చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

by చైతన్యరధం
Jun 13, 2026 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ప్రజల నమ్మకాన్ని పొందాం… నిలబెట్టుకుంటాం
  • వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది
  • ప్రధాని మోదీ చేయూతను మరువలేం
  • మేనిఫెస్టో అమలుపై చర్చకు సిద్ధం
  • కూటమిది పాజిటివ్ పాలిటిక్స్… గొడ్డలి పార్టీది పాయిజన్ పాలిటిక్స్
  • నాడు రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారు… నేడు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
  • రాజధానిపై మూడు ముక్కలాట… మావిగనో…? వాటికనో…?
  • ఎమ్మెల్యేలు ప్రజా సేవకులే కానీ పెత్తందారులు కాదు
  • ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను… చర్యలుంటాయ్
  • ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

తిరుపతి (చైతన్యరథం): 2024 ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను గెలుపుగా కాకుండా… బాధ్యతగా భావిస్తూ పాలన మొదలు పెట్టామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రెండేళ్ల పాలనపై ప్రజల్లో నమ్మకం కలిగిందని, దాన్ని నిలబెట్టుకునేలా పాలన కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై చంద్రగిరి నియోజకవర్గం దామినేడులో శుక్రవారం నిర్వహించిన విజయోత్సవ సభకు చంద్రబాబు హాజరయ్యారు. రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమం పేరుతో చేపట్టిన ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సహకారంతో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. సుపరిపాలనలో భాగంగా అందిస్తున్న సేవలను సభా ముఖంగా తెలియజేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్న కేంద్రం, చేయూతనందిస్తున్న ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండేళ్ల కాలంలో డబుల్ ఇంజన్ సర్కారు ప్రగతిని వివరించడంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇక ప్రజాప్రతినిధులు పెత్తందార్లుగా కాకుండా ప్రజా సేవకులుగా మెలగాలని సూచించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘రెండేళ్ల క్రితం ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని మోదీ, పవన్‌కల్యాణ్‌తో కలిసి రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని ఇచ్చిన పిలుపునకు మద్దతు పలికారు. 57 శాతం ఓట్ షేర్‌తో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 164 సీట్లతో ఎన్డీఏకు అధికారం కట్టబెట్టారు. 2024 ఫలితాలను గెలుపుగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణానికి అప్పజెప్పిన బాధ్యతగా భావించాం. పాలకులుగా కాకుండా సేవకులుగా పని చేస్తున్నాం. అధికారం చేపట్టే సమయానికి అన్ని రంగాల్లోనూ సంక్షోభమే కాక వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి. 2019లో ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం రూ.10 లక్షల కోట్ల అప్పుతో ముగిసింది. కేంద్ర పథకాలను, సాగునీటి పథకాలను నిర్వీర్యం చేశారు. ఇన్వెస్టర్లను వెంటాడి వేటాడి తరిమేశారు. యువత భవిష్యత్తును దెబ్బతీశారు. ప్రశ్నించిన ప్రజలనూ వేధించారు. నన్ను అక్రమంగా జైల్లో పెట్టారు. పవన్ కల్యాణ్‌ను ఇబ్బందులుపెట్టారు. అయినా మేం కుంగిపోకుండా, వెనకడుగు వేయకుండా పనిచేసి ప్రజల కోసం నిలబడ్డాం. రాష్ట్ర దుస్థితిని చూసి భయపడకుండా ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రజలకు వాస్తవ విషయాలు తెలియచేసాం. ప్రజలు చూపిన విజ్ఞతతో డబుల్ ఇంజన్ సర్కారు గెలిచింది. రాష్ట్రాన్ని కాపాడేందుకు ప్రజలు విజ్ఞత చూపారు. ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం. విధ్వంసమైన వ్యవస్థలను గాడిలో పెట్టాం. ఎన్డీఏ ప్రజా ప్రభుత్వంతోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాం.”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

గత ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలను పోగొట్టుకున్నాం
“2019-24 మధ్య కాలంలో ఏపీ అవకాశాల్ని పోగొట్టుకుంది. విధ్వంసాన్ని సరిచేసేందుకు ఒక్కో అడుగూ ముందుకు వేస్తున్నాం. ప్రజల సేవకు పునరంకితం కావడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్నాం. విమర్శలకు ఆధారాలతో సహా సమాధానం చెప్పే గుండె ధైర్యం ఎన్డీఏ ప్రభుత్వానికే ఉంది. సంక్షేమం, అభివృద్ధి సుపరిపాలన ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చాం. ఇచ్చినట్టే పాలన అందిస్తున్నాం. సూపర్ సిక్స్‌తో పాటు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలను అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నాం. ‘ఎన్టీఆర్ భరోసా’ ద్వారా రూ.65వేల కోట్ల పెన్షన్లు ఇస్తున్నాం. ‘తల్లికి వందనం’ ద్వారా చిన్నారులకు చదువు చెప్పిస్తున్నాం.

