- గోదావరిలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలతో భేటీ
- బాధిత కుటుంబ సభ్యులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి లోకేష్
- అన్ని విధాల అండగా ఉంటానని భరోసా
రంపచోడవరం (చైతన్య రథం): పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి, కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటుచేసి కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులు విద్య, వైద్యం, వివాహం, ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ కష్టమొచ్చినా తాను వ్యక్తిగతంగా, ప్రభుత్వపరంగా అండగా ఉంటానని మంత్రి నారా లోకేష్ మరోసారి నిరూపించారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఉదయం ఇటీవల గొల్లగూడెం వద్ద గోదావరిలో చేపలవేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఊకె సుశీల, తుర్రం భారతి, బాసిబోయిన బాలరాజు, ఊకె రమేష్ కుటుంబ సభ్యులను కలిశారు. బాధిత కుటుంబాలతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాల యోగక్షేమాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. జరిగిన ఘటన దురదృష్టకరమని.. ఏ కష్టమొచ్చినా తాను అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యకర్తలకు టీడీపీ ఇచ్చే ప్రాధాన్యతను, ఆరోగ్యవంతమైన కేడర్ లక్ష్యంగా నాయకులు, కార్యకర్తల కోసం ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు, ఆరోగ్య పరీక్షల గురించి ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ వివరించారు. మరోవైపు బాధిత కుటుంబాలకు ఇప్పటికే టీడీపీ తరపును రూ.5 లక్షల ఆర్థికసాయం అందించడం జరిగింది.















