- 3 లక్షల గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం
- మరో 6 లక్షలు మంజూరుకు కేంద్రమంత్రి హామీ
- 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో
- పైలెట్ ప్రాజెక్టుగా 177 ఇళ్ల నిర్మాణం
- ఈ సాంకేతికతతో రెండేళ్లకు బదులుగా మూడునెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది
- బుర్రిపాలెం బహిరంగ సభలో సీఎం చంద్రబాబు
- కేంద్రమంత్రి శివరాజ్్సంగ్ చౌహాన్తో కలిసి 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన
తెనాలి(చైతన్యరథం): రాష్ట్రంలో 2029 నాటికి ఇల్లు లేని పేదలందరికీ వంద శాతం పక్కా ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పేదలకు సొంతిల్లు ఉంటే వారి జీవన ప్రమాణాలతో పాటు ఆత్మగౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజక వర్గం బుర్రిపాలెంలో ఆదివారం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్సంగ్ చౌహాన్తో కలిసి పీఎంఏవై గ్రామీణ్ 2.0లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.14 కోట్లతో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ ద్వారా 177 ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన పైలెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. పేదలకు పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా లబ్దిదారు కుటుంబంతో కలిసి ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రానికి సాధారణ కోటా కింద 75వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయని, ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం 3లక్షల ఇళ్లను మంజూరు చేసిం దని తెలిపారు. ఈ 3లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే లోగానే మరో 3లక్షల ఇళ్లను, వచ్చే ఏడాది మరో 3 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు కేంద్రమంత్రి శివరాజ్సంగ్ చౌహాన్ అంగీకరించారని చెప్పారు.
మొత్తంగా 9 లక్షల ఇళ్లను రాష్ట్రానికి మంజూరు
చేసేందుకు కేంద్రం సహకరి స్తోందని తెలిపారు. పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచనకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. 3 లక్షల ఇళ్ల నిర్మాణం అంటే కేవలం ఇళ్ల నిర్మించడమే కాదు.. 3 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పునకు శ్రీకారం చుట్టే కార్యక్రమమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలు వేసిన ఓటుతో సంక్షేమం, అభివృద్ధిని ప్రతిఒక్కరికీ చేర్చేలా సుపరిపాలన అందిస్తున్నామని చెప్పారు. 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించే ఇళ్లలో బయట వాతావరణంతో పోలిస్తే ఉష్ణోగ్రత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సాంకేతికతతో రెండేళ్ల సమయానికి బదులుగా..మూడు నెలల్లోనే ఇళ్ల నిర్మాణం పూర్తి అవుతుందని తెలిపారు. నిర్మించే ఇళ్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్టు వివరించారు.
పేదలకు రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలు
పేదలకు పట్టాభిషేకంలో భాగంగా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి పేదలకు నివాస స్థలాలు అందించా మని తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను పేదలకు అందించామని చెప్పారు. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి అండ గా నిలవడమే కూటమి ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేశారు. గత పాలనలో గృహ నిర్మాణ కార్యక్రమం పూర్తిగా భ్రష్టుపట్టి ໖.. 2019-24 2 6 లక్షల పేదల ఇళ్లను రద్దు చేశారు..నివాసయోగ్యం కాని చెరువులు, గుట్టల్లో ఇంటి స్థలాలు ఇచ్చారని విమర్శించారు. దాదాపు 4 లక్షల మంది ఆ స్థలాలను వద్దంటూ వెనక్కి ఇచ్చేశారని తెలిపారు. ఇప్పుడు మళ్లీ
పేదలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి పోలవరం పూర్తయ్యేలోగా గోదా వరి నీటిని వినియోగించుకున్నామని చెప్పారు.
ఎల్నినో వంటి తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోనూ కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని తరలించి పంటలను కాపాడగలిగామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు నీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు అంకురార్పణ చేశామని, రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఉద్యాన ఫలాల ఉత్పత్తి కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వచ్చే ఐదేళ్లలో రూ. 1.30 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడతా మని చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహ ర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం వేదికపై లక్ష్మీ అనే మహిళ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్సంగ్ చౌహాన్ ఇంటి పట్టాను అందజేశారు.