స్త్రీశక్తి ద్వారా 71కోట్ల ఉచిత ప్రయాణాలు కల్పించాం. ‘అన్నదాత సుఖీభవ’ కింద కేంద్రంతో కలిసి రూ.20వేలను ప్రతి రైతుకూ అందించాం. ధాన్యం కొనుగోళ్ల డబ్బులను 24 గంటల్లోనే చెల్లిస్తున్నాం. గీత కార్మికులు, వడ్డెర్లు, అర్చకులు, ఇమామ్‌లు, మౌజన్లు… ఇలా అందరినీ గుర్తుపెట్టుకుని మరీ సంక్షేమం అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహా అందరికీ సబ్సిడీపై సోలార్ రూఫ్ టాప్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. పీ4 ద్వారా సమాజంలో జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. విద్యం, వైద్యానికి ప్రాధాన్యమిస్తూ సంజీవని ప్రాజెక్టు చేపట్టాం. మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీతో పాటు 5,757 మంది కానిస్టేబుళ్లను కూడా నియమించాం. ఉద్యోగులకు 23 నెలల్లో రూ.21వేల కోట్ల బకాయిలు చెల్లించాం. అప్పులు చేసే వ్యక్తికి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టుపెట్టిన వ్యక్తికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు. ఎమ్మార్వో ఆఫీసు, ఆస్పత్రి, మద్యంలపై వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టుపెట్టారు. యావత్తు రాష్ట్రాన్నీ తాకట్టు పెట్టిన వ్యక్తికి రాష్ట్రం గురించి మాట్లాడే అర్హత ఉందా..? మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడిన వ్యక్తులకు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదు. విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని జిల్లాలను, అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తున్నాం. 175 ఎంఎసఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. గత పాలకుల హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పారిపోయారు. ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించి పెట్టుబడులు, ప్రాజెక్టులు సాధిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇస్తున్నాం. వివిధ పారిశ్రామిక పాలసీల ద్వారా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కల్పించాం. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి. రాయలసీమలోని పుట్టపర్తిలో 5వ జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమాన ప్రాజెక్టుకు కేవలం 36 రోజుల్లోనే అనుమతులిచ్చాం. రాయలసీమ ఇక హార్టీకల్చర్ హబ్. ఇక్కడికే స్పేస్, డ్రోన్, డిఫెన్సు పరిశ్రమలు వస్తున్నాయి. తిరుపతి జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు అవుతోంది. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు గని నుంచి తవ్వకాలు ప్రారంభమవుతాయి. గత పాలకులు చేసిన విధ్వంసం నుంచి ఇప్పుడు రాష్ట్రాన్ని నిలబడుతున్నాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ అందించింది. ఏపీని అగ్రస్థానంలో… అందరికీ ఆదర్శంగా నిలిపేందుకు అంతా కలిసి కృషి చేయాలి.” అని చంద్రబాబు సూచించారు.

