చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Dec 21, 2025 at 6:20am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
అభివృద్ధి యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • రుషికొండకు బోడిగుండు కొట్టి.. యోగా దినోత్సవంపై విమర్శలా?
  • ఒక్క మెడికల్‌ కాలేజీ కట్టలేని వ్యక్తులు.. పీపీపీపై విష ప్రచారం
  • ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రాభివృద్ధి ఆగదు
  • రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచే లక్ష్యంలో అందరూ భాగస్వాములే
  • వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులు పూర్తి
  • స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

తాళ్లపాలెం (చైతన్య రథం): ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అది తాత్కాలికమే అవుతుందని, ప్రజలు భాగస్వాములైతేనే శాశ్వతమవుతుందని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా తాళ్లపాలెంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంద్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్‌పై నివేదిక ఇవ్వాలని గతంలో ప్రధాని కోరారని, ఆయన కోరిక మేరకు నివేదిక ఇచ్చినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది కాలంలోనే అనేక మార్పులు తీసుకొచ్చినట్టు వెల్లడిరచారు. ‘‘అందరి ఆరోగ్యం కోసం చేపట్టే కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములవ్వాలి. యూజ్‌ రికవరీ, రీయూజ్‌ విధానంతో ముందుకెళ్లాలి. వాడిన ప్లాస్టిక్‌ ఇస్తే డబ్బు ఇచ్చేలా చూస్తున్నాం. వ్యర్థాలను వనరుగా, ఆస్తిగా మారుస్తున్నాం. ఉత్తమ పారిశుద్ధ్య కార్మికులకు అవార్డులు ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూన్‌నాటికి ఏపీని ప్లాస్టిక్‌రహిత రాష్ట్రంగా మారుస్తాం. ఇప్పటికే సచివాలయంలో ప్లాస్టిక్‌ వాడకుండా చర్యలు చేపట్టాం. గత ప్రభుత్వం వదిలిన 86 లక్షల టన్నుల చెత్తను తొలగించాం. రీసైక్లింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. జనవరి 26 నాటికి ఏ రోడ్డుపైనా చెత్త కనిపించకూడదు. ప్రస్తుతం 26 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. అవసరమైతే 100 రథాలు ఏర్పాటు చేసి పొడిచెత్త సేకరిస్తాం. మీరు ఇచ్చిన పొడిచెత్తకు డబ్బు కూడా ఇస్తాం. ఇంట్లో చెత్త ఊడ్చి రోడ్డుపై వేయడం మానుకోవాలి. అందరిలో సామాజిక స్పృహ రావాలి. రోడ్లు కూడా మనవే. అర్బన్‌ ప్రాంతాల్లో డోర్‌ టూ డోర్‌ చెత్త సేకరిస్తారు. ఇంట్లో చెత్తను మీరే కంపోస్టుగా తయారు చేసుకోవచ్చు. పట్టణాల్లో 5 లక్షల ఇళ్లలో, గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్‌ తయారు చేయాలనేది లక్ష్యం. వీలున్న ప్రతి ఒక్కరూ కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.
రుషికొండ ప్యాలెస్‌ కోసం రూ.500 కోట్లు దుర్వినియోగం చేసిన వాళ్లు… ప్రజారోగ్యం కోసం యోగా నిర్వహించిన తమపై విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌, రంగు రాళ్లపై బొమ్మల కోసం వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారే కానీ ఒక్క మెడికల్‌ కాలేజీ అయినా కట్టారా? అని ప్రశ్నించారు. పీపీపీ విధానంలో మెడికల్‌ కాలేజీలు కడుతుంటే జైల్లో పెడతామని బెదిరించడం వారి రాక్షసత్వానికి నిదర్శనమని సీఎం అన్నారు. ముందుగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించిన చంద్రబాబు.. తర్వాత కంపోస్ట్‌ తయారీ యార్డును సందర్శించారు. అనంతరం ప్రజావేదిక సభనుంచి మాట్లాడుతూ.. ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా ప్రజల జీవన విధానంలో మార్పు తేవాలనే లక్ష్యంతో దీనికి శ్రీకారం చుట్టాము. గ్రామాలు పరిశుభ్రంగా ఉండటమే కాదు… ఆలోచనలూ స్వచ్ఛంగా ఉండాలి. ఈ స్వచ్ఛ ఉద్యమంలో ముందుండి నడిపిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఈసారి పర్యావరణంలో అవకాశాలు అందుకోవడం థీమ్‌గా తీసుకున్నాం. పర్యావరణం మనకు జీవనోపాధి కల్పిస్తుంది. సమగ్ర ఆర్ధికవృద్ధికి దోహద పడుతుంది. వ్యర్థాలు-మురుగు నీటి నిర్వహణ, రీసైక్లింగ్‌ యూనిట్లు, కంపోస్టింగ్‌, పారిశుధ్య సేవలు, హరిత ఉత్పత్తులు, సర్క్యులర్‌ ఎకానమీ కార్యకలాపాలు… ఇవన్నీ స్థానికంగా ఉపాధి కల్పించేవే. ఆంధ్రప్రదేశ్‌ సర్క్యులర్‌ ఎకానమీ, వ్యర్థాల రీసైక్లింగ్‌ పాలసీ 2025ను తీసుకువచ్చాం. పొడి, తడి చెత్తను వేరు చేయడంపై చాలామందిలో అవగాహన వచ్చిందని పలువురు పారిశుధ్య కార్మికులు స్వయంగా నాకు చెప్పారు. వ్యర్థాలను వనరుగా, సంపదగా మారుస్తూ సర్క్యులర్‌ ఎకానమీకి అసలైన అర్థాన్నిచ్చాం. స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో పారిశుధ్య కార్మికులే నిజమైన సైనికులు. అందుకే వారి గౌరవం పెరిగేలా, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకున్నాం. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాకారం అవుతుంది’’ అన్నారు. కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి 21 విభాగాల్లో 69 రాష్ట్రస్థాయి, 1,257జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర అవార్డులు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు.
అభివృద్ధికి రాక్షసుల్లా అడ్డంకులు
ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. కొందరు రాక్షసులు వివిధ రూపాల్లో అభివృద్ధి యజ్ఞాన్ని అడ్డుకుంటున్నారు. ఐటీ కంపెనీలకు భూములిస్తే కేసులు వేస్తున్నారు. కానిస్టేబుళ్ల నియామకాలపైనా కోర్టులకు పోతున్నారు. పీపీపీలో మెడికల్‌ కాలేజీలు కడుతుంటే ప్రైవేటుపరమని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. యోగా మన భారతీయ సంపద. యోగాకు ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు. ప్రపంచ గుర్తించేలా, వైజాగ్‌ పేరు మారుమోగేలా యోగా డే నిర్వహిస్తే దానిపైనా తప్పుడు ఆరోపణలతో విష ప్రచారం చేస్తున్నారు. విశాఖను గంజాయి, డ్రగ్స్‌ కేంద్రంగా వారు చేస్తే ఏఐ, డేటా సెంటర్‌, యోగా క్యాపిటల్‌గా మేము తయారు చేసాం. గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకువనంగా మార్చాం. కూటమి పాలనలో దందాలు లేవు. గత పాలకులు రుషికొండ ప్యాలెస్‌కు గుండు కొట్టించారు. రూ.500 కోట్ల ప్రజాధనం వృథా చేశారు. సర్వే రాళ్లపై రూ.700 కోట్లు ఖర్చు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా లక్ష్య సాధనలో వెనక్కు తగ్గేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్లాస్టిక్‌ రహిత రాష్ట్రంగా ఏపీ
‘గత పాలకులు చెత్తపై పన్ను వేయడమే కాకుండా 86 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను మనకు వారసత్వంగా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక చెత్త మొత్తం తొలగించాం. 2026 జూన్‌నాటికి ప్లాస్టిక్‌ రహిత ఏపీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్లు, రీసైక్లింగ్‌ యూనిట్లు, కంపోస్ట్‌ తయారీతో ఏ రోజు చెత్తను ఆరోజు ప్రాసెస్‌ చేస్తున్నాం. జనవరి 26నాటికి రాష్ట్రంలో రోడ్డుపై చెత్త అనేది కనపడకూడదు. ఫిబ్రవరి 15నాటికి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరించేలా ఏర్పాట్లు చేస్తాం. అక్టోబర్‌ 26నాటికి పొడి తడి చెత్త వేరు చేయడం 100 శాతం పూర్తి కావాలి. గ్రామాల్లో 10 లక్షల ఇళ్లలో కంపోస్ట్‌ తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇంటి వ్యర్థాలను కంపోస్ట్‌గా తయారు చేసుకొని కూరగాయలు పండిరచుకోవచ్చు. వీలైనంత వరకూ కిచెన్‌ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే ఏడాది అక్టోబర్‌ 2 తర్వాత ఎక్కడా ప్లాస్టిక్‌ కనపడకూడదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు ఉన్నాయి. త్వరలో మరో 100 ప్రారంభిస్తాం. ప్రతీ ఉమ్మడి జిల్లాకు 6 నుంచి 8 చొప్పున స్వచ్ఛ రథాలు కేటాయిస్తాం. స్వచ్ఛ రథాలు ఏర్పాటు చేశాక గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇంట్లో చెత్త తీసి రోడ్డుపై వేసే అలవాట్లు మానుకోవాలి. అందరిలో సామాజిక స్పృహ రావాలి’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
పరిశ్రమల హబ్‌గా అనకాపల్లి
‘‘గత పాలకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఆర్థికంగా దెబ్బతీశారు. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్‌ సిక్స్‌ అమలు చేశాం. ప్రధాని మోదీ, మిత్రులు పవన్‌ కల్యాణ్‌ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు ప్రభుత్వ సేవలు వేగంగా అందేలా చర్యలు తీసుకుంటున్నాం. నాతో సహా నేతలు, కలెక్టర్లు, ఎస్పీలు సహా గ్రామస్థాయి అధికారి వరకు ఎలా పని చేస్తున్నారో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాను. అనకాపల్లి జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం. ఇప్పటికే పరిశ్రమల కోసం రాంబిల్లి, పూడి, నక్కపల్లి, వల్లూరు, మాకవరపాలెంలో 24,843 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నాం. కోడూరు, పరవాడ, అచ్యుతాపురంలో ఎంఎస్‌ఎంఈ పార్కులు తెస్తున్నాం. జిల్లాలో తొలి ప్రైవేట్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ నక్కపల్లిలో 93 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు అవుతోంది. మహిళల కోసం ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటు కోసం ఎలీప్‌కు 32 ఎకరాలు కేటాయించాం. జిల్లాలో 46 భారీ పరిశ్రమలు నిర్మాణ దశలో ఉన్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద బెల్లం మార్కెట్‌ ఇక్కడ ఉంది. అనకాపల్లి బెల్లాన్ని కూడా ప్రమోట్‌ చేస్తాం. ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తిచేస్తాం. ఇటీవల ఢల్లీి పర్యటనలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూర్వోదయ కింద కేంద్రాన్ని నిధులు కోరాము. అరకు కాఫీకి ప్రపంచ గుర్తింపు తెచ్చాం. కేజీ అరకు రూ.10,000కు కొనుగోలు చేశారంటే ఎంత డిమాండ్‌ ఉందో అర్ధం చేసుకోవచ్చు’’ అని సీఎం పేర్కొన్నారు.
ప్రపంచమంతా విశాఖవైపు చూస్తోంది
‘‘కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రపంచమంతా విశాఖవైపే చూస్తోంది. పోర్టులు, ఎయిర్‌ పోర్టులు, హైవేలు, అంతర్జాతీయస్థాయి ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు మారబోతున్నాయి. ఇటీవల విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సు ద్వారా రూ.13.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 610 ఎంవోయూలు కుదిరాయి. ఎస్‌ఐపీబీ ద్వారా మరో రూ.8.29 లక్షల కోట్లు పెట్టుబడులకు ఆమోదం తెలిపాం. వీటిద్వారా మొత్తం 23 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. భాగస్వామ్య సదస్సులో అనకాపల్లి జిల్లాకు సంబంధించి 11 ఎంఓయూలు కుదిరాయి. విశాఖకు గూగుల్‌ వస్తోంది. ఇప్పటికే కాగ్నిజెంట్‌ వచ్చింది. టీసీఎస్‌ సహా అనేక ప్రతిష్టాత్మక సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు మొదలు పెడుతున్నాయి. ఆర్సెలర్‌ మిట్టల్‌ -నిప్పాన్‌ స్టీల్‌లాంటి ప్రపంచస్థాయి సంస్థ జిల్లాలో పెట్టుబడి పెడుతోంది. రూ.1.85 లక్షల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ద్వారా 20 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేస్తోంది. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్‌కు విశాఖ కేంద్రం కాబోతోంది. ఇప్పటికే రాష్ట్రాన్ని మూడు రీజియన్లుగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి వెల్లడిరచారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

Previous Post

చిన్న ఆలోచనలే..అభివృద్ధికి మార్గాలు

Next Post

పీపీపీపై సంతకం ఢిల్లీలో.. డ్రామా గల్లీలో..

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 09-05-2026

కార్యకర్త
@ May 9, 2026
చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-05-2026

కార్యకర్త
@ May 8, 2026
సీఎంకి స్టాండింగ్ ఓవేషన్
ఆంధ్రప్రదేశ్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!
ఆంధ్రప్రదేశ్

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-05-2026

కార్యకర్త
@ May 7, 2026
ఆంధ్రప్రదేశ్

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
Load More

ముఖ్య వార్తలు

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

సీఎంకి స్టాండింగ్ ఓవేషన్

చైతన్యరధం
@ May 8, 2026
నేను కాదు… మనం!

నేను కాదు… మనం!

చైతన్యరధం
@ May 8, 2026
100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

100 శాతం కృషి… 100 శాతం ఫలితాలు!

చైతన్యరధం
@ May 8, 2026
బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

బెంచ్ మార్క్ సెట్ చేసేలా ఏపీ అభివృద్ధి

చైతన్యరధం
@ May 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎకోసిస్టమ్‌కు ఊతమిచ్చే

చైతన్యరధం
@ May 7, 2026
వేగంగా విత్తన సరఫరా

వేగంగా విత్తన సరఫరా

చైతన్యరధం
@ May 7, 2026
సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

సీవీడ్ ఆదాయంపై ఎకనామిక్ మోడల్

చైతన్యరధం
@ May 7, 2026
భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

భారీ పెట్టుబడులకు ఎసఐపీబీ ఓకే

చైతన్యరధం
@ May 7, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist