- విద్యాసంస్థల్లో నో పాలిటిక్స్
- రాష్ట్ర భవిష్యత్తు కోసం కలసికట్టుగా ముందుకు సాగుదాం
- మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ లో మంత్రి నారా లోకేష్ పిలుపు
రంపచోడవరం (చైతన్య రథం): “విలువలతో కూడిన విద్య అవసరం. అందుకే మనం చాగంటి కోటేశ్వరరావుని అడ్వైజర్గా నియమించుకున్నాం. ఆయన చెప్పిన ఒక మాట నాకు బలంగా గుర్తుండిపోయింది. తల్లికి చెప్పలేని పని ఏదీ చెయ్యొద్దు అన్నారు.
వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది. కానీ అర్ధం చేసుకుంటే అందులో చాలా పవర్ఫుల్ మెసేజ్ ఉంది. ఆయన రాసిన విలువల పుస్తకాలు మనం విద్యార్థులకు అందిస్తున్నాం. ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుతాను. మహిళలను గౌరవించడం మన ఇంటినుండి మొదలవ్వాలి. ఇప్పటికీ కొంతమంది మహిళల్ని కించపరుస్తూ మాట్లాడతారు. అమ్మాయిలా ఏడవొద్దు. చీర కట్టుకున్నావా, గాజులు వేసుకున్నావా అని మహిళల్ని అవమానపరుస్తూ మాట్లాడతారు. అలాంటి మాటలు ఎవరు మాట్లాడినా వద్దని గట్టిగా చెప్పండి. మహిళల జోలికొస్తే లోకేష్ అన్న తోలు తీస్తాడని వార్నింగ్ ఇవ్వండి” అని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు.
రంపచోడవరం ప్రభుత్వ హైస్కూలులో నిర్వహించిన మెగా పేరేంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… “ఏ బిడ్డా చదువుకి దూరం కాకూడదనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం. అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం ఇస్తున్నాం. 2025లో 67.27 లక్షల మందికి 10,090 కోట్లు ఇచ్చాం. 2026లో 67.47 లక్షలమందికి 10,120 కోట్లు ఇచ్చాం. ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఒకరు చదువుకోవాలి, ఇంకొకరు పనికి వెళ్ళాలనేది గత ప్రభుత్వ విధానం. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నారు. వెంటనే మేలుకోండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అని స్వామి వివేకానంద చెప్పిన మాటలను త్రికరణశుద్ధితో పాటిస్తూ ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ “లీప” కోసం కృషి చేస్తున్నాం. వన్ క్లాస్ వన్ టీచర్ మన బలం. సుమారుగా 10 వేల స్కూల్స్ వన్ క్లాస్ వన్ టీచర్ విధానం అమలు చేస్తున్నాం” అన్నారు.
విద్యాసంస్థల్లో నో పాలిటిక్స్
“స్కూల్ అండ్ కాలేజీల్లో నో పాలిటిక్స్. పుస్తకాల దగ్గర నుండి స్కూల్స్ వరకూ ఎక్కడ సీఎం ఫోటో లేదు. నా ఫోటో లేదు. మెగా డిఎస్సీ ద్వారా 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చాం. డొక్కా సీతమ్మ పేరుతో రీజియన్ బేస్డ్ మెనూతో మధ్యాహ్నభోజన పథకం అమలు చేస్తున్నాం. త్వరలోనే రాష్ట్రం మొత్తం స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేస్తాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం. స్టూడెంట్ ఓవర్ ఆల్ డెవెలప్మెంట్ కోసం శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. పాసివ్ లెర్నింగ్ నుండి యాక్టివ్ లెర్నింగ్కి మార్చడానికి క్లిక్కర్ మోడల్ తీసుకొచ్చాం. ఎఫఎలఎన్ -అమలు చేస్తున్నాం. లెర్నింగ్ అవుట్ కమ్ ఒక్కటే టార్గెట్గా పెట్టుకున్నాం. లీప్ యాప్ తీసుకొచ్చాం. పాఠశాలల్లో ఎంత చదువు చెప్పినా ఇంటి దగ్గరకు వచ్చిన తరువాత తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. లీప్ యాప్లో మొత్తం వివరాలు వస్తాయి. ఇంటర్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్స్, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాం. పిల్లలకు మనం ఆస్తులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు, మంచి విద్య ఇవ్వాలి. పెద్ద పెద్ద భవనాలు కట్టకపోయినా ఫర్వాలేదు… పెద్ద కలలు కనడం నేర్పాలి. డబ్బు ఇవ్వకపోయినా ఫర్వాలేదు… ధైర్యమివ్వాలి. ఎందుకంటే… ఆస్తి ఒక తరాన్ని మాత్రమే నిలబెడుతుంది. విద్య తరతరాలను నిలబెడుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం… మన రాష్ట్ర భవిష్యత్తు కోసం… మనమందరం కలిసి ముందుకు సాగుదాం” అని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.















