చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ముఖ్య వార్తలు

హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం

చేనేత, హస్తకళల అభివృద్ధి మంత్రి ఎస్ సవిత

by చైతన్యరధం
Jul 8, 2026 at 6:20am
in ముఖ్య వార్తలు
హస్తకళల ప్రోత్సాహమే సంకల్పం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గ్రామీణ రూపాంతరమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
  • చేనేత, హస్తకళల అభివృద్ధి మంత్రి ఎస్ సవిత
  • ఘనంగా ఏపీ హస్తకళా మహోత్సవం-2026

విజయవాడ (చైతన్య రథం): రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ, లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం-2026 ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర చేనేత, హస్తకళల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రి ఎస్. సవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో హస్తకళలను ప్రోత్సహించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రతి స్టాల్‌ను సందర్శించి కళాకారుల సమస్యలను తెలుసుకోవడం వారికి కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. బొబ్బిలి వీణల తయారీదారులు ఎదుర్కొంటున్న కలప కొరతను తీర్చేందుకు రానున్న ఆగస్టు 15నాటికి వుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. లేపాక్షి ఆధ్వర్యంలో కళాకారుల ఉత్పత్తుల విక్రయాల కోసం తరంగ యాప్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
దేశవ్యాప్తంగా హస్తకళలకు ప్రకటించిన 30 జాతీయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు అత్యధికంగా 10 అవార్డులు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్, నగరవనాలు ఏర్పాటు చేస్తూ పచ్చదనం పెంపొందిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద రికార్డు స్థాయిలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు గోకులం షెడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం వేగంగా కొనసాగుతోందన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను అమలు చేస్తూ హస్తకళాకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

చేనేత, హస్తకళల గౌరవ సలహాదారు సుచిత్ర యల్లా మాట్లాడుతూ.. రాష్ట్ర హస్తకళలు, చేనేత వస్త్రాలను దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మరింతగా ప్రోత్సహించడం మనందరి బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ దిశగా స్పష్టమైన మార్గదర్శకత్వం అందిస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం కళాఖండాలు, కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని చెప్పారు. రాష్ట్రానికి లభించిన 34 క్లస్టర్లు, జాతీయ అవార్డులు, జీఐ ట్యాగ్‌లు మన కళల గొప్పతనానికి నిదర్శనమన్నారు. సాంకేతికంగా ఎంత ముందుకెళ్లినా పర్యావరణ హిత, సురక్షిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు చేనేత వస్త్రాలు ధరిస్తే కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. నేటి యువతకు ఇక్కత్, కలంకారీ వంటి సంప్రదాయ కళలను పరిచయం చేస్తూ మన సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. తిరుపతి కళాకారులు రూపొందించిన స్వామివారి విగ్రహాన్ని అమెరికాకు పంపగా విశేష ప్రశంసలు లభించడం మన కళాకారుల ప్రతిభకు గర్వకారణమని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ… ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మాటల్లోనే కాకుండా చేతల్లోనూ కళాకారుల పట్ల తన అభిమానాన్ని చాటుతున్నారని అన్నారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హస్తకళల వస్తువులే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. హస్తకళలలో రాష్ట్రం గ్లోబల్ డెస్టినేషన్‌గా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధితవార్తలు

మాడుగుల నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశం అయ్యారు.

భాష, సంస్కృతి, భౌగోళికంగా విభిన్నమైన బ్రిక్స్‌ దేశాలను క్రీడలు, యువత ఒక్కటిగా కలుపుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు.

విజయనగరం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పాల్గొన్నారు.

చేనేత మరియు హస్తకళలు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ (చేనేత మరియు జౌళి) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి. సిసోడియా మాట్లాడుతూ… లేపాక్షి బ్రాండ్ టర్నోవర్ గత రెండేళ్లలో రూ.35 కోట్ల నుంచి రూ.60 కోట్లకు పెరగడం దీని ప్రాధాన్యతను తెలియజేస్తుందన్నారు. బొబ్బిలి వీణ వంటి ఉత్పత్తులు అంతర్జాతీయ గుర్తింపు పొందాయని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈఆర్పీ ఆధారిత ఐటీ సొల్యూషన్ల ద్వారా వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్, మార్కెట్ ఇంటెలిజెన్స్, ఈ-కామర్స్ కార్యకలాపాలను ఆధునికీకరించామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డుల్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన 30 అవార్డుల్లో 9 అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు రావడం విశేషమన్నారు. రాష్ట్ర చేనేతకు చెందిన 5, హస్తకళలకు చెందిన 11 ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ లభించిందని చెప్పారు. రాష్ట్రంలోని రెండు లక్షలకుపైగా హస్తకళాకారుల ఉత్పత్తులకు నాణ్యత పెంచడంతో పాటు వాటి వెనుక ఉన్న ప్రత్యేకతను వివరిస్తూ స్టోరీటెల్లింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. చిన్న కళాకారుల ఆర్థికాభివృద్ధికి లేపాక్షి బలమైన వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), గౌరవ అటవీ శాఖ సలహాదారు మల్లికార్జునరావు, అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మరియు హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ డాక్టర్ పి.వి. చలపతిరావు, చేనేత, హస్తకళల కమిషనర్ రేఖా రాణి, ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ సంస్థ వీసీ మరియు మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహర్, హస్తకళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post

పంటల బీమా పథకాలు కొనసాగింపు

Next Post

కడప ‘ఉక్కు’ ఘనత మాదే!

మరిన్ని వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు
ఆంధ్రప్రదేశ్

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్
ఆంధ్రప్రదేశ్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు
ఆంధ్రప్రదేశ్

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
జయహో బీసీ…
ఆంధ్రప్రదేశ్

జయహో బీసీ…

చైతన్యరధం
@ August 19, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
Load More

ముఖ్య వార్తలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

సీబీఎన్…ది స్టేట్స్‌మెన్

చైతన్యరధం
@ August 21, 2026
ప్రధాని జన్ విశ్వాస్‌లో భాగంగానే ప్రైవేటు వర్సిటీల సవరణ బిల్లు

డేటా సెంటర్లపై అపోహలు వద్దు

చైతన్యరధం
@ August 20, 2026
వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

వెలిగొండ నిర్వాసితులకు మరో రూ.200 కోట్లు

చైతన్యరధం
@ August 20, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

దక్షిణాది రాష్ట్రాల ప్రగతికి సమష్టి అడుగులు

చైతన్యరధం
@ August 21, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

అసెంబ్లీకి రాకుండా జగన్ పారిపోతున్నారు

చైతన్యరధం
@ August 21, 2026
ఇక ఆంధ్రా మోడల్‌ ఎడ్యుకేషన్‌

విశాఖలో టీచర్ కొట్టడంతో బాలుడి మృతి

చైతన్యరధం
@ August 21, 2026
ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

ప్రతి బోటు, ప్రతి మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలి

చైతన్యరధం
@ August 21, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist