- గత వైసీపీ హయాంలో ఫేక్ డేటాను తొలగించాం
- శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
అమరావతి(చైతన్యరథం): ప్రజాప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, గత మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు వివరాలపై శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నల కు మంత్రి సమాధానం ఇచ్చారు. గత రెండేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. మరోవైపు గత వైసీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 2022-23 ఏడాదిలో 7.6 శాతం, 2023-24 ఏడాదిలో 3.03 శాతం, 2024-25లో 3.24 శాతం తగ్గాయని తెలిపారు. ప్రజాప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత అవకతవకలను నివారించి నకిలీ డేటాను తొలగించడంతో 2025-26లో 1.69 శాతం వరకు మాత్రమే ప్రవేశాలు తగ్గాయని వివరించారు. 2026-27 ఏడాదికి వచ్చే సరికి 0.94 శాతం ప్రవేశాలు పెరిగాయని చెప్పారు.











