చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య

విశాఖ కేంద్రీయ గిరిజన వర్శిటీ స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్

by చైతన్యరధం
Jul 1, 2026 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ప్రజా జీవితాల్లో మార్పుతెచ్చేదే అసలైన విద్య
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికీ చేరాలి
  • అన్ని ప్రాంతాల అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారం
  • స్వయంకృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము
  • విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాం
  • విశాఖ కేంద్రీయ గిరిజన వర్శిటీ స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్

విశాఖపట్నం (చైతన్య రథం): ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య అని, నాణ్యమైన విద్య సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖ నోవాటెల్ హోటల్‌లో జరిగిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. “ప్రతితరం ఒక దేశాన్ని వారసత్వంగా స్వీకరిస్తుంది. కానీ ఆ తరం దేశాన్ని ఎలా వదిలి వెళ్తుందో నిర్ణయించేది విద్య. అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు అందించే విద్యాసంస్థలు మాత్రమే కావు… అవి కలలకు రూపమిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి, నాయకులను తీర్చిదిద్దుతాయి, తరాల భవిష్యత్తును మార్చేస్తాయి. ఈ రోజు కేవలం ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవం మాత్రమే కాదు… ఇది అవకాశాల, సమ్మిళిత అభివృద్ధి వేడుక. నాణ్యమైన విద్య దేశంలోని ప్రతి మూలకు, సమాజంలోని ప్రతి వర్గానికి చేరాలనే విశ్వాసానికి ప్రతీకగా నిలిచే వేడుక” అని ఉద్ఘాటించారు.

అన్ని ప్రాంతాలు అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాకారం
“అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందితేనే, అన్ని వర్గాలు భాగస్వామ్యం అయితేనే వికసిత్ భారత్ కల సాకారమవుతుంది. గిరిజన ప్రాంతాల్లోని విశ్వవిద్యాలయాలు కేవలం విద్యా కేంద్రాలు మాత్రమే కావు… అవి సామాజిక పరివర్తనకు, సమాన అవకాశాలకు మార్గదర్శకాలు. ఒక కుటుంబంలో తొలి తరం విద్యార్థి పట్టభద్రుడైతే… ఆ కుటుంబం మొత్తం ముందుకు సాగుతుంది. దీంతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. పరిశోధన, ఆవిష్కరణలు, అభివృద్ధి ద్వారా ప్రతి పౌరుడికి సాధికారత కల్పిస్తూ.. మన గొప్ప గిరిజన వారసత్వాన్ని కాపాడుకోవడమే వికసిత్ భారత్ స్ఫూర్తి” అని పిలుపునిచ్చారు.
రాష్ట్రపతికంటే ముఖ్య అతిథి మరొకరు ఉండరు
“ఈరోజు మీరు మీ డిగ్రీలను అందుకుంటున్న ఈ వేళ.. మీ ముందున్న ముఖ్య అతిథిని ఒక్కసారి చూడాలని నేను కోరుతున్నా. గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి మన రాష్ట్రపతి కంటే మరింత అర్థవంతమైన ముఖ్య అతిథి మరెవరూ ఉండరు. ఆమె జీవితం స్వయంగా ఈ విశ్వవిద్యాలయం వంటి విద్యాసంస్థలు ఎందుకు అవసరమో చెప్పే అత్యుత్తమ సమాధానం. రాష్ట్రపతి ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉన్న ఉపర్‌బేడా అనే చిన్న గిరిజన గ్రామంలో జన్మించారు. ఆ రోజుల్లో పాఠశాలకు చేరుకోవాలంటే ఎంతో దూరం నడిచి వెళ్లాల్సి వచ్చేది. గిరిజన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించడం చాలా అరుదు. అయినప్పటికీ ఆమె తన గ్రామం నుంచి డిగ్రీ పూర్తి చేసిన తొలి మహిళగా నిలిచారు. ఆమె వేసిన ఆ ఒక్క అడుగు ఆమె భవిష్యత్తునే కాదు.. ఆమె తర్వాత వచ్చిన వేలాది గిరిజన బాలికల ఆశయాలను కూడా మార్చింది” అని స్పష్టం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు బుధవారం మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది.

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

స్వయంకృషితో రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి ద్రౌపది ముర్ము
“ప్రజా జీవితంలోకి ప్రవేశించే ముందు.. ఆమె రాయరంగ్‌పూర్‌లోని శ్రీ అరవిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లో ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. ఉపాధ్యాయ వృత్తి తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని, ప్రజా విధానాలను రూపొందించే ముందు విద్యార్థుల జీవితాలను మలిచే అవకాశం తనకు దక్కిందని ఆమె తరచూ చెబుతుంటారు. నాయకత్వం అనేది సేవతోనే ప్రారంభమవుతుందని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఆమె ప్రజా జీవితం వారసత్వ ఆధారంగా వచ్చింది కాదు. రాయరంగ్‌పూర్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్‌లో కౌన్సిలర్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం వైస్ ఛైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, ఒడిశా రాష్ట్ర మంత్రిగా, జార్ఖండ్ గవర్నర్‌గా, చివరకు భారత రాష్ట్రపతిగా ఎదిగారు. ప్రజాసేవ ద్వారా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్వయంకృషితో సాధించారు” అంటూ మంత్రి లోకేష్ ప్రేరణనింపారు.

సంకల్ప బలంతో ప్రజాసేవలోకి తిరిగొచ్చారు
“అయితే రాష్ట్రపతి ప్రయాణాన్ని అసాధారణంగా నిలబెట్టింది ఆమె అధిరోహించిన పదవులు మాత్రమే కాదు.. ఆమె జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగత విషాదాలు కూడా. 2009 నుంచి 2014 మధ్య ఆమె తన పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు, భర్త, తల్లి, సోదరుడిని కోల్పోయారు. అలాంటి దుఃఖాన్ని ఊహించడం కూడా మనలో చాలామందికి సాధ్యం కాదు. అయినప్పటికీ ఆమె నిరాశకు గురికాలేదు. ఆధ్యాత్మికతలో బలాన్ని వెతుక్కొని.. కొత్త సంకల్పంతో తిరిగి ప్రజాసేవలోకి వచ్చారు. తన వ్యక్తిగత బాధను సమాజం పట్ల కరుణగా, సేవా సంకల్పంగా మలిచారు. 2022లో భారత రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా.. భారతదేశంలోని పేదలు కలలు కనడమే కాదు, ఆ కలలను నిజం చేసుకోగలరనే విషయానికి నా ఎన్నికే నిదర్శనం అని చెప్పారు. అవి కేవలం ప్రమాణ స్వీకార సభలో పలికిన మాటలు కావు. ఎన్నో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ సాగిన ఆమె జీవితానికి నిదర్శనంగా నిలిచాయి. నేడు ఒక గిరిజన చిన్నారి రాష్ట్రపతి భవన్‌ను చూసినప్పుడు.. అది ఇకపై తనకు దూరంగా ఉన్న ఒక అధికార సంస్థగా కనిపించదు. గ్రామీణ పాఠశాలలో చదివిన, ఉపాధ్యాయురాలిగా పనిచేసిన, గ్రామీణ మార్గాల్లో ప్రయాణించిన, జీవితంలో వ్యక్తిగత కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ విద్య, ప్రజాస్వామ్యం, ప్రజాసేవలపై విశ్వాసాన్ని ఎన్నడూ కోల్పోని వ్యక్తి అక్కడ ఉన్నారనే స్ఫూర్తి కనిపిస్తుంది” అన్నారు.

ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే అసలైన విద్య
“ఈ రోజు మీరు ఒక డిగ్రీని అందుకుంటున్నారు. కానీ రేపు జీవితం మిమ్మల్ని ఒక పెద్ద ప్రశ్న అడుగుతుంది. మీ వల్ల సమాజానికి ఎలాంటి మార్పు వచ్చిందని అడుగుతుంది. విద్య అసలు ఉద్దేశం కేవలం డిగ్రీ సంపాదించడం మాత్రమే కాదు… ప్రజల జీవితాలను మార్చే పరిష్కారాలను చూపడమే అసలైన విద్య. ప్రస్తుతం మనం ఏఐ యుగంలో జీవిస్తున్నాం. ఏఐ సమాధానాలను ఇవ్వగలదు. కానీ మానవీయ విలువలు, జిజ్ఞాస, కరుణ, వ్యక్తిత్వాన్ని ఎన్నటికీ భర్తీ చేయలేదు. ఈ విలువలు గొప్ప విశ్వవిద్యాలయాల్లోనే పెంపొందుతాయి. అవే గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దుతాయి. అందుకే విశ్వవిద్యాలయాలు కేవలం నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులను మాత్రమే కాదు.. బాధ్యతాయుతమైన పౌరులను, మానవతా దృక్పథం కలిగిన నాయకులను, జీవితాంతం నేర్చుకునే వ్యక్తులను తయారు చేయాలి” అని లక్ష్యాన్ని విశదీకరించారు.

విద్యార్థులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దుతాం
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలుగన్న వికసిత్ భారత్‌లో నాణ్యమైన విద్య, ఆవిష్కరణలు, పరిశోధనలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కేంద్ర బిందువులుగా నిలుస్తాయి. ఉన్నత విద్యను మరింత బలోపేతం చేస్తూ.. భారత యువతకు మరిన్ని అవకాశాలను కల్పిస్తున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు అభినందనలు. ఈ జాతీయ దార్శనికత నుంచి స్ఫూర్తి పొందుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. జ్ఞానాన్ని సృష్టించే, ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చే విద్యార్థులను కేవలం ఉద్యోగాలకే కాకుండా నాయకత్వానికి సిద్ధం చేసే విశ్వవిద్యాలయాలను నిర్మిస్తున్నాం. మా లక్ష్యం కేవలం డిగ్రీలు అందుకున్న విద్యార్థులను తయారు చేయడం కాదు… భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడం. నాణ్యమైన అధ్యాపక బృందం, పరిశ్రమల అవసరాలకు అనుసంధానమైన నైపుణ్యాలు, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయవంతం అయ్యేలా భవిష్యత్ విశ్వవిద్యాలయాలను నిర్మిస్తున్నాం” అని లోకేష్ స్పష్టం చేశారు.

యువతలో ఆత్మవిశ్వాసం నెలకొల్పడమే లక్ష్యం
“మా లక్ష్యం సులభంగా ఉన్నప్పటికీ ఎంతో ఉన్నతమైంది. ప్రతి విద్యార్థి ఉపాధికి అర్హుడు కావాలి, ప్రతి విశ్వవిద్యాలయం ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలి, ప్రతి పరిశోధకుడు సాధికారత పొందాలనేది మా లక్ష్యం. ముఖ్యంగా ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభతో పోటీ పడగలమనే ఆత్మవిశ్వాసం ప్రతి యువతలో ఉండాలని మేం కోరుకుంటున్నాం. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ డిగ్రీని గర్వంగా ఫ్రేమ్ చేయించుకుంటారు. కానీ మీ నిర్ణయాలు, మీ విలువలు, సమాజానికి మీరు చేసిన సేవలనే జీవితం గుర్తుంచుకుంటుంది. మీ వల్ల ఎన్ని జీవితాలు మారాయి, ఎన్ని సమస్యలకు పరిష్కారాలు చూపించారు, ఎంతమందికి అవకాశాలు కల్పించారనేదే మీ విజయానికి ప్రామాణికం కావాలి” అన్నారు.
వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి

“ఇతరుల జీవితాలను మార్చగల శక్తిని మనకు ఇచ్చినప్పుడే విద్య పరమార్థం నెరవేరుతుంది. ఈ రోజు మీరు ఈ విశ్వవిద్యాలయం నుంచి బయటకు అడుగుపెడుతున్నప్పుడు… మీ జ్ఞానాన్ని ఆత్మవిశ్వాసంతో, మీ మూలాలను గర్వంతో, మీ విలువలను వినయంతో మీతో పాటు తీసుకెళ్లండి. డిగ్రీ మీకు ఒక వృత్తిని అందించవచ్చు… కానీ మీ వ్యక్తిత్వమే మీకు గౌరవాన్ని సంపాదించి పెడుతుంది. సమాజానికి మీరు చేసే సేవే మీకు చిరస్థాయిగా నిలిచిపోయే వారసత్వాన్ని అందిస్తుంది. మీ ప్రయాణం మరెందరో జీవితాలకు స్ఫూర్తిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ మదన్ లాల్ మీనా, వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ టీ.శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post

మంగళగిరిలో క్రికెట్ పండుగ

Next Post

భోగాపురం మోడల్ స్కూల్లో ప్రధాన్, లోకే ష్

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-08-2026

కార్యకర్త
@ August 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026

కార్యకర్త
@ August 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist