా హంద్రీనీవా, గాలేరు-నగరి సుజల స్రవంతి పథకాలు రూపొందించారు. వాటి నిర్మాణ ప్రతిపాదనలు కూడా ఎన్టీఆర్‌ హయాంలోనే సిద్ధమయ్యాయి. ఆ ప్రాజెక్టులతో పాటు టీడీపీ ప్రభుత్వం సీమలోని ఇతర ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేసింది. హంద్రీనీవా నిర్మాణానికి చంద్రబాబు నాయుడు రూ.4,188 కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటి ప్రాజెక్టు నిర్మాణానికి జగన్‌ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో పెట్టిన ఖర్చు కేవలం రూ.515 కోట్లు మాత్రమే. రాయలసీమకు అతి ముఖ్యమైన ప్రాజెక్ట్‌ అయిన హంద్రీనీవాను జగన్‌ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 6 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనీవా కాలువని విస్తరిస్తానని, దానికి సమాంతరంగా 10వేల క్యూ సెక్కుల సామర్థ్యంతో కాలువ నిర్మిస్తానని చెప్పిన మాట లు ఏమయ్యాయో జగన్‌రెడ్డి సీమవాసులకు సమాధా నం చెప్పాలి. 2020లో హంద్రీనీవా నిర్మాణానికి రూ.6,300 కోట్లు ఖర్చుపెడుతున్నట్టు జగన్‌రెడ్డి ఒక జీవో ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు దానికి సంబంధిం చిన టెండర్లే పిలవలేదని కాలవ దుయ్యబట్టారు.

 

ఒక్క శాతం పని కూడా చేయించలేదు

టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు హంద్రీ నీవా కాలువ సామర్థ్యాన్ని 3,600 క్యూసెక్కులకు విస్త రించాలని,నిర్మాణ పనులకోసం రూ.1050 కోట్లు కేటా యించి, రూ.288కోట్లు ఖర్చుచేశారు. 35శాతం పైగా పనులు పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో జరిగిన పనుల్ని జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపేశాడు. మాయమాటలతో ఇప్పటివరకు సీమ వాసుల్ని మోసగి స్తూనే ఉన్నాడు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత, హక్కు జగన్‌ రెడ్డికి లేవు. సీమలో ఏ సాగునీటి ప్రాజెక్ట్‌ చూసినా జగన్‌రెడ్డి హయాంలో వెలవెలబోతూనే కనిపి స్తోంది.గుండ్రేవుల,వేదవతి, అనంతపురం జిల్లాలో 50 వేల ఎకరాలకు బిందుసేద్యం కింద సాగునీరు అందిం చే ఉరవకొండ డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌, రూ.960 కోట్ల తో చేపట్టిన కల్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గా లకు నీళ్లిచ్చే జీడిపల్లి-భైరవాని తిప్ప ప్రాజెక్ట్‌, రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన జీడిపల్లి-పేరూరు ప్రాజెక్ట్‌, మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ పనులు, ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనులు తప్ప, జగన్‌రెడ్డి హాయాం లో ఎక్కడా ఒక్క ప్రాజెక్టులో ఒక్క శాతం పనికూడా జర గలేదు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయకుండా, రైతు లకు నీళ్లివ్వకుండా సీమకు ఎలా న్యాయం జరుగుతుం దో ముఖ్యమంత్రి చెప్పాలని కాలవ ప్రశ్నించారు.

 

దొంగ సాక్షిలో ప్రచురితమైనదంతా పూర్తిగా అవాస్తవం

రాయలసీమ ప్రాజెక్టుల గురించి సాక్షి దినపత్రికలో ప్రచురితమైన సమాచారమంతా  పూర్తిగా అవాస్తవం. చేతిలో ఉన్న దొంగసాక్షి పత్రికలో తప్పడు రాతలు, తప్పుడు వివరణలు ఇచ్చినంత మాత్రాన సీమరైతులకు నీళ్లు అందవనే వాస్తవాన్ని జగన్‌రెడ్డి గ్రహించాలి. తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఈ 4 ఏళ్ల 8 నెలల్లో సీమలో ఎన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి, ఎన్ని ఎక రాలకు నీళ్లిచ్చాడో జగన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. చేతి లో అవినీతి పత్రిక ఉందని కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో అబద్ధపు ప్రకటనలివ్వడానికేనా ప్రజలు జగన్‌రెడ్డికి అధికారమిచ్చింది? ప్రభుత్వం చేయక పోయినా చేసినట్టు చెప్పడం, జగన్‌రెడ్డి ఏదో ఉద్ధరిం చినట్టు తప్పుడు రాతలు రాయడం, పదేపదే కట్టుకథ లతో ప్రజల్ని మోసగించాలని చూడటం, ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమేనా దొంగ సాక్షి పని? నంద్యాలలో దశరథరామిరెడ్డిని జగన్‌రెడ్డి ఎందుకు అరెస్ట్‌ చేయించా డో చెప్పాలి. అతనేమీ తెలుగుదేశం పార్టీ మనిషి కూడా కాదు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడు తున్నాడనే జగన్‌రెడ్డి అతన్ని అన్యాయంగా తప్పుడు కేసుల్లో అరెస్ట్‌ చేయించి జైలుకు పంపాడు. రాయల సీమ ఉద్యమకారులు, మేధావులపై జగన్‌రెడ్డికి కక్ష ఉంది కాబట్టే, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నా డు. ఇలాంటి తప్పుడుపనులు, తప్పుడు కథనాలతో ఎంతకాలం ప్రజల్ని మోసగిస్తావు జగన్‌రెడ్డి? నిన్ను, నీ ప్రభుత్వాన్ని తరిమితరిమి కొట్టడానికి సీమ వాసులు సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశంపార్టీకి అఖండ మెజారి టీ కట్టబెట్టి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసి, రాయ లసీమ భవిష్యత్‌ను తీర్చిదిద్దుకోవడానికి, సాగునీటి ప్రాజెక్టుల్ని పూర్తి చేసుకోవడానికి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అరెస్టులు.. బెదిరింపులు.. భయోత్పాతా లు… అణచివేతల ద్వారా సీమ ఉద్యమాన్ని, సీమవా సుల పోరాటాన్ని జగన్‌ రెడ్డి అణచివేయలేడు. సొంత ప్రాంతమైన రాయలసీమ ప్రయోజనాలు కాపాడలేని జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి అనర్హుడని కాలవ స్పష్టం చేశారు.

Tags: అవినీతి సాక్షి పత్రికకాలవ శ్రీనివాసులురాయలసీమ ద్రోహిసీమ ప్రాజెక్టులు
Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 04-01-2024

Next Post

సొంత జిల్లాకు, పులివెందులకూ జగన్‌రెడ్డి చేసిందేమీ లేదు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-06-2025

కార్యకర్త
@ June 16, 2025
చైతన్యరధం ఈ పేపర్ 15-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2025

కార్యకర్త
@ June 15, 2025
పేర్ని నానీ.. నీ పాపం పండిరది, ఇక వదిలేది లేదు
ఆంధ్రప్రదేశ్

పేర్ని నానీ.. నీ పాపం పండిరది, ఇక వదిలేది లేదు

చైతన్యరధం
@ June 14, 2025
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2025
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2025

కార్యకర్త
@ June 14, 2025
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు సత్య దూరం
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు సత్య దూరం

చైతన్యరధం
@ June 14, 2025
ఆంధ్రప్రదేశ్

ఎయిమ్స్‌లో మరిన్ని వైద్యసేవలు అందించాలి

చైతన్యరధం
@ June 14, 2025
నేతన్నలకు ఆర్థికంగా ఊతం
ఆంధ్రప్రదేశ్

నేతన్నలకు ఆర్థికంగా ఊతం

చైతన్యరధం
@ June 14, 2025
అర్హులందరికీ ‘తల్లికి వందనం’ అందాలి
ఆంధ్రప్రదేశ్

అర్హులందరికీ ‘తల్లికి వందనం’ అందాలి

చైతన్యరధం
@ June 14, 2025
Load More

ముఖ్య వార్తలు

అమ్మల ముఖాల్లో ఆనందం!

అమ్మల ముఖాల్లో ఆనందం!

చైతన్యరధం
@ June 14, 2025
పేదల పాలిట వరం ఆర్డీటీ సేవలు ఆగవు..

విధ్వంసం నుంచి వికాసం వైపు..ప్రయాణానికి ఏడాది

చైతన్యరధం
@ June 13, 2025
తల్లికి వందనం అమలుకు శ్రీకారం

67 లక్షలమంది విద్యార్ధులకు ‘తల్లికి వందనం’

చైతన్యరధం
@ June 13, 2025
నేరగాళ్లకు వణుకుపుట్టాలి

తీవ్ర దిగ్భ్రాంతికరం

చైతన్యరధం
@ June 13, 2025
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

జనానికి జగన్‌ పోటు..!

చైతన్యరధం
@ June 13, 2025 6:50 AM

ఫాసిస్టు పాలనకు గోరీ కట్టిన రోజు!

చైతన్యరధం
@ June 3, 2025 6:00 AM

వేటాడాల్సింది తిమింగలాన్ని!?

చైతన్యరధం
@ May 16, 2025 7:00 AM

చంద్రబాబుపై గుడ్డి వ్యతిరేకత విడనాడాలి

చైతన్యరధం
@ May 12, 2025 6:50 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పేర్ని నానీ.. నీ పాపం పండిరది, ఇక వదిలేది లేదు

పేర్ని నానీ.. నీ పాపం పండిరది, ఇక వదిలేది లేదు

చైతన్యరధం
@ June 14, 2025
శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు సత్య దూరం

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు సత్య దూరం

చైతన్యరధం
@ June 14, 2025

ఎయిమ్స్‌లో మరిన్ని వైద్యసేవలు అందించాలి

చైతన్యరధం
@ June 14, 2025
నేతన్నలకు ఆర్థికంగా ఊతం

నేతన్నలకు ఆర్థికంగా ఊతం

చైతన్యరధం
@ June 14, 2025
మరిన్ని
పార్టీ సమాచార చందాదారులు అవ్వండి
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist