- ఏపీ సంక్షేమం అమలు, పెట్టుబడులపై వివరణ
- రెండురాష్ట్రాల బంధం బలోపేతానికి ఆకాంక్ష
- మత్స్యసంపద, ఎగుమతుల్లో సహకరించుకుందాం
- టీటీడీ ఆలయ నిర్మాణానికి స్థలం కోసం విజ్ఞప్తి
కోల్ కత్తా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని కోల్కతాలో మంత్రి నారా లోకేష్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సీఎంను లోకేష్ సత్కరించారు. ఏపీ లో అమలుచేస్తున్న స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్ విధా నం గురించి లోకేష్ వివరించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా గరిష్ట ప్రయోజనంతో కూడిన సంక్షేమ పథకాలు అర్హులైనవారికి పారదర్శ కంగా అందజేస్తున్న ఏపీ ప్రభుత్వ మెకానిజాన్ని వివరించారు. పశ్చిమబెంగాల్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. ఏపీలో అమలవుతున్న డిజిటల్ గవర్నెన్స్, రియల్-టైమ్ మానిట రింగ్ ఫలితాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ – పశ్చిమబెంగాల్ మధ్య ఉన్న సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేద్దామని కోరారు. పశ్చిమబెంగాల్లో తిరుమల తిరుపతి దేవ స్థానం ఆలయ నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయిం చాలని, తిరుమలలో పశ్చిమ బెంగాల్ భవన్ నిర్మాణానికి అన్నివిధాలాసాయం అందిస్తామని విన్నవించారు. మత్స్యసంపద పెంపు, ఎగుమతుల విషయంలో పరస్పర సహకారంతో మరింత అభివృద్ధి సాధించవచ్చని అభిప్రా యపడ్డారు. ఈ ప్రతిపాదనలపై సువేందు అధికారి సానుకూలంగా స్పందించారు.
















