బుసాన్ (సౌత్ కొరియా) పాదరక్షలు, ష లేసులు, మెటల్ హార్డ్వేర్, అనుబంధ పరికరాల తయారీలో పేరెన్నికగన్న బూ యంగ్ గ్రూప్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ డైరెక్టర్ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ, ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో మంత్రి నారా లోకేష్ బుసాన్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బూ యంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బూ యంగ్ గ్రూప్ రాష్ట్రానికి వస్తే సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కనెక్టివిటీ సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, స్పీడ్ ఆఫ్
డూయింగ్ బిజినెస్ విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. బూ యంగ్ గ్రూప్ సీఈవో ర్యాన్ కాంగ్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్లో బూ యంగ్ పాదరక్షల తయారీ, విడిభాగాల యూనిట్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తూ రెడీ బిల్ట్ షెడ్ల కోసం అన్వేషి స్తున్నట్లు చెప్పారు. సైకార్ప్ గ్రూప్ అంతర్భాగంగా ఉన్న తమ సంస్థ అంతర్జాతీయ నెట్వర్క్ తో పాటు 4,300 గ్లోబల్ కస్టమర్లు, 1.10 లక్షలకు పైగా అంతర్జాతీయ
షిప్మెంట్లు కలిగి ఉన్నట్లు తెలిపారు. తమకున్న గ్లోబల్ నెట్వర్క్ భారతీయ తయారీరంగాన్ని ప్రపంచ పంపిణీ వ్యవస్థతో అనుసంధానిస్తుందని వివరించారు.















