- జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహణ
- ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు చర్యలు
- సకాలంలో 12 రకాల ఎంట్రన్స్ సెట్లు నిర్వహణ
- త్వరగా నోటిఫికేషన్లకు చర్యలు తీసుకోవాలి
- రాష్ట్రానికి ఎన్‌సీసీ స్టేట్ యూనిట్ మంజూరు
- విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
అమరావతి(చైతన్యరథం): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం త్వరి తగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవా లని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికపై ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ఆరా తీశారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపు పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారం లో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికా రులు వివరించారు. జూన్ 29న షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై మూడో వారంలో మెగా పీటీఎం నిర్వహణకు సమావేశంలో నిర్ణయిం చారు. మిగులు ఉపాధ్యాయుల పని సర్దుబాటుపైనా సమావే శంలో చర్చించారు.
ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమీక్ష
రాష్ట్రంలో ఎప్ సెట్, పాలిసెట్, ఆర్ సెట్ వంటి 12 రకాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లకు ఎటువంటి జాప్యం లేకుండా సాధ్య మైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేసి, నిర్ణీత సమయంలో అడ్మిషన్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే సెట్స్, పొరుగు రాష్ట్రాల కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ల తేదీలను కూడా గమనంలోకి తీసుకుని విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా రాష్ట్రంలోని వివిధ సెట్‌ల తేదీలను ఖరారు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల పెంపును పరిశీలించాలని సూచించారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో మెకాని కల్, సివిల్ విభాగాల సీట్లకు డిమాండ్ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్‌కు సంబంధించి 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల సీట్ల భర్తీకి గాను ఎప్ సెట్ నోటిఫికేషన్‌కు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో యూనివర్సిటీల ఏర్పాటుకు ఆసక్తి చూపుతు న్న థాపర్ ఇనిస్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్ బోర్న్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీ, జేఎసఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలతో చర్చల పురోగతిపై మంత్రి సమీక్షించారు. జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాల్సిందిగా మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్‌సీసీ కార్యకలాపాలు, శిక్షణ, క్యాంపులు సమన్వ యం చేయడానికి ఎన్‌సీసీ స్టేట్ డైరెక్టరేట్‌ను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎన్‌సీసీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించడానికి ఈ ప్రత్యేక కేంద్రం ఉపకరించగలదని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జే.శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా, ఉన్నతవిద్య కమిషనర్ నారాయణ్ భరత్ గుప్తా, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీని వాసరావు తదితరులు పాల్గొన్నారు.
















