- శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణ
- యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం
- పనులకు జూలై 3న శంకుస్థాపన
- అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష
అమరావతి/ఉండవల్లి(చైతన్యరథం): మంగళగిరి దిగువ సన్నిధిలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం లక్ష్మీ నరసింహస్వామి దేవా లయం జీర్ణోద్ధరణ, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. అధికారులు తమ ప్రతిపాదనలను పవర్ పాయిం ట్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆలయంలోని శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంట మండపం పునర్నిర్మాణం, వాహనశాల నూతన నిర్మాణానికి సమావేశంలో ఆమోదం తెలిపారు. ఆయా జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులను ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా చేపట్టాలని లోకేష్ ఆదేశించారు. ఆలయం వెలుపల చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపైనా పలు సూచనలు చేశారు. ఆలయాన్ని అభి వృద్ధి చేసే అవకాశం జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుందని, భక్తులు సంతృప్తి చెందేలా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు.
రూ.6కోట్ల వ్యయంతో మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పలు జీర్ణోద్ధ రణ, అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. జూలై 3వ తేదీన ఆయా పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాతల నుంచి విరాళాల సేకరణపైనా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్, ఆలయ ఈవో కోగంటి సునీల్ కుమార్, ఎండోమెంట్ చీఫ్ ఇంజనీర్ జి.శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డి.శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఇంజనీర్ మోహన్, వాస్తుశిల్పి పరమేశ్వరప్ప తదితరులు పాల్గొన్నారు.














