- కూటమి విజయాలు ప్రతిగడపకు తెలపాలి
- మంత్రి నుంచి బూత్ స్థాయి నాయకుడి
- వరకు ప్రతిఒక్కరూ జనంలోకి వెళ్లాల్సిందే
- సర్ ప్రక్రియలో ఓట్లు పోకుండా చూడాలి
- 45 రోజుల కార్యక్రమానికి లోకేష్ పిలుపు
అమరావతి(చైతన్యరథం): గత రెండేళ్ల కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ప్రతిగడపకు వెళ్లి ప్రజలను చైతన్య వంతులను చేయాల్సిన బాధ్యత పార్టీ క్యాడర్‌పై ఉందని తెలుగు దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యే లు, ఎంపీలు, రాష్ట్ర, జాతీయ కార్యవర్గంతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. కూటమి పాలన రెండేళ్ల విజయాలపై ఈ నెల 25 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ నేతలు వెళ్లాలని పిలుపునిచ్చారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి బూత్ స్థాయి వరకు నాయకులంతా రాష్ట్రంలోని ప్రతిగడపకు వెళ్లి చేసిన మంచిని చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేలా ప్రతి ఇంటికి కరపత్రాలు, బుక్ లెట్లు అందించాలన్నారు.
కూటమిలోని జనసేన, బీజేపీ క్యాడర్‌ను కలుపుకుని వెళ్లి విజయవంతం చేయా లని, ఇది అధినేత చంద్రబాబు ఆదేశమని స్పష్టం చేశారు. సుమారు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లాలని యువనేత దిశానిర్దేశం చేశారు. తమ ఇబ్బందులను కొంతమంది ఎమ్మెల్యేలు లోకేష్‌కు వివరించారు. అర్హులైన వారు కొత్త పెన్షన్లు అడుగుతున్నారని తెలి పారు. గ్రామానికి వెళ్లిన వెంటనే చిన్నచిన్న పనులు అడుగుతు న్నారని, దీనికి కొంత నిధులు ఇవ్వాలని కోరారు. ఈ సమస్య తనకు కూడా ఉందని ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని ఎమ్మెల్యేలకు లోకేష్ సూచించారు. అన్ని విషయాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు. ఈనెల 20వ తేదీ వరకు పార్లమెం టు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కూటమి రెండేళ్ల విజయో త్సవ సభలు నిర్వహించి కూటమి ప్రభుత్వ విజయాలపై ప్రజలను జాగృతం చేయాలన్నారు.
ఇప్పటికే ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సి వ్ రివిజన్‌పై ప్రతి కార్యకర్త అప్రమత్తంగా వ్యవహరించాలి, దీనిపై ఇప్పటికే క్యాడర్‌కు తరగతులు నిర్వహించడంతో పాటు బీఎలఏ లను కూడా నియమించామని తెలిపారు. ఒక్క ఓటు కూడా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులదేనని స్పష్టం చేశా రు. శాసనసభ్యులు బీఎలఏలతో టచ్‌లో ఉండి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని, ఎక్కడైనా సమస్య తీవ్రంగా ఉంటే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ వెరిఫికేషన్ సెల్‌ను సంప్రదించాలని సూచించారు.
















