చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

టీడీపీ నేత గురజాల మాల్యాద్రి

by చైతన్యరధం
Oct 17, 2026 at 6:35am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
Share on FacebookShare on TwitterShare on Whatsapp

అమరావతి( చైతన్యరథం) : పుంగనూరులో శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే తాము గెలవలేమని, కనీసం బోణీ కూడా చేయలేమని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాగా తెలుసని తెలుగుదేశం పార్టీ నేత గురజాల మల్యాద్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీని చావుదెబ్బ కొట్టడం ఖాయమని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ఎన్నికలను ఎలాగైనా అడ్డుకోవాలని అనేక కేసులు వేయించారని గుర్తుచేశారు. అయితే హైకోర్టులో వారి కుట్రలన్నీ వీగిపోయాయని, న్యాయస్థానాలు తీసుకున్న సరైన నిర్ణయాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలను అడ్డుకుని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని ప్రచారం చేయాలనే దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిసి బెంగళూరులో కూర్చొని విధ్వంసానికి కుట్ర పన్నారని మల్యాద్రి ఆరోపించారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి నామినేషన్ వేయడానికి ఒకటి లేదా రెండు కార్లలో, ఆయనకున్న ప్రభుత్వ గన్‌మెన్లతో రావచ్చు.

కానీ బెంగళూరు నుంచి కార్ల కాన్వాయ్‌తో కర్ణాటక రౌడీలను కార్ల నిండా నింపుకొని పుంగనూరుకు బారు కట్టి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఒక విధ్వంసం సృష్టించి, శాంతిభద్రతల సమస్యను తెరపైకి తెచ్చి, ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవు కాబట్టి ఎన్నికలు ఆపేయండి’ అంటూ మళ్లీ కోర్టులకు వెళ్లి నాటకాలు ఆడాలనే జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రకు తెరలేపారు. బెంగళూరు నుంచి మిథున్ రెడ్డి రప్పించిన రౌడీ మూకలు పుంగనూరులో తీవ్ర రక్తపాతం సృష్టించాయి. టీడీపీ కార్యకర్త మధు రాయల్ తల పగలగొట్టారు. సుహైల్ బాషాను ఉద్దేశపూర్వకంగా కారుతో ఢీకొట్టారు. మంజునాథ్ చెయ్యి విరగ్గొట్టారు, మోహన్ రెడ్డి తల పగలగొట్టారు. ఇలా దాదాపు 15 మంది టీడీపీ శ్రేణుల కాళ్లు, చేతులు, తలలు పగలగొట్టి ఘోర హింసకు పాల్పడ్డారు. ఈ అరాచకాలను భరించలేకే స్థానిక ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం ఎంతటి రక్తపాతం సృష్టించిందో, ఎంత ఘోరమైన నేరాలకు పాల్పడిందో రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

ఇప్పుడు మళ్లీ అదే తరహాలో కర్ణాటక రౌడీలతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని, అందుకే ఇలాంటి పిరికిపంద దాడులకు పాల్పడుతున్నారని మల్యాద్రి మండిపడ్డారు. పుంగనూరులో మధు రాయల్ తల పగలగొట్టిన వైనం, రౌడీలు సాగించిన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియో ఆధారాలను మీడియా సమావేశంలో ప్రదర్శిస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న రౌడీలు, వారిని వెనకుండి నడిపించిన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పుంగనూరులో పెద్దిరెడ్డి మార్కు ఫ్యాక్షన్ అరాచకాలు
పుంగనూరు గడ్డపై పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఏళ్ల తరబడి సాగిస్తున్న ఫ్యాక్షన్ సంస్కృతి, రక్తపాత దౌర్జన్యాలను మల్యాద్రి వీడియో క్లిప్పింగులతో సహా ఆధారాలతో బట్టబయలు చేశారు. ప్రత్యర్థులు ఎవరైనా సరే.. నామినేషన్లు వేయాలన్నా, ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడాలన్నా వారిపై భౌతిక దాడులకు పాల్పడటం పెద్దిరెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా నామినేషన్ వేసేందుకు వెళ్లిన బీజేపీ నేత మదనమోహన్‌పై పెద్దిరెడ్డి అనుచరులు పైశాచికంగా దాడి చేశారు. ఆయన తల పగలగొట్టి, చేతులు విరగ్గొట్టి ఆస్పత్రి పాలు చేశారు. ప్రత్యర్థి పార్టీ నేతలను ప్రాణాపాయ స్థితికి నెట్టడమే వీరి రాజకీయం. పుంగనూరులో నామినేషన్ వేయడానికి వెళ్లిన వృద్ధుడు అంజిరెడ్డి తాతను అడ్డుకుని, ఆయన చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలను బలవంతంగా లాక్కొని దౌర్జన్యానికి పాల్పడ్డారు. వయస్సు మీద పడిన పెద్దాయన అని కూడా చూడకుండా కాగితాలు లాక్కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

బీజేవై పార్టీ నాయకుడు రామచంద్ర యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని పుంగనూరు పట్టణంలోని ఆయన నివాసంపై పెద్దిరెడ్డి ముఠాలు విరుచుకుపడ్డాయి. ఆయన ఇంటిని, ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేయడమే కాకుండా, కార్లను పగులగొట్టి నానా బీభత్సం సృష్టించారు. ఆవులపల్లి రిజర్వాయర్‌లో పెద్దిరెడ్డి అక్రమాలను, ప్రాజెక్టుల వాస్తవ స్థితిని పరిశీలించడానికి వెళుతున్న నాటి ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారిపై అంగళ్లు వద్ద పెద్దిరెడ్డి గుండాలు పథకం ప్రకారం రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా, బాధితులైన చంద్రబాబు నాయుడు గారు, కిశోర్ కుమార్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు గార్లపైనే రివర్స్‌లో అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న నారా లోకేష్ గారి ‘యువగళం’ పాదయాత్రను చూసి ఓర్వలేక ఆయన కాన్వాయ్‌పైనా, పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలపైనా పెద్దిరెడ్డి ముఠా గూండాలు రాళ్లతో విరుచుకుపడ్డారు. ఇలా పుంగనూరులో సామాన్య కార్యకర్త మధు రాయల్ నుంచి మొదలుకొని, బీజేపీ నేతలు, వృద్ధులు, చివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు వరకు ఎవ్వరినీ వదలకుండా భౌతిక దాడులకు పాల్పడటం పెద్దిరెడ్డి రక్తచరిత్రకు నిదర్శనమని మల్యాద్రి ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు, దాడులు చేసినా పుంగనూరులో ప్రజలు పెద్దిరెడ్డి అరాచకాలకు చరమగీతం పాడటం ఖాయమని స్పష్టం చేశారు.

పుంగనూరులో 30 ఏళ్ల పెద్దిరెడ్డి అరాచకాలపై తిరగబడ్డ ప్రజలు
పుంగనూరు నియోజకవర్గంలో గత 30 ఏళ్లుగా ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసి, ప్రతిపక్షాలపై దాడులే అజెండాగా ఫ్యాక్షన్ రాజ్యాన్ని నడిపిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత లేదని మల్యాద్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్దిరెడ్డి కుటుంబం సాగించిన దుర్మార్గాల వీడియో క్లిప్పింగులను ప్రదర్శిస్తూ నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సైకిల్ యాత్ర చేపట్టిన ఉత్తరాంధ్ర టీడీపీ కార్యకర్తలు పుంగనూరుకు చేరుకోగానే పెద్దిరెడ్డి రౌడీ మూకలు వారిపై దౌర్జన్యానికి దిగాయి. వారి బట్టలు ఊడదీసి, అత్యంత అమానుషంగా అవమానించిన దృశ్యాలు ఈ రాష్ట్ర ప్రజలంతా చూశారు. యువగళం పాదయాత్రపై కూడా రాళ్లదాడులు చేయించిన మీరా ప్రజాస్వామ్యం గురించి సుద్దులు చెప్పేది? పుంగనూరులో ఎస్.కె. రమణారెడ్డి ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆవులపల్లి రిజర్వాయర్‌లో పెద్దిరెడ్డి అక్రమాలను పరిశీలించేందుకు టీడీపీ శ్రేణులు శాంతియుతంగా ర్యాలీగా వెళ్తుంటే, అడ్డుకుని ఏకంగా 15 కార్లను పగులగొట్టి విధ్వంసం సృష్టించారు. పుంగనూరు నియోజకవర్గంలో సుమారు 700 మంది టీడీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపారు. పోలీసుల వేధింపులు, పెద్దిరెడ్డి ముఠాల దాడులు భరించలేక మహిళలు, పిల్లలతో సహా కార్యకర్తల కుటుంబాలు ఊళ్లు విడిచి అడవుల్లో దాక్కున్న దుస్థితి ఏర్పడింది.

ఆ సమయంలో నేను స్వయంగా విజయవాడ నుంచి వెళ్లి, వారం రోజుల పాటు అడవుల్లో తలదాచుకున్న బాధితులను, జైళ్లలో ఉన్న వారిని కలిసి ధైర్యం చెప్పి వచ్చాను. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న మొత్తం 85 పంచాయతీల్లో.. ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, నామినేషన్లు వేయనీయకుండా ఏకంగా 82 పంచాయతీలను బలవంతంగా ఏకగ్రీవం చేసుకున్న చరిత్ర పెద్దిరెడ్డిది. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ప్రభుత్వం మద్యం ధరలను అక్రమంగా పెంచిందని ప్రశ్నించిన పాపానికి ఓం ప్రతాప్ అనే దళిత యువకుడిని తెల్లారేసరికి శవమై తేలేలా చేశారు. దౌర్జన్యాలు, హత్యలే ఆస్తిగా బతికే మీరు ప్రజాస్వామ్యవాదులా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నారు తప్ప, చిత్తూరు జిల్లాలో ఏనాడూ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు. ఈ ఎన్నికల్లో శాంతియుతంగా పోలింగ్ జరిగితే పుంగనూరులోనే కాదు.. పులివెందుల, రాయచోటితో సహా రాయలసీమలో ఎక్కడా వైఎస్సార్‌సీపీ గెలవదు. డిపాజిట్లు కూడా రావని తేలిపోవడంతోనే, ఎంపీ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో కర్ణాటక రౌడీలను రప్పించి శాంతిభద్రతల సమస్యను సృష్టించే కుట్ర చేశారు. 30 ఏళ్లుగా అణచిపెట్టుకున్న బాధ, ఆక్రోశంతోనే పుంగనూరు ప్రజలు ఈరోజు పెద్దిరెడ్డి రౌడీలపై తిరగబడ్డారు. ఇకనైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అబద్ధాలు, భౌతిక దాడుల సంస్కృతికి స్వస్తి పలకాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోవాలని మల్యాద్రి హెచ్చరించారు. నియంతృత్వానికి కాలం చెల్లిందని, ప్రజలు ఇచ్చే తీర్పుతో పుంగనూరులో ఫ్యాక్షన్ రాజకీయాలు శాశ్వతంగా అంతమవడం ఖాయమని స్పష్టం చేశారు.

Previous Post

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

Next Post

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్

చైతన్యరధం
@ October 17, 2026
ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు
ఆంధ్రప్రదేశ్

ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు

చైతన్యరధం
@ October 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-10-2026

కార్యకర్త
@ October 16, 2026
మూలా నక్షత్రం దుర్గగుడిలో నేడు భక్తులకు ఉచిత దర్శనం
ఆంధ్రప్రదేశ్

మూలా నక్షత్రం దుర్గగుడిలో నేడు భక్తులకు ఉచిత దర్శనం

చైతన్యరధం
@ October 16, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist