వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానం ద్వారా భారత్ను ప్రపంచంలో పోటీ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ ను ఆవిష్కరించారు. ముందుగా 12 ఏళ్ల పాలనపై మోదీకి అభినందనలు తెలిపారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నా భారత్ ప్రపంచం లోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవత రించింది. వికసిత్ భారత్ 2047 రూపకల్పనలో కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్య సాధనకు నీతి ఆయోగ్ తో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.
- పోటీ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రోడ్ మాప్
- అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా రూపకల్పన
- రియల్ టైమ్లో ప్రజలకు సమాచారం ఇస్తున్నాం
- పారదర్శకంగా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు
- పెట్టుబడుల ఆకర్షణలో ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి
- కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరం
- నీతి ఆయోగ్ తో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధం
- 11వ గవర్నింగ్ కౌన్సిల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు
- 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీకి అభినందనలు
- అనిశ్చితిలోనూ దూసుకెళుతున్నారని ప్రశంసల వర్షం
ఢిల్లీ: వికసిత్ భారత్కు స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానం ద్వారా భారత్ను ప్రపంచంలో పోటీ ఆర్థిక వ్యవస్థగా మార్చేం దుకు రోడ్మ్యప్ సిద్ధం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం గురువారం జరిగింది. ‘వికసిత భారత్ 2047కోసం సమగ్ర మానవాభివృద్ధి’ అనే ప్రధాన థీమ్తో జరుగుతున్న ఈ సమావేశానికి దేశంలోని ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వికసిత్ భారత్తో పాటు స్వర్ణాంధ్ర 2047 విజన్ను తన ప్రసంగంలో చంద్రబాబు ఆవిష్కరించారు. ముందుగా ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్దకాలంగా భారత్ పాలసీ గ్రోత్ వైపుగా అడుగు లు వేసింది. మోదీ హయాంలో డిజిటల్ ఇండియా, జన్లైన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా లాంటి కార్యక్రమాలు వచ్చాయి. సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్నా భారత్ ప్రపంచం లోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవత రించిందని పేర్కొన్నారు.
వికసిత్ భారత్ కు స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానం
ప్రధాని మోదీ రూపకల్పన చేసిన వికసిత్ భారత్ 2047కు ఏపీ కూడా స్వర్ణాంధ్ర విజన్ను అనుసంధానం చేశాం. అభివృద్ధికి మానవ వనరులే పునాదిగా స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన జరిగింది. పేదరిక నిర్మూలన, నైపుణ్యం, ఉపాధి, నీటి- ఇంధన భద్రత, అగ్రిటెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్-టెక్ లాంటి 10 సూత్రాలను భాగం చేశాం. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు సాంకే తికత, పారదర్శక డేటా డ్రైవెన్ పాలనా వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆర్టీజీఎస్ ద్వారా కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్లను పర్యవేక్షి స్తున్నాం. వాతావరణం, పంటల స్థితిగతులు, భూగర్భ జలాల వంటి 41 రకాల సమాచారాన్ని రియల్ టైమ్లో విశ్లేషించి ప్రజలకు సమాచారం ఇస్తున్నామని వివరించారు.
పారదర్శకంగా ప్రభుత్వ సేవలు
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలు పారదర్శకంగా ప్రజల ఇంటివద్దనే అందిస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో గడచిన రెండేళ్లలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం. పెట్టుబడులను ఆకర్షించటం లో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, అస్థిరమైన విధానాలు మేలు చేయవని తెలిపారు. అత్యుత్తమ స్థాయి మౌలిక సదుపాయాలు, వేగంగా అనుమతుల జారీ లాంటి స్థిరమైన వాతావరణం కల్పనపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, కుళాయి నీరు, వంట గ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డీబీటీ లాంటి అవసరాలను ప్రజలకు అందించాలన్నదే తమ లక్ష్యం. పీ4 లాంటి కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నా మని వివరించారు.
సంజీవనితో డిజిటల్ హెల్త్ రికార్డులు
ప్రజల వైద్యారోగ్య పరిరక్షణకు సంజీవని అనే వినూత్న కార్యక్రమం ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ అనుసంధానించటం ద్వారా ప్రతిఒక్కరికీ ఆరోగ్య రక్షణ అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. యోగా, మెడిటేషన్ లాంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రజల్లోకి తీసుకె ళ్లేలా మానవ వనరుల అభివృద్ధిపై దృష్టిపెట్టాం. విద్యారంగంలో ప్రాథమిక అభ్యాసం నుంచి ఉన్నత విద్య వరకూ సమూల సంస్కరణలు చేపట్టాం. గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమంతో పాటు ఏఐ ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ వ్యవస్థలతో ఫలితాలను మెరుగుపరుస్తున్నాం. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మోడల్ విద్యార్థు లు చదువుకుంటూనే నైపుణ్యాలు పొందుతున్నారు.
పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తున్నాం
నైపుణ్యం వెబ్ పోర్టల్, పీఎం సేతు ద్వారా ఏఐ, క్వాంటం టెక్నాలజీస్ లాంటి రంగాల్లో యువతను సిద్ధం చేస్తున్నాం. రాష్ట్రం లో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోవడం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. భవిష్యత్తులో ఆర్థిక, మానవవనరుల కొరత ఏర్పడకుండా ఏపీలో పాపులేషన్ మేనేజ్ మెంట్ పాలసీ రూపొందిస్తున్నాం. దీనిపై జాతీయ స్థాయిలో కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 రూపకల్పనలో కేంద్ర, రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరం. ఈ లక్ష్య సాధనకు నీతి ఆయోగ్తో కలిసి పనిచేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.














