- ప్రజలు గొడ్డలి పార్టీ అంటుంటే సైకోలో ఫ్రస్ట్రేషన్
- వివేకా కేసులో సునీత పోరాటంలో న్యాయం ఉంది
- డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌తో పెనుమార్పులు
- త్వరలోనే బిల్లులు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధం
- మీడియాతో ఇష్టాగోష్ఠిలో సీఎం చంద్రబాబు
అమరావతి(చైతన్యరథం): వైఎస్ కుటుంబ అరాచకాలు ఎన్నెన్నో వెలుగులోకి వస్తున్నాయి..గొడ్డలి పార్టీ అని ప్రజల్లోకి వెళ్లే కొద్ది సైకోలో ప్రస్టేషన్ పెరుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. సైకో కంటే గొడ్డలి పార్టీ అనే అంశాన్ని ప్రజలు బాగా గుర్తించారని చెప్పారు. ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియా తో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. “వెలుగులోకి వస్తున్న వైఎస్ కుటుంబ అరాచకాలు నాకు కూడా తెలియవు. ప్రజాస్వామ్యానికి ఇలాంటి వాళ్లు పనికిరారు. మావోయిస్టులు తుపాకులతో రాజ్యాధి కారాన్ని సాధించలేరు. వీళ్లు మాత్రం గొడ్డలితో ఎలా రాజకీయాలు చేస్తారు? వివేకా హత్య కేసులో సునీత పోరాటంలో న్యాయం ఉంది. తన తండ్రిని ఎవరు చంపారో తెలుసుకునే హక్కు ఆమెకు ఉంది. ఆమె పోరాటం వల్లే ఇప్పటికీ ఆ హత్య కేసు సజీవంగా ఉంది. నేటి తరానికి కూడా వీళ్ల హత్యా రాజకీయాలు తెలుస్తు న్నాయన్నాయని అన్నారు.
డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై కీలక వ్యాఖ్యలు
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లులపై కేంద్రం పట్టుదలగా ఉంది. ఇవి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తీసు కొస్తాయి. రెండు బిల్లులను విడదీసి చూడాల్సిన అవసరం లేదు. బిల్లులను గతంలో వ్యతిరేకించిన వారి ఆలోచనలు ఇప్పుడు మారొ చ్చు. టీడీపీ ప్రకటించిన 33 శాతం రిజర్వేషన్లు దేశ రాజకీయా ల్లో చర్చనీయాంశమైంది. మహిళలకు మొదటి నుంచి మా పార్టీ అండగా ఉంది. పునర్విభజనలో 2011 జనాభా లెక్కలైనా, తాజా జనాభా లెక్కలైనా మనకు నష్టం. ఉన్న స్థానాలను 50 శాతం పెంచితే ఎవరికీ నష్టం ఉండదని తెలిపారు. పెంచిన స్థానాలను మహిళలకు కేటాయించవచ్చని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రెండు బిల్లులను తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోందని, ఆ రెండిం టినీ విడదీసి చూడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రెండు బిల్లులు కలిపి వస్తేనే మహిళలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్, పునర్విభజన బిల్లులు తప్పని సరిగా తీసుకురావాలని, ఇవి దేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొస్తాయని అభిప్రాయపడ్డారు.
మహానాడు విజయంపై అభినందనలు
హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు విజయంపై టీడీపీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇన్‌చార్జ్‌లు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైబ్రిడ్ మహానాడు విజయవంతమైం దన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో మహానాడు కార్యక్రమం నిర్వహణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. తొలి సారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు ఘన విజయం సాధించిందని పేర్కొన్నారు. మహానాడును సమర్థవం తంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ నేతలు, కార్యకర్తలు, నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. మహానాడు సందర్భంగా తెలంగాణ తెదేపా నేత బక్కని నర్సిం హులు చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి తప్పుపట్టారు. తెలం గాణపై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏ ఒక్కరీ మనోభావాలు దెబ్బతీయకూడదని సూచించారు. తెలుగు జాతి ఒక్కటేనని చెప్పారు. తెదేపా పుట్టిందే తెలంగాణ గడ్డపై అని గుర్తుచేశారు. ఆ రాష్ట్రంలో ఇప్పటికీ బలమైన క్యాడర్ ఉందన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయి. తెలంగాణలో ఉత్సాహంగా మహానా డు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. మహానాడులో ఆమోదించిన 33% మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాజ్యసభ స్థానాలకు అవకాశం కల్పించాలని పలువురు ఆశావహులు ఆయనను కోరా రు. వర్ల రామయ్య, కంభంపాటి రామ్మో హన్‌రా వు, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.















