చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

పేదలందరికీ పక్కా గృహాలు

సమాచార, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి

by చైతన్యరధం
Jul 8, 2026 at 6:05am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
పేదలందరికీ పక్కా గృహాలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • చంద్రబాబు హయాంలో 8 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తి
  • పీఎంఏవై కింద లక్షలాది ఇళ్లు మంజూరు.. వేగంగా నిర్మాణాలు
  • పోలవరం నిర్వాసితులకు పునరావాస గృహాలు
  • గృహ నిర్మాణ శాఖకు అదనపు సిబ్బంది కేటాయింపు
  • సమాచార, గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్థసారథి

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ పక్కా గృహాలు అందించే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు. పేదలకు పక్కా గృహాలు అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు కేంద్రం నుంచి అధిక నిధులు సాధించి వారి సొంత ఇంటి కల నిజం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ సచివాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 2014-19 మధ్య మొత్తం 13,04,516 ఇళ్లు మంజూరు చేస్తే రూ.10,194 కోట్లు ఖర్చు చేసి 8,04,853 ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అందరికీ ఇళ్లు అందించాలన్న ఏకైక లక్ష్యంతో ఆనాడు రూ.10వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారని గుర్తుచేశారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇళ్ల నిర్మాణంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.712.83 కోట్లు అదనపు ఆర్థిక సాయం అందించారన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు ఇంటికి రూ.50వేల చొప్పున, ఆదివాసీ గిరిజనులకు ఇంటికి రూ.75వేల చొప్పున అందించి వారికి చేయూతనివ్వడం జరిగిందని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. గత ప్రభుత్వం పాలనలో పరిశీలిస్తే 18లక్షల 61వేల గృహాలు మంజూరు చేయగా ఆ ప్రభుత్వ పాలన పూర్తయ్యే నాటికి అనగా 2024 మే 31 నాటికి రూ.9,588 కోట్లు ఖర్చు చేసి కేవలం 6లక్షల 70వేల 636 ఇళ్లను మాత్రమే పూర్తి చేయగలిగారని మంత్రి పార్ధసారధి పేర్కొన్నారు. అన్నింటికన్నా అన్యాయం ఏమిటంటే, చంద్రబాబు ప్రభుత్వంలో ఇళ్లు మంజూరై స్వంత నిధులతో ఇంటి నిర్మాణాలు చేపట్టిన 4లక్షల 36వేల 907 మంది లబ్ధిదారుల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిన గత ప్రభుత్వం పేద లబ్ధిదారులకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-07-2026

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి గత ప్రభుత్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో 1.50 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు వంతున మహిళా లబ్ధిదారుల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల 29వేల 450 ఇంటి స్థలాలు పంపిణీ చేయగా వాటిలో 7లక్షల 89వేల 550 మందికి గృహాలు మంజూరు చేయగా ఇంకా 12లక్షల 39వేల 900 ఖాళీ స్థలాల్లో ఇళ్లు మంజూరు చేయాల్సి ఉందని మంత్రి పార్ధసారధి తెలిపారు.
2024 తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్కా గృహాల నిర్మాణాలను వేగవంతం చేసిందని మంత్రి పార్ధసారధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి కేంద్రానికి పంపించి మంజూరు చేయించుకోవడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకంలో భాగంగా 57,600 గృహాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో భాగంగా 684 ఇళ్లు, పీఎం-జనమన్ కింద 28,430 ఇళ్లు మొత్తం 86,714 ఇళ్లు మంజూరయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు పీఎంఏవై అర్బన్, గ్రామీణ్ మరియు పీఎం-జనమన్ పథకాల కింద రూ.2,102 కోట్లు ఖర్చు చేసి 4లక్షల 56వేల 536 ఇళ్లను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. పక్కా గృహాల నిర్మాణం కోసం అర్హులైన లబ్ధిదారుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు కోరగా దాదాపు 10,42,199 దరఖాస్తులు అందాయన్నారు. స్క్రూటినీ అనంతరం నిబంధనల మేరకు 9.50 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగిందన్నారు. వీటిలో మొదటి విడతగా కేంద్రం 74,812 ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు. భవిష్యత్తులో అర్హుల సంఖ్యను బట్టి కేంద్రం నుంచి పెద్ద సంఖ్యలో ఇళ్లను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.

పీఎంఏవై అర్బన్ 2.0 పథకానికి యూనిట్ ధర రూ.2.50 లక్షలుగా నిర్ధారించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఇందులో రూ.1.50 లక్షలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష అందించనున్నాయన్నారు. అంతేకాకుండా అవసరమైతే ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో సభ్యులైన లబ్ధిదారులు బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చన్నారు. అలాగే అదనంగా స్వచ్ఛభారత్ మిషన్ నుంచి మరుగుదొడ్ల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించడానికి గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తుందన్నారు. అర్బన్ హౌసింగ్ పథకంలో ఇప్పటి వరకు 5,801 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు రూ.178.95 కోట్లు ఖర్చు చేశామన్నారు. పీఎంఏవై గ్రామీణ్ పథకంలో భాగంగా యూనిట్ ధర రూ.2.39 లక్షలుగా నిర్ధారించడం జరిగిందన్నారు. ఇందులో రూ.72వేలు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రూ.48వేలు అందిస్తున్నాయన్నారు. అంతేకాకుండా రూ.80వేలు వడ్డీ లేని రుణాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే ఎనఆరఈజీఎస్ కింద రూ.39వేలు అందిస్తున్నామన్నారు.

స్వర్ణ గ్రామం, వార్డుల్లో పని చేసే 370 మంది ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖకు కేటాయించడంతో గృహ నిర్మాణాలు మరింత వేగవంతం అవుతాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు మంత్రి పార్ధసారధి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటు వివిధ కార్పొరేషన్లలో పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచడంతో గృహ నిర్మాణంలో నైపుణ్యం, విశేష అనుభవం ఉన్న దాదాపు 348 మంది వరకు విధుల్లో కొనసాగే అవకాశం ఉందని, వారి పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం మరింత వేగవంతం అవుతుందని చెప్పారు.
పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని గృహ నిర్మాణ శాఖ చేపడుతుందని మంత్రి పార్ధసారధి తెలిపారు. ఇప్పటికే బుట్టాయిగూడెం, తాడువాయి తదితర ప్రాంతాల్లో వేగంగా గృహ నిర్మాణాలు చేస్తున్నామన్నారు. పునరావాసంలో భాగంగా పోలవరం పూర్తయ్యేలోపు నిర్వాసితులు అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి పార్ధసారధి స్పష్టం చేశారు.

Previous Post

టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం

Next Post

పంటల బీమా పథకాలు కొనసాగింపు

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-07-2026

కార్యకర్త
@ July 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-07-2026

కార్యకర్త
@ July 17, 2026
చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 16-07-2026

కార్యకర్త
@ July 16, 2026
చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-07-2026

కార్యకర్త
@ July 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-07-2026

కార్యకర్త
@ July 14, 2026
రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!
ఆంధ్రప్రదేశ్

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ఆంధ్రప్రదేశ్

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
Load More

ముఖ్య వార్తలు

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం

చైతన్యరధం
@ July 10, 2026
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు పెంపు

చైతన్యరధం
@ July 9, 2026
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చైతన్యరధం
@ July 8, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

రికార్డుల గోల్‌మాల్‌లో వైసీపీ నేత!

చైతన్యరధం
@ July 14, 2026

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత

చైతన్యరధం
@ July 14, 2026

ఫాస్ట్ ట్రాక్‌లో పోలవరం పనులు

చైతన్యరధం
@ July 14, 2026
సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

సర్ పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు

చైతన్యరధం
@ July 13, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist