- గూగుల్ శంకుస్థాపనతో చారిత్రాత్మక మలుపు
- చంద్రబాబు విజన్-లోకేష్ కృషి ఫలితం
- ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ ఏఐ టెక్ యుగారంభం
- టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
విశాఖపట్నం(చైతన్యరథం): ఎల్లుండి జరగబోయే ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ డేటా సెంటర్ నిర్మాణ శంకుస్థాపన కార్య క్రమానికి విశాఖపట్నం సర్వం సిద్ధమైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజె క్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్లు పేర్కొన్నారు. సుమారు 15 బిలియన్ డాలర్లు (రూ.1.35 లక్షల కోట్లు) విపులమైన పెట్టుబడితో 601 ఎకరాల విస్తీర్ణంలో రూపుది ద్దుకోనున్న ఈ మెగా ప్రాజెక్టు 2028 జూలై నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నూతన శక్తినిస్తూ, లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని పేర్కొన్నారు. ఈ శంకుస్థాపనతో విశాఖపట్నం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ప్రపంచ స్థాయి సాంకేతిక మౌలిక వసతులు, భారీ పెట్టుబడులు, ఐటీ ఆధారిత పరిశ్రమలతో విశాఖనగరం గ్లోబల్ ఏఐ హబ్‌గా అవతరించి దేశంలోనే అగ్రశ్రేణి టెక్నాలజీ నగరంగా ఎదగనుంది. ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇంధనంగా నిలిచి, యువత భవిష్యత్తును మార్చే గేమ్‌చేంజర్‌గా మారుతుంది” అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, పెట్టుబడులకు అనుకూల విధానాలు, పరిపాలనా చురుకుదనం వల్ల గూగుల్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాయని కొనియాడారు. లోకేష్ నిరంతర కృషి, వ్యూహాత్మక దృష్టి, వేగవంతమైన అమలు సామర్థ్యమే ఈ భారీ పెట్టుబడికి పునాది వేసిందని ప్రశంసించారు. గ్లోబల్ ఇన్వెస్టర్లతో సమన్వయం చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను రప్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నా రని పేర్కొన్నారు.
పరిపాలనా దక్షతకు నిదర్శనం
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స’ ద్వంద్వ సూత్రాలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన దేశానికే ఆదర్శం. ఎకనమిక్ టైమ్స్ సంస్థ అందజేసిన “బిజినెస్ రిఫా ర్మర్ అవార్డు” పరిపాలనా దక్షతకు నిదర్శనం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, హార్టీకల్చర్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. విజన్ 2020తో అభివృద్ధికి బాటలు వేసిన చంద్రబాబు.. విజన్ 2047తో నవ్యాంధ్రను దేశంలో అగ్ర గామిగా నిలబెట్టేందు కు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర మొత్తం టెక్నాలజీ, పరిశ్రమల కేంద్రం గా రూపుదిద్దు కుని మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని తెలిపారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవం లభించి ప్రపంచస్థాయి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఇది కేవలం ఒక డేటా సెంటర్ ప్రాజెక్టు మాత్రమే కాదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మలిచే అభివృద్ధి యుగానికి నాంది పలికే మహత్తర ఘట్టమని స్పష్టం చేశారు. గూగుల్ పెట్టుబడి రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మ్యాప్‌పై మరింత పటిష్టంగా నిలబెట్టే చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
















