చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

మంగళగిరి ఆడపడుచులు నా అక్కాచెల్లెళ్లు!

వారికి ఎల్లప్పుడూ రుణపడిఉంటా

by చైతన్యరధం
Aug 10, 2025 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
మంగళగిరి ఆడపడుచులు నా అక్కాచెల్లెళ్లు!
Share on FacebookShare on TwitterShare on Whatsapp

` మీ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతా
` మంత్రి నారా లోకేష్‌ ఉద్ఘాటన
` మంత్రికి రాఖీలు కట్టిన మంగళగిరి మహిళలు

ఉండవల్లి (చైతన్యరథం): నాకు సొంతంగా అక్కలు, చెల్లెళ్లు లేరు.. మంగళగిరి మహిళలే నా అక్కాచెల్లెళ్లు.. ఈరోజు మీరంతా రాఖీకట్టి నాకు అందించిన ఆశీస్సులు కొండంత బలాన్నిచ్చాయి.. మీ ఆశీస్సులతో మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెం.1గా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. రాఖీపౌర్ణమిని పురస్కరించుకొని మంగళగిరి నియోజకవర్గానికి చెందిన మహిళలు శనివారం ఉండవల్లి నివాసానికి వచ్చి మంత్రి లోకేష్‌కు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ… మంగళగిరి ఆడబిడ్డలందరికీ తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాననన్నారు. 2019 ఎన్నికల్లో నేను తొలిసారిగా పోటీచేసినపుడు 5,300 ఓట్లతో ఓటమిచెందాను. అప్పుడు నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను విమర్శించడమేగాక కొడుకును గెలిపించుకోలేక పోయారంటూ చంద్రబాబుని కూడా అవమానించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

అయితే ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో పనిచేశాను. సొంత నిధులతో 26 అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేసి మీ అందరి అభిమానాన్ని చూరగొన్నాను. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో నన్ను రాష్ట్రంలోనే 3వ అతిపెద్ద మెజారిటీతో గెలిపించి విమర్శించిన వారి నోళ్లు మూయించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాను. ఆనాడు ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది ప్రభుత్వభూముల్లో నివసించే వారికి శాశ్వత ఇళ్లపట్టాలు. తొలి ఏడాదిలోనే దాదాపు 3వేలమందికి పైగా పేదలకు వెయ్యికోట్ల విలువైన ఆస్తిని పంపిణీచేసి మాట నిలబెట్టుకున్నా. త్వరలోనే మరోవిడత ఇళ్లపట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంలో 200 అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాను.

ఇందులో ప్రధానమైన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి, విద్యుత్‌, గ్యాస్‌ పైప్‌ లైన్ల ఏర్పాటు, 100 పడకల ఆసుపత్రి, స్వర్ణకారుల కోసం జెమ్స్‌ అండ్‌ జ్యుయలరీ పార్కు వంటివి పురోగతిలో ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లన్నీ అభివృద్ధి చేస్తున్నాం. మహా ప్రస్థానం పేరుతో శ్మశాన వాటికల నిర్మాణం, పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఇలా ఇచ్చిన ప్రతిహామీని నిలబెట్టుకోవడానికి నిరంతరం కృషిచేస్తున్నాను. మీరు ఇచ్చిన భారీ మెజారిటీ నా బాధ్యతను మరింత పెంచింది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు రెట్టింపు కష్టపడుతున్నా. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా. మీ అందరి సహకారంతో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

Previous Post

గిరిజనులకు అన్నివిధాల అండగా ఉంటాం

Next Post

రజనీ యుగంలో పుట్టడం మా అదృష్టం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-10-2026

కార్యకర్త
@ October 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-10-2026

కార్యకర్త
@ October 17, 2026
పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రప్రదేశ్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ
ఆంధ్రప్రదేశ్

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది
ఆంధ్రప్రదేశ్

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్
ఆంధ్రప్రదేశ్

బెంగళూరులో కూర్చొని ఏపీలో విధ్వంసాలు సృష్టిస్తున్న జగన్

చైతన్యరధం
@ October 17, 2026
ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు
ఆంధ్రప్రదేశ్

ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల దౌర్జన్యాలపై కఠిన చర్యలు తప్పవు

చైతన్యరధం
@ October 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం

చైతన్యరధం
@ October 15, 2026
ఉత్సవం… ఉత్సాహం

ఉత్సవం… ఉత్సాహం

చైతన్యరధం
@ October 14, 2026
తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

తిరుపతి సమగ్రాభివృద్ధికి శ్రీకారం

చైతన్యరధం
@ October 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

పేదలకు అండగా ఎన్టీఆర్ ట్రస్ట్

చైతన్యరధం
@ October 17, 2026
దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

దుర్గమ్మకు చీర, సారె సమర్పణ

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

పుంగనూరులో హింసే పెద్దిరెడ్డి అజెండా

చైతన్యరధం
@ October 17, 2026
పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

పుంగనూరులో పెద్దిరెడ్డి కుటుంబం రౌడీయిజానికి కాలం చెల్లింది

చైతన్యరధం
@ October 17, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist