చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్

పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణలో మంత్రి లోకేష్

by చైతన్యరధం
Mar 17, 2026 at 6:30am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఏపీకి గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు
  • ఆయన విగ్రహం తెలుగుజాతి గొప్పతనానికి నిదర్శనం
  • నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా
  • ఆ గౌరవం మనందరికీ ఇచ్చింది పొట్టి శ్రీరాములే
  • అమరావతిలో విగ్రహం ఏర్పాటుతో యువగళం హామీ నిలబెట్టుకున్నా
  • పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణలో మంత్రి లోకేష్

అమరావతి (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస’. త్యాగానికి మానవరూపం పొట్టి శ్రీరాములు. ఆయన విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతినుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిందని విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస’ పేరిట ఏర్పాటు చేసిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబునాయుడుతో కలిసి విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు.

పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరజీవి త్యాగ శిల్పంవద్ద మంత్రి లోకేష్ నివాళి అర్పించారు. అమరావతి ప్రాంతంలోని శాఖమూరులో కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల్లో అమరజీవి పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఏర్పాటుచేస్తోంది. 6 నెలల రికార్డు సమయంలోనే ప్రాజెక్ట్ మొదట దశ పనులు పూర్తిచేయడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. “జై వాసవీ మాత. ఒక మనిషి త్యాగం.. ఒక జాతి గౌరవం. ఒక దీక్ష.. ఒక రాష్ట్రం. అమరజీవి.. చిరంజీవి. మరణంలేని గొప్ప శక్తి. త్యాగానికి మానవరూపం. ఆంధ్రప్రదేశ్ రూపంలో జీవించే ఉన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి రోజు 58 అడుగుల విగ్రహం రూపంలో మనకోసం మళ్లీ జన్మించారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస’. డూండి రాకేష్ నా దగ్గరకు వచ్చి ఏంపేరు పెట్టాలనేదానిపై సలహా అడిగారు. అప్పుడు నా మనసులో తోచింది ఒక్కటే ఆ విగ్రహం చూస్తే ఆయన త్యాగం గుర్తుకురావాలి. అందుకే ‘స్టాచ్యూ ఆప్ శాక్రిఫైస’ అని పెడదామని చెప్పాను. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతినుంచి అంతర్జాతీయస్థాయికి తీసుకువెళ్లింది” అని అన్నారు.

సంబంధితవార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

నేను తెలుగువాడినని గర్వంగా చెప్పుకుంటున్నా
“నేను తెలుగువాడిని, నేను ఆంధ్రప్రదేశ్ పౌరుడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనందరికీ ఇచ్చింది పొట్టి శ్రీరాములు. ఆయన ఒక వ్యక్తి కాదు తెలుగు గౌరవం. ఆయన ప్రాణత్యాగం.. మన రాష్ట్రం. ఆ మహనీయుడి జయంతి.. మన ఆంధ్రులకు పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నా” అన్నారు.

ఈ విగ్రహం ఆయన త్యాగాన్ని నిత్యం గుర్తుచేస్తుంది
“యువగళం పాదయాత్రలో నేను ఆర్యవైశ్య సోదరులను అనేకసార్లు కలిశాను. వాళ్లకున్న సమస్యల గురించి చర్చించాం. అధికారంలోకి వచ్చిన వెంటనే కొన్ని పరిష్కరించాం, ఇంకొన్ని సమస్యలున్నాయి. అవీ పరిష్కరిస్తాం. అమరావతిలో అమరజీవి విగ్రహం ఏర్పాటు చేస్తామని యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చాను. ఇచ్చిన హామీని తక్కువ సమయంలోనే నిలబెట్టుకోవడం ఆనందంగా ఉంది. ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస’ 58 అడుగులు అమరజీవి ఆమరణ దీక్షచేసిన 58 రోజులకు సంకేతం. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన త్యాగాన్ని మనకు ప్రతిరోజూ గుర్తుచేస్తుంది. మనం ఒకరోజు ఉపవాసం ఉండాలి అంటే ఇబ్బంది పడతాం. అలాంటిది ఒక రాష్ట్ర ఏర్పాటుకోసం ఆయన 58 రోజులు దీక్ష చేసి ప్రాణత్యాగం చేశారు. ఈ చరిత్ర భావితరాలకు అందించడం మన బాధ్యత. 2025 సెప్టెంబర్ 3న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశాం. 194 రోజుల్లోనే విగ్రహ ఏర్పాటు పూర్తిచేసిన కూటమి ప్రభుత్వం, ట్రస్ట్, అధికారులు, సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు అందరినీ అభినందిస్తున్నాను. మా రౌడీ డూండీని ఎప్పుడూ స్పీడ్ పెంచాలి అంటూ ఉంటాను. విగ్రహ ఏర్పాటుమాత్రం జెట్ స్పీడ్‌లో చేశారు. ఇంత స్పీడ్‌గా చేస్తారని నేను ఊహించలేదు” అని మంత్రి లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు.

అమరజీవి శ్రీరాములు నిత్యపోరాటయోధుడు
“పొట్టి శ్రీరాములు స్వార్థంలేని ఉద్యమం చేశారు. సమాజాభివృద్ధికి ఒక కార్యకర్తలా పనిచేశారు. రాజకీయాలు చేయలేదు. పదవులు ఆశించలేదు. గాంధీ సబర్మతి ఆశ్రమంలో చేరారు. స్వాతంత్య్రం కోసం పోరాడారు. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలుకెîళ్లారు. నెల్లూరులో దళితులకు ఆలయప్రవేశం కోసం ఉద్యమించారు. అంటరానితనంపై పోరాడారు. ఐదుసార్లు నిరాహార దీక్షలు చేశారు. నాడు ఆంధ్రుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేయకపోవడం మహాపాపమని ప్రకటించారు. కొందరి స్వార్థం కోసం ఆంధ్రుల ఆత్మగౌరవం బలికాకూడదన్నారు. వస్తే ప్రత్యేక రాష్ట్రం.. పోతే తన ప్రాణం అనుకున్నారు. దీక్షకు ఎవరూ స్థలం ఇవ్వకపోతే రోడ్డుమీదే ఆమరణదీక్ష చేస్తానన్నారు. ఆయన నిత్యపోరాటయోధుడు. ఆయన నా యువగళం పాదయాత్రకు స్ఫూర్తి. అప్పటి ప్రభుత్వం నా నైట్ బస్ పెట్టుకోవడానికి ఎవరైనా భూమి ఇస్తే 22-ఏలో పెడతామని బెదిరించారు. అప్పుడు నేను ఒకటే చెప్పేవాడిని. ఎవరూ స్థలం ఇవ్వకపోతే నేను రోడ్డుమీద పడుకుంటా అని” అని లోకేష్ గుర్తు చేసుకున్నారు.

ప్రాణత్యాగంతో ఆంధ్ర రాష్ట్ర సాధన
“మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో 1952 అక్టోబర్ 19న ఆమరణ దీక్ష ప్రారంభించారు. దీక్ష మొదటి రోజు 53.9 కేజీల బరువున్న పొట్టి శ్రీరాములు 58వ రోజు 38.1 కేజీలకు తగ్గారు. పొట్టి శ్రీరాములు స్థానంలో ఏ ఒక్కరున్నా దీక్ష విరమించేవారు. అమరజీవి తాను అనుకున్నట్టే వస్తే రాష్ట్రం.. పోతే ప్రాణం అనుకుని దీక్ష విరమించలేదు. 58 రోజులపాటు దీక్ష చేసి తన ప్రాణాలను త్యాగం చేశారు. ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. ఒక్క ప్రాణత్యాగం కోట్లమందిని కదిలించింది. ఢిల్లీ దిగివచ్చింది. కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది” అని లోకేష్ పేర్కొన్నారు.

భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై అమరజీవి ప్రభావం
“ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ.. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి ఒక వ్యాసం రాశారు. దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బయట పొట్టి శ్రీరాములును మర్చిపోయారని రాస్తూ.. ఆయన ఏం చెప్పారో తెలుసా? భారతదేశ చరిత్ర, భౌగోళిక స్వరూపంపై అమరజీవి తీవ్ర ప్రభావం చూపారు. ఆయన దీక్ష తరువాత.. భారతదేశ చిత్రపటంపై భాషాప్రయుక్త రాష్ట్రాల రేఖలు ఏర్పడ్డాయన్నారు. పొట్టి శ్రీరాములును భారతదేశ మెర్కాటర్‌గా రామచంద్ర గుహ అభివర్ణించారు. 1569లో ప్రపంచ పటాన్ని తయారు చేసిన జర్మన్-ఫ్లెమిష్ భౌగోళిక శాస్త్రవేత్త ఈ మెర్కాటర్. అంతటి గొప్ప వ్యక్తి మన పొట్టి శ్రీరాములు చరిత్ర దేశం మొత్తం గుర్తుపెట్టుకునేలా ఈ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టం” అని లోకేష్ భావోద్వేగంతో పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా పనిచేసిన గొప్ప వ్యక్తి రోశయ్య

“మీతో ఎప్పుడు సమావేశమైనా మొదట గుర్తొచ్చేది రోశయ్య తాత. ఆయన రాజకీయాల్లో స్టేట్స్ మ్యాన్. ఆయన అసెంబ్లీలో మాట్లాడితే అంతా నిశ్శబ్దం. అంత శ్రద్ధగా వినేవారు. ఆయన లేని లోటు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ప్రతి పుట్టిన రోజుకి నేను ఫోన్ చేసి మాట్లాడేవాడిని. రాజకీయాలకు అతీతంగా పనిచేసిన గొప్ప వ్యక్తి మాజీ సీఎం రోశయ్య” అని గుర్తు చేసుకున్నారు.

యువగళం హామీని నిలబెట్టుకున్నా
ఎన్ని కోరికలు తీర్చినా మన డూండి రాకేష్‌కు ఇంకో చివరి కోరిక ఉంటుంది. ఇప్పుడు పొట్టి శ్రీరాములు పేరు మీద స్మారక నాణెం విడుదల చేయాలని అడిగారు. కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడి స్మారక నాణెం విడుదలకు ప్రయత్నం చేస్తున్నాం. ఆయన జయంతి రోజున నేను ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడం నా అదృష్టం. భారతదేశమే ఆశ్చర్యపోయేలా విగ్రహావిష్కరణ జరిగింది. యువగళం హామీ నెరవేర్చిన బీసీ సంక్షేమ మంత్రి సవితకు, ట్రస్ట్‌కు, 10 రూపాయల దగ్గర నుంచి కోటి రూపాయలు విరాళమిచ్చిన వారున్నారు. విరాళం ఎంత అనేది కాదు.. మంచిపనిలో భాగస్వామ్యం అవ్వాలనే ఆలోచన గొప్పది. సీఆర్డీయే, అధికారులు, ఆర్యవైశ్య పెద్దలకు అందరికీ అభినందనలు. 12 నెలల్లోనే స్మృతివనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ల నిర్మాణం పూర్తిచేయాలి” అని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ఎస్ సవిత, టీజీ భరత్, పి.నారాయణ, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్, ఎమ్మెల్యేలు శ్రీరామ్ రాజగోపాల్ (తాతయ్య), ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, పొట్టి శ్రీరాములు కుటుంబ సభ్యులు, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సామాజికవర్గ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Previous Post

ఆర్యవైశ్యులకు అన్నివిధాల మద్దతు

Next Post

తెలుగోడి సత్తా.. అమరజీవి

మరిన్ని వార్తలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 20-06-2026

కార్యకర్త
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం
ఆంధ్రప్రదేశ్

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026
ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో డిజిటల్ మౌలిక సదుపాయాలు

చైతన్యరధం
@ June 20, 2026
ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్

ఏపీలో సిలికాన్-కార్బన్ యానోడ్ యూనిట్ ఏర్పాటు చేయండి

చైతన్యరధం
@ June 20, 2026
జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు
ఆంధ్రప్రదేశ్

జీరో డిజిటల్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ దిశగా చర్యలు

చైతన్యరధం
@ June 20, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

అన్నదాతల ఖాతాల్లోకి ‘సుఖీభవ’

చైతన్యరధం
@ June 20, 2026
పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

పొగాకు రకం ఏదైనా కిలో రూ.200కి తగ్గకూడదు

చైతన్యరధం
@ June 19, 2026
ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

ఫీల్డ్ విజిట్‌లు చేయాల్సిందే

చైతన్యరధం
@ June 18, 2026
సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

సింగపూర్ ప్రధానితో సీఎం చంద్రబాబు భేటీ

చైతన్యరధం
@ June 16, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

భూ హక్కుల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా ఏపీ

చైతన్యరధం
@ June 20, 2026
డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

డీఎస్సీపై మంత్రి లోకేష్ సవాల్‌కు..సమాధానం చెప్పే దమ్ముందా జగన్?

చైతన్యరధం
@ June 20, 2026
గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

గాదె సాయికృష్ణ ఉదంతంపై…రాజకీయ లబ్ధికి జగన్ ఆరాటం

చైతన్యరధం
@ June 20, 2026

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు

చైతన్యరధం
@ June 20, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist