- స్వయం సమృద్ధితో ఇతరులకు ఆసరాగా నిలుస్తున్నారు
- గ్రామీణ జీవనోపాధి మిషన్ వారికి కేంద్రం ప్రాధాన్యం
- గ్రామాల రూపురేఖలను మార్చే నాయకత్వం అందిస్తోంది
- లఖ్పతి దీదీ కార్యక్రమం ద్వారా దిశానిర్దేశం చేస్తోంది
- ఆర్థికంగా ఎదిగి రాష్ర్ట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి
- విజయవాడ రావడం ఎంతో ఆనందం కలిగించింది
- సరస్ మేళా ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
విజయవాడ(చైతన్యరథం): దుర్గాదేవి ఉత్సవాల నేపథ్యంలో పున్నమిఘాట్లో ఏర్పాటు చేసిన సరస్ మేళాలో భాగంగా ‘లభపతి దీదీ’ మేళాను నిర్వహించడం ఒక విశేషమైన కలయికగా భావిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పున్నమిఘాట్ లో జాతీయ సరస్ మేళాను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్రమంత్రులు శివరాజ్సంగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ విజయ వాడకు రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని తెలిపారు. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునే అవకాశం లభించిందన్నారు. గ్రామీణాభివృద్ధి అంటే గ్రామాల వికాసమని చెప్పుకొచ్చారు. మహి ళల స్టాళ్లను సందర్శించే అవకాశం దక్కిందని.. వారి ఉత్సాహం చూస్తుంటే మహిళలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని స్పష్టమవుతోం దన్నారు. ఒకప్పుడు మహిళలు వెనుకబడి ఉండేవారని.. కేవలం కుటుంబ సంరక్షణకే పరిమితమై ఆర్థికంగా చిన్న చిన్న అవసరాల కోసం కూడా ఇతరులపై ఆధారపడే పరిస్థితి ఉండేదని చెప్పు కొచ్చారు. కానీ నేడు మహిళలు సంపూర్ణంగా స్వయం సమృద్ధి సాధించారని తెలిపారు. అంతేకాకుండా ఇతరులకు
కూడా ఆసరాగా నిలుస్తున్నారని తెలిపారు.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ లక్ష్యసాధనలో మహిళల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆలోచన, మహిళల సంకల్పం దేశంలోని ముఖ్యమంత్రులందరి ఉమ్మడి కృషి ఫలితం గా మహిళా సాధికారత సాగుతోందని తెలిపారు. 2047 కంటే ముందే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంద నడంలో ఎటువంటి సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళల భాగస్వామ్యం అత్యంత కీలకమైనదని వెల్లడిం చారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక, సాంకేతిక సామాజిక సాధికరత దిశగా కొత్త మార్గం లభించిందన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు కుటుంబంలో ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ మహిళల భాగస్వామ్యం పెరిగిందని పేర్కొన్నారు. భారతదేశం భిన్న భాషలు, మహిళలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ప్రస్తుత గ్రామీణ ప్రాంతాల్లో 50 శాతం మంది మహిళలు రాజకీయాల్లో భాగస్వాములవుతున్నారు. ఒకప్పుడు బ్యాంకుల వద్దకు వెళ్లడానికి సంకోచించిన మహిళలు నేడు ఎవరి సాయం లేకుండా స్వయంగా బ్యాంకులకు వెళ్లి తమ పనులను స్వతంత్రంగా చక్కబెట్టుకుంటున్నారని తెలిపారు. అంత్యోదయ సమగ్ర దృక్పథానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం తన గ్రామీణ జీవనోపాధి మిషన్లో మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందన్నారు. మహిళలే గ్రామాల రూపురేఖలను మార్చే నాయకత్వాన్ని అందిస్తున్నారని చెప్పారు. భారత ప్రభుత్వం లఖ్పతి దీదీ కార్యక్రమం ద్వారా గ్రామీణ మహిళా సాధికారతకు ఒక ప్రత్యేకమైన వేగం, దిశానిర్దేశం అందించిందని వివరించారు.
నైపుణ్యాభివృద్ధిలో కొత్త అవకాశాలు
డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధనం వంటి ఆధునిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ వారికి నైపుణ్యాభి వృద్ధిలో కొత్త అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. గవర్నర్గా ఉన్న సమయంలో అక్కడి గ్రామీణ ప్రజలకు సేవచేసే అవకాశం లభించిందన్నారు.
మహిళలు ల్యాప్ టాప్ ను ఉపయోగిస్తూ ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఎంత లాభం పొందుతున్నారు, భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి అనే వివరాలను స్వయంగా ల్యాప్టాప్లలో నమోదు చేసుకుంటూ పనులు చేసుకునే వారని తెలిపారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలని, కుటుంబంతోపాటు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.















