విజయవాడ(చైతన్యరథం): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత పవిత్ర మైన మూలా నక్షత్రం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య కనకదుర్గమ్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.. మరోవైపు మూలా నక్షత్రం సందర్భంగా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలు కల్పించనున్నారు. సామాన్య భక్తులకు సులభంగా, వేగంగా ఉచిత దర్శనం కల్పించాలని ఆలయ అధికారులు నిర్ణ యించారు. సాధారణ భక్తుల రద్దీ దృష్ట్యా అంత రాలయ దర్శనాలు, వీఐపీ ప్రోటోకాల్, సిఫార్సు దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. శక్రవారం సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. భక్తులందరికీ ముఖ మండపం నుంచే సరస్వతీ దేవి అలంకార దర్శనం కల్పించనున్నారు. అలాగే కొండపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్త కుండా ఎటువంటి ప్రైవేటు వాహనాలను అనుమతించకూడదని ఆలయ అధికారులు నిర్ణయించారు. సర్వీస్ పాసులతో సహా ఇప్పటికే జారీ చేసిన అన్ని రకాల వాహన పాసులను తాత్కాలికంగా హోల్డ్లో ఉంచనున్నారు. అత్య వసర అధికారిక రవాణాకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆలయ అధికారులు నిర్ణయించారు.
