అభివృద్ధి చేస్తుంటే… అడుగడుగునా అడ్డుకుంటున్నారు

“రాయలసీమ ప్రాంతంలోని వివిధ ఖనిజాల ద్వారా వేర్వేరు పరిశ్రమలు వస్తాయి. 100 రోజుల్లోనే హంద్రీ-నీవా పూర్తిచేసి కుప్పానికి నీళ్లు తెచ్చాం. కల్యాణి డ్యామ్ కూడా పూర్తిచేసి శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్న వద్దకు నీళ్లు తెస్తాం. గత పాలకులు తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేశారు. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పట్ల అపచారం చేసి మన అందరి మనోభావాలను దెబ్బతీసేలా గొడ్డలి పార్టీ ప్రవర్తించింది. తిరుమల జోలికి బ్రిటీషర్లు కూడా వెళ్లలేదు. కానీ గొడ్డలి పార్టీ ఆ దుర్మార్గం చేసింది. ప్రజలకు న్యాయం చేయాలన్నదే జనసేన`టీడీపీ`బీజేపీ లక్ష్యం. విశాఖకు, గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఐటీ కంపెనీలు వస్తే అమరావతికి క్వాంటం వ్యాలీ వస్తోంది. ఏపీకి పరిశ్రమలు రావాలి… మన రాష్ట్రం పురోగతి సాధించాలి. మన యువతకు ఉద్యోగాలు రావాలి. అందుకే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా మన యువతకు కల్పిస్తున్నాం. జిల్లాలను అడ్డగోలుగా విభజించారు. దానిని సరిచేసి మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రీసర్వే ప్రక్రియ ద్వారా భూ వివాదాలకు చెక్ పెడుతున్నాం. భూ రికార్డులను ప్రక్షాళన చేసేలా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న శెట్టిపల్లి గ్రామంలో భూ వివాదాలకు చెక్ పెట్టాం. చెత్త పన్ను రద్దు చేయడంతో పాటు రాష్ట్రంలో చెత్తను, పరిపాలనలో చెత్తను కూడా తొలగిస్తున్నాం. పరిపాలనకు అడ్డంకులు కల్పించే కొన్ని పాత చట్టాలను రద్దుచేసి పాలనా సమర్ధత పెంచుతున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. తొలిసారి ట్రూడౌన్ చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గించాం. రూ.4,668 కోట్ల భారాన్ని ప్రజలపై మోపకుండా ప్రభుత్వమే భరించింది. విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 2047 స్వర్ణాంధ్ర దిశగా ఏపీ ముందుకెళ్తుంటే గొడ్డలి పార్టీ వెనక్కులాగే ప్రయత్నం చేస్తోంది. పూర్తి పారదర్శకతతో నిర్ణయాలు తీసుకుంటుంటే ఆ పార్టీ లేనిపోని దుష్ప్రచారం చేస్తోంది. గొడ్డలి పార్టీ ఫేక్ న్యూస్‌తో విష ప్రచారాలు చేస్తోంది. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న వ్యక్తి ఏం చేశారో అందరికీ తెలుసు. జే బ్రాండ్లతో ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారు.

మహిళల మంగళసూత్రాలు తెంచారు. వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి అధికారంలో ఎన్ని వారాలు ఉన్నారో అందరికీ తెలుసు. జాబ్ క్యాలెండర్ అని ఘనంగా ప్రకటించి ఒక్కసారి కూడా విడుదల చేయలేకపోయింది గొడ్డలి పార్టీ. అమరావతిపై ఊసరవెల్లి రాజకీయాలు చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారు. ఇప్పుడు మావిగన్ అంటున్నారు… అది మావిగనో వాటికనో..? వైసీపీ ఫేక్ న్యూస్‌ను నమ్మకుంటే… మేం ప్రజలను నమ్ముకున్నాం. ఫ్రస్ట్రేషన్‌తో గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోంది. కూటమిది పాజిటివ్ పాలిటిక్స్… గొడ్డలి పార్టీది పాయిజన్ పాలిటిక్స్. ప్రజా ప్రభుత్వానికి ప్రజలే ఫస్ట్, దేశం- రాష్ట్రమే కూటమి అజెండా. దేశంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే అభివృద్ధి ఆటోమేటిగ్గా జరుగుతుంది. తాము పెత్తందార్లు కాదు, ప్రజలకు సేవకులమనే విషయాన్ని ప్రతి ఒక్క ఎమ్మెల్యే గుర్తుంచుకోవాలి. ఎన్టీఏ కూటమిపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఓ బ్లూ ప్రింట్ మన దగ్గర ఉంది. రెండేళ్ల క్రితం ఇదే రోజు సుపరిపాలనలో ఓ హంబుల్ బిగినింగ్ చేశాం. మేనిఫెస్టో అమలుపై చర్చించడానికి నాతో పాటు ఎన్డీఏ కూటమిలోని ప్రతీ కార్యకర్తా సిద్ధమే. నా దేశం-నా బాధ్యత అనే ఆలోచనతోనే మనమంతా పని చేయాలి. ప్రజా ప్రభుత్వం అనుక్షణం ప్రజల గురించే ఆలోచిస్తుంది. అభివృద్ధికి, సుపరిపాలనకు పునరంకితం అయ్యేలా సంకల్పం తీసుకుందాం. త్వరలోనే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తాం. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించిన ట్రాక్ రికార్డు ప్రజా ప్రభుత్వానిది… విధ్వంసం చేసిన రికార్డు గొడ్డలి పార్టీది.”అని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు.

దేశానికి దిశానిర్దేశంలా మోదీ 12ఏళ్ల పాలన
“రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తోంది. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్‌ప్లాంట్, రైల్వే జోన్ సహా వివిధ అంశాల్లో కేంద్రం అండగా నిలిచింది. ప్రధానిగా 12ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోదీకి అభినందనలు. ఆయన హయాం దేశాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించేలా చేసింది.. భవిష్యత్తుకు పునాదులు వేసింది. వరుసగా మూడుసార్లు మోదీకి మద్దతుగా నిలవడం వల్లే దేశం అభివృద్ధిలో ముందుకెళ్తోంది. 25 కోట్ల మంది పేదలకT పేదరికం నుంచి విముక్తి కల్పించిన నేత ప్రధాని మోదీ. 1.46 లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారులు, 160 ఎయిర్‌పోర్టులు నిర్మించారు. చంద్రయాన్, గగన్‌యాన్ లాంటి ప్రాజెక్టులు దేశప్రతిష్టను పెంచాయి. ‘ఆపరేషన్ సింధూర’ మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటింది. పశ్చిమాసియాలో యుద్ధంతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రధాని మోదీ చేపట్టిన చర్యల కారణంగా అతి తక్కువ ద్రవ్యోల్బణం కలిగిన దేశంగా భారత్ ఉంది.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాం

రెండేళ్ల పాలన విజయోత్సవ సభ సందర్భంగా వివిధ పథకాల లబ్ధదారులు తాము పొందిన లబ్ధని సభా వేదికపై నుంచి నుంచి వివరించారు. రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా తాను పొందిన లబ్ధిని, తన అనుభవాన్ని ఉష అనే యువతి వివరించింది. ప్రకృతి వ్యవసాయంతో తనకు కలిగిన మేలును చంద్రబాబు అనే రైతు చెప్పారు. తన ఐదుగురు పిల్లలకు తల్లికి వందనం నిధులు జమ అయ్యాయని.. చక్కగా చదువుకుంటున్నారని లబ్ధిదారు పులిచర్ల నాగమ్మ సంతోషంగా చెప్పింది తనకు కూటమి ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని నాగమ్మ వెల్లడించింది. రెండేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ వీడియోను ప్రజెంట్ చేశారు. రెండేళ్ల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, ప్రాంతాల వారీగా జరిగిన అభివృద్ధి అద్దంపట్టేలా వీడియోను రూపొందించారు. కేంద్రం అందించిన సాయాన్ని… ప్రధాని మోదీ అందిస్తున్న సహకారాన్ని వివరిస్తూ వీడియోను ప్రజెంట్ చేశారు. స్వర్ణాంధ్ర సాధన దిశగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎలా పని చేస్తున్నారనే విషయాలను క్రోడికరిస్తూ వీడియో రూపకల్పన చేశారు. సభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Previous Post

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

Next Post

చైతన్యరధం ఈ పేపర్ 13-06-2026

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-06-2026

కార్యకర్త
@ June 15, 2026
విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం
ఆంధ్రప్రదేశ్

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు
ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!
ఆంధ్రప్రదేశ్

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్
ఆంధ్రప్రదేశ్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
ఆంధ్రప్రదేశ్

సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

చైతన్యరధం
@ June 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-06-2026

కార్యకర్త
@ June 14, 2026
Load More

ముఖ్య వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

డబుల్ ఇంజిన్ సర్కార్‌తో అభివృద్ధిలో పరుగులు

చైతన్యరధం
@ June 15, 2026
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

చైతన్యరధం
@ June 14, 2026
ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

ఎంతో చేశాం… మరింత అభివృద్ధి చేస్తాం

చైతన్యరధం
@ June 13, 2026
ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం

చైతన్యరధం
@ June 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

విద్యతోనే అన్ని రంగాల్లోనూ అందలం

చైతన్యరధం
@ June 15, 2026
పేటీఎంలు దొరికేశారు!

పేటీఎంలు దొరికేశారు!

చైతన్యరధం
@ June 15, 2026
వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

వెలిగొండ నిర్వాసితులకు శుభవార్త

చైతన్యరధం
@ June 15, 2026
సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

సారీ బ్రో.. అమరావతి అన్‌స్టాపబుల్

చైతన్యరధం
@ June 15, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist