చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!

44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేష్

by చైతన్యరధం
March 30, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
తెలుగుజాతి కోసమే..తెలుగు దేశం ఉద్భవం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • కార్యకర్తలే పార్టీకి బలం, బలగం
  • దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్
  • అభివృద్ధిని పరిచయం చేసింది ఎవర్ బ్రాండ్ సీబీఎన్
  • టీడీపీని లేకుండా చేస్తామనే వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు
  • పనిచేసిన కార్యకర్తలను అధినేత పక్కన కూర్చొబెట్టాం
  • జగన్‌రెడ్డి క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో బాధపడుతున్నారు
  • పార్టీ కేడర్‌కు ఉచితంగా హెల్త్ చెకప్ చేయిస్తాం
  • 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి లోకేష్

మంగళగిరి (చైతన్య రథం): తెలుగుజాతి కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశమని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ.. “టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబుకి, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులకు 44వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. 1982 మార్చ్ 29 మధ్యాహ్నం 2.30.. దేశ, రాష్ట్ర రాజకీయ చరిత్ర మార్చిన రోజు. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసమంటూ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు గర్జించిన గొప్ప రోజు. తెలుగుజాతి కోసం ఉద్భవించిన పార్టీ మన తెలుగుదేశం. తెలుగువారి గుండె చప్పుడు మన తెలుగుదేశం” అని భావోద్వేగంతో ప్రకటించారు.

మానవత్వానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్
“మానవత్వానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్. చైతన్య రధం ఎక్కి ప్రజల్లోకి వెళ్లిన దమ్మున్న నాయకుడు. అప్పటి వరకూ ఏ నాయకుడూ చేయని సాహసం ఆయన చేశారు. 35 వేల కిలోమీటర్ల యాత్ర చేశారు. మా మామయ్య నందమూరి బాలకృష్ణ గారి పెళ్లి ఓవైపు, రామకృష్ణ గారి వెళ్లి ఇంకోవైపు ఉన్నా ఆయన రాలేదు. ఒక పవిత్ర బాధ్యత చేపట్టానని, విజయం సాధించిన తర్వాతే ఇంటికి వెళ్తానని చెప్పిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. చేయెత్తి జై కొట్టు తెలుగోడా అని అన్న ఎన్టీఆర్ పిలుపు ఇచ్చారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగు ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం జరిగింది. పార్టీ పెట్టిన కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. దేశ చరిత్రలో అదొక రికార్డ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ మన రికార్డులు బద్దలు కొట్టిన వారు లేరు. రికార్డులు బద్దలు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలి అన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం” అన్నారు.

కార్యకర్తలే టీడీపీ బలం, బలగం
“కార్యకర్తలే టీడీపీ బలం, బలగం. పసుపు జెండా చూస్తేనే మనకు ఎక్కడలేని పౌరుషం. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే దమ్ము, ధైర్యం ఉన్న కార్యకర్తలు ఒక్క తెలుగుదేశం పార్టీకే సొంతం. ప్రత్యర్ధులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడకొట్టిన అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం. మెడ మీద కత్తి పెట్టి వాళ్ల నాయకుడి పేరు చెప్పమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు సైతం లెక్కచేయని తోట చంద్రయ్య లాంటి కార్యకర్తలు మన పౌరుషం. ప్రత్యర్థుల దాడిలో కన్నుపోయినా తగ్గేదే లేదు అన్న చెన్నుపాటి గాంధీ మనకు స్ఫూర్తి. కత్తులతో దాడి చేసినా, రక్తం కారుతున్నా ఎన్నికలు అయ్యే వరకూ పోలింగ్ బూత్ లోనే కూర్చున్న మంజులా రెడ్డి లాంటి కార్యకర్తలు మనకు ఆదర్శం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ తెలుగుదేశం పార్టీ కంచుకోటకి కాపలా కాస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. జెండాలు మోసింది కార్యకర్తలు, పోరాడింది కార్యకర్తలు. అందుకే నాకు ఈ కార్యకర్తలే అధినేత అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా” అని ఉద్ఘాటించారు.

“శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం అంతకాపల్లిలో ఓ పెద్దాయన పేరు తెలుగుదేశం. పిల్లలనుంచి ముసలివాళ్ల వరకూ అందరూ ఆయనను తెలుగుదేశం అనే పిలుస్తారు. ఆయన సొంత పేరు చాలామందికి తెలియదు. ఆ పెద్దాయన కూడా తెలుగుదేశం అని పిలిస్తేనే పలుకుతారు. ఈ విషయాన్ని పార్టీ నేతల ద్వారా తెలుసుకున్నాక చాలా గర్వంగా అనిపించింది. నాపై బాధ్యత మరింత పెరిగింది. ఇంతటి అదృష్టం ఏ రాజకీయ పార్టీకి ఉంటుంది?” అన్నారు.

దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్
“దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్. దేశంలోనే మొదటి సారి పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్. రూ.2 లకే కిలో బియ్యం, రైతులకు రూ.50 కే హార్స్ పవర్ విద్యుత్, నిరుపేదలకు పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది అన్న ఎన్టీఆర్. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసింది అన్న ఎన్టీఆర్. బీసీలకు ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రం ఇచ్చింది అన్న ఎన్టీఆర్. తిరుపతి లో మొదటి మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్. తెలుగుగంగ ప్రాజెక్టు ఆర్కిటెక్ట్ అన్న ఎన్టీఆర్. తిరుమలలో నిత్యాన్నదానం ప్రారంభించింది అన్న ఎన్టీఆర్. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకరోజు పడుతుంది. కేవలం ఏడేళ్లలోనే అన్న ఎన్టీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారు” అని ఘన చరిత్రను గుర్తు చేశారు.

దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది బ్రాండ్ సీబీఎన్
“దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన బ్రాండ్ సీఎం చంద్రబాబునాయుడు గారు. ప్రజల వద్దకు పాలన ప్రారంభించింది మన సీబీఎన్. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్ ఇచ్చింది మన సీబీఎన్. మహిళలకు కోసం దీపం పథకం ప్రారంభించింది మన సీబీఎన్. బీసీలకు స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్ ఇచ్చింది మన సీబీఎన్. డ్వాక్రా పథకం ప్రారంభించింది మన సీబీఎన్. పట్టిసీమ నిర్మించింది సీబీఎన్. రైతు బజార్లు ప్రారంభించింది మన సీబీఎన్. సైబరాబాద్ కట్టిందీ ఆయనే… అమరావతి కడుతోంది ఆయనే. అప్పుడు ఐటీ – ఇప్పుడు క్వాంటం. వయస్సు 75 కానీ స్పీడ్ 25 ఏళ్ల కుర్రాడు. ఆయన రికార్డులు బద్దలు కొట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదు, పుట్టడు. అదీ మన సీబీఎన” అని భావోద్వేగంతో ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించాం
“గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పసుపు జెండా పవర్ ఏంటో చూపించాం. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉంది. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలకపాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంను ప్రతిపాదించింది మన సీబీఎన్. పార్లమెంట్ కు మొదటి దళిత స్పీకర్‌గా జీఎంసీ బాలయోగిని నియమించింది మన సీబీఎన్. అంబేద్కర్‌కు భారతరత్న రావడంలో కీలకపాత్ర పోషించింది అన్న ఎన్టీఆర్. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్, ఇప్పుడు డేటా సెంటర్.. ఇలా అనేక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ” అని మంత్రి లోకేష్ సగర్వంగా ప్రకటించారు.

టీడీపీని లేకుండా చేస్తామనే వాళ్లే అడ్రస్ లేకుండా పోయారు
“తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాం అని కొంత మంది అన్నారు. ఇప్పుడు వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు. అర్థమైందా రాజా! 2019 నుంచి 2024 వరకూ అరాచక పాలన మనం చూశాం. ఐదేళ్లలో 79 మంది కార్యకర్తలను, నాయకులను చంపారు. తోట చంద్రయ్యను చంపేస్తే పాడె మోసింది మన సీబీఎన్. ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకుంది మన సీబీఎన్. కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ల స్వార్థం కోసం కార్యకర్తలతో కత్తి పట్టించాయి. మన సీబీఎన్ కార్యకర్తల పిల్లలకు పుస్తకాలు పట్టించారు. ఫ్యాక్షన్ దాడుల్లో కార్యకర్తలు చనిపోతే వారి పిల్లలను దత్తత తీసుకుని చదివించి ప్రయోజకులుగా మార్చింది మన సీబీఎన్. పాదయాత్రలో నేను ఆ పిల్లలను కలిశా. ఒకరు డెలాయిట్, మరొకరు గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. కార్యకర్తలు, నేతలపై వేల కేసులు పెట్టి వేధించారు. మన దేవాలయం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. మన అధినేత ఇంటికి తాళ్లు కట్టారు. మన అధినేతను అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. క్లైమోర్ మైన్లకే భయపడని బ్లడ్ మాది. మీరు పెట్టే కేసులు, దాడులకు భయపడతామా? 2024 ఎన్నికల్లో మన స్ట్రైక్ రేట్ 94 శాతం. 57 శాతం ఓట్ షేర్. 8 ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప” అని విజయగర్వంతో ప్రకటించారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమం అందిస్తున్నాం

“దేశంలో ఏ రాష్ట్రంలోలేని సంక్షేమం మన సీబీఎన్ అందిస్తున్నారు. వృద్ధులకు రూ.4వేల పెన్షన్, వికలాంగులకు రూ.6వేలు, మంచానికి పరిమితం అయిన వారికి రూ.15 వేలు ఇస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్దఎత్తున పెన్షన్లు ఇవ్వడం లేదు. దీపం పథకం కింద ఏటా ఉచితంగా 3 సిలిండర్లు అందిస్తున్నాం. 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. ఏడాదిలో ఆయా ఖాళీలను భర్తీ చేస్తాం. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తున్నాం” అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

పనిచేసిన కార్యకర్తలకు అధినేత సరసన స్థానం
“నేను బయట ఎంత పోరాడుతున్నానో.. పార్టీలోనూ అంతే పోరాడుతున్నా. సంస్కరణల కోసం మనం కలిసికట్టుగా పోరాడాలి. కష్టపడుతున్న కార్యకర్తలను మనం గుర్తించాలి. ఆ బాధ్యత నాపైనా ఉంది. కష్టపడుతున్న కార్యకర్తలను గ్రామస్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పార్టీపై ఉంది. ఈ రోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారి పక్కన ఎవరు కూర్చున్నారో గమనించాలి. ప్రతిపక్షంలో, అధికారంలో అహర్నిశలు కష్టపడిన వారు. వారిని నేడు గుర్తించి గౌరవ అధ్యక్షులు చంద్రబాబు గారి పక్కన కూర్చోబెట్టడం జరిగింది. బాగా పనిచేసిన కార్యకర్తలను గుర్తించాల్సిన బాధ్యత మాపై ఉంది. మీరు కష్టపడిన విధానం మాకు చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. అందుకే ‘మై టీడీపీ’ యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను నమోదు చేయాలి. పార్టీ నేతలు అలక వీడాలి. దీనివల్ల నష్టపోయేది కార్యకర్తలు, ప్రజలు. ‘మై టీడీపీ’ యాప్ లోని సీబీఎన్ కనెక్ట్ ఆప్షన్ ద్వారా ఎవరైనా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. అలక మానేయాలి, అలక అవసరం లేదని కార్యకర్తలకు పిలుపునిస్తున్నా. అహంకారం వద్దు. అహంకారం ఉంటే ఏమవుతుందో మనం చూశాం. 151 కాస్తా 11 అయ్యాయి. కార్యకర్తలు, నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి” అన్నారు.

జగన్‌రెడ్డి క్రెడిట్‌చోరీ డిజార్డర్‌తో బాధపడుతున్నారు
“ఈమధ్య జగన్‌ను చూస్తే బాధేస్తుంది. ఆయన క్రెడిట్ చోరీ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. అంటే క్రెడిట్ చోరీ జబ్బు. దానిపేరు సీసీడీ. ఒక రోజువచ్చి ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ పెట్టుబడి అంతా అబద్దం అంటారు. మొన్న మనం భూమి పూజ చేసిన తరువాత నేనే ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చా అంటున్నారు. పాపం ఆయన ఈ జబ్బునుంచి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని ఎద్దేవా చేశారు.

పార్టీ కేడర్‌కు ఉచితంగా హెల్త్ చెకప్ చేయిస్తాం
“తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత. దేశంలో ఏ పార్టీకి లేనివిధంగా కోటిమంది కార్యకర్తలు టీడీపీకి సొంతం. గతంలో ప్రమాద బీమా కింద రూ.2 లక్షలు ఇస్తే.. ఇప్పుడు ఏకంగా రూ.5 లక్షలకు పెంచారు మన సీబీఎన్. ఇప్పటి వరకూ సుమారుగా కార్యకర్తల సంక్షేమం కోసం రూ.150 కోట్లు ఖర్చు చేసింది టీడీపీ. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మొదటి విడతలో క్లస్టర్, యూనిట్, బూత్, జాతీయ, రాష్ట్ర, మండల, డివిజన్, గ్రామ కమిటీల్లో ఉన్నవారందిరకీ ఉచితంగా హెల్త్ చెకప్ చేసి, ఫాలోఅప్ కేర్ కూడా అందిస్తామని హామీ ఇస్తున్నా. ఈ రోజు ప్రవిత్రమైన రోజు. మనం ఇక్కడ కూర్చొన్నామంటే ఎంతోమంది త్యాగంవల్లే. వారందరినీ జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి” అని పార్టీ శ్రేణులకు మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అంతకుముందు ఎన్టీఆర్ భవన్‌కు చేరుకున్న మంత్రి నారా లోకేష్.. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యాలయానికి పెద్దఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో కలిసి పార్టీ జెండా ఎగురవేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 29-03-2026

Next Post

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

November 23, 2026
పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు
ఆంధ్రప్రదేశ్

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

November 23, 2026
కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం
ఆంధ్రప్రదేశ్

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

November 23, 2026
కూటమి అభ్యర్థులను గెలిపించండి
ఆంధ్రప్రదేశ్

కూటమి అభ్యర్థులను గెలిపించండి

November 23, 2026
దేశంలోనే తొలిసారిగా…టౌన్ ప్లానింగ్‌లో విప్లవాత్మక సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్

దేశంలోనే తొలిసారిగా…టౌన్ ప్లానింగ్‌లో విప్లవాత్మక సంస్కరణలు

November 23, 2026
పంచాయతీ ఎన్నికల నామినేషన్లలో వైసీపీ హింసాకాండ
ఆంధ్రప్రదేశ్

ఆళ్ళగడ్డ, మైదుకూరులో రెచ్చిపోయిన వైసీపీ గుండాలు

November 23, 2026
Next Post
అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

అధినేత చంద్రబాబు కృషివల్లే మనం ఈ స్థాయిలో ఉన్నాం

ముఖ్య వార్తలు

ఐక్యతే మన బలం…

ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి

by చైతన్యరధం
November 23, 2026

పంచాయతీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు పిలుపు గ్రామాభివృద్ధికి ప్రభుత్వ ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా పార్టీ నేతల...

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

ఏపీకి పెట్టుబడులు వస్తుంటే.. గొడ్డలి పార్టీకి కడుపుమంట

by చైతన్యరధం
November 22, 2026

తప్పుడు ప్రచారాలతో రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం గతంలో పరిశ్రమలు తరిమేసి ఇప్పుడు విష ప్రచారం కుమార్తె పెళ్లికి షర్మిల ఆహ్వానిస్తే రోత రాతలా? మీడియా సమావేశంలో...

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

పనిచేసే ప్రభుత్వానికి ప్రజల అండ

by చైతన్యరధం
November 22, 2026

కూటమిగా నిలిచాం... ఐక్యంగా గెలిచాం జనాభా దామాషా పద్ధతిన అన్ని వర్గాలకు రాజ్యాధికారం సామాన్య కార్యకర్తలను జెడ్పీ పీఠాలపై కూర్చోబెట్టాం వైసీపీ కుట్రలను తిప్పికొట్టిన ఓటర్లకు హ్యాట్సాఫ్...

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

మూడు ప్రాంతాల ఆర్థిక ప్రణాళికలే రాష్ట్రాభివృద్ధికి బ్లూ ప్రింట్

by చైతన్యరధం
November 20, 2026

ప్రాజెక్టుల పురోగతిని తెలుసుకునేందుకు ప్రత్యేక డ్యాష్‌బోర్డులు ఏర్పాటు చేయాలి పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావాలి భారీ ప్రాజెక్టులకు ఎంఎసఎంఈల అనుసంధానం ప్రతి పారిశ్రామిక క్లస్టర్‌కూ ఎకోసిస్టమ్ అభివృద్ధి...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

స్థానిక ఎన్నికల్లోనూ.. కూటమికి జై కొట్టండి

పెట్టుబడులే కాదు..ఉత్పత్తి కూడా ప్రారంభించాలి

by చైతన్యరధం
October 23, 2026

విశాఖలో అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్ సిద్ధం చేయాలి సెమీ కండక్టర్ రంగంలో ఎకోసిస్టం ఏర్పాటు కావాలి తూర్పు, పశ్చిమ ప్రాంతాల అనుసంధానంపై దృష్టిపెట్టాలి 22వ ఎస్ఐపీబీ సమావేశంలో...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 23-11-2026

by కార్యకర్త
November 23, 2026

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

పంచాయతీల్లో పోటీ వద్దు…ఏకగ్రీవాలే మేలు

by చైతన్యరధం
November 23, 2026

రాజకీయాలకు అతీతంగా ఒకేమాటపై సర్పంచ్‌లను ఎన్నుకోవాలి కక్షలు, కార్పణ్యాలతో పల్లెల్లో చిచ్చు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు...

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

కొఠియా గ్రామాల్లో ఒడిశా పోలీసుల వైఖరి దారుణం

by చైతన్యరధం
November 23, 2026

గిరిజనుల ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవటం సరికాదు సరిహద్దు ప్రాంతాల్లో సమన్వయంతో వ్యవహరించాలి గిరిజన సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి సాలూరు (చైతన్యరథం): ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ...

కూటమి అభ్యర్థులను గెలిపించండి

కూటమి అభ్యర్థులను గెలిపించండి

by చైతన్యరధం
November 23, 2026

తీవ్ర జ్వరంలోనూ సెలైన్ ఎక్కించుకుని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి పాలకొల్లు (చైతన్యరథం): వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ప్రజల సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోలేదని, నేడు...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.