- విద్యార్థులకు కిట్లపై అబద్ధాలు
- విద్యాశాఖ ప్రకటనను వక్రీకరించిన సైకోలు
- పూర్తిగా నిలిపివేసిందంటూ దుష్ప్రచారం
- పాఠశాలల ప్రారంభం నాటికి పంపిణీ
అమరావతి (చైతన్యరథం): కూటమి ప్రభుత్వం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను పూర్తిగా నిలిపివేసిందని, పేద విద్యార్థులకు ఈ ఏడాది యూనిఫాం, షూ, బ్యాగ్లు, పాఠ్యపుస్తకా లు ఇవ్వడం లేదని సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇది పూర్తిగా అవాస్తవం. వందశాతం అబద్ధం. పశ్చి మాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ముడిసరుకుల ధరల పెరుగుదల, రవాణా అడ్డంకుల వల్ల యూనిఫాం క్లాత్, బ్యాగులు, బూట్ల సరఫరా కేవలం నెలరోజులు ఆలస్యమవుతుం దని విద్యాశాఖ తెలిపింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారం భమయ్యే నాటికి విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ ఖచ్చితంగా అందుతాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లో మిగిలిన దుస్తులు, వస్తువులు సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయడానికి తయారీ సంస్థలతో అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే కూటమి ప్రభుత్వంపై విష ప్రచారానికి అలవాటుపడిన జగన్రెడ్డి అండ్ కో ప్రభుత్వ విద్యను పేద పిల్లలకు దూరం చేసేలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కిట్లు పంపిణీ కాస్త ఆలస్యం అవుతుందని నిజాయితీగా అధికారులు ప్రకటిస్తే.. దానిని వక్రీకరించి అసలు కిట్ల పంపిణీ ఉండదంటూ విషప్రచారం చేయడం జగన్రెడ్డి వక్రబుద్ధికి మరో నిదర్శనం.













