చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

సూపర్‌ సిక్స్‌ హామీలకు కట్టుబడి ఉన్నాం!

స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌

by చైతన్యరధం
August 16, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సూపర్‌ సిక్స్‌ హామీలకు కట్టుబడి ఉన్నాం!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలుచేస్తాం
  • అనవసరమైన నిబంధనలతో పథకాలు తొలగించం
  • పెండిరగ్‌ రైల్వే ప్రాజెక్టుల పనులను ప్రారంభిస్తాం
  • గుంటూరులో భూగర్భడ్రైనేజి త్వరలో పూర్తి
  • మంగళగిరి-తాడేపల్లిలోనూ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి
  • మంగళగిరిలో జ్యుయలరీ పార్కు, వీవర్స్‌ క్లస్టర్‌
  • స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్‌

గుంటూరు(చైతన్యరథం): రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వాన ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న ఈ స్వాతంత్య్ర వేడుకల్లో ప్రజలందరి కళ్లల్లో ఆనందం కనబడుతోందని, ఇచ్చిన మాట ప్రకారం సూపర్‌ ` 6 హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేష్‌ స్పష్టం చేశారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం గుంటూరు పోలీసు పెరేడ్‌ గ్రౌండ్స్‌లో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన మంత్రి లోకేష్‌… జిల్లా ప్రజల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా యంత్రాంగం తయారుచేసిన అభివృద్ధి శకటాలను వీక్షించి, ఉత్తమ శకటాలకు అవార్డులు అందజేశారు. ప్రాంగణంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించి, ఉత్తమ స్టాళ్లకు అవార్డులు అందించారు. జిల్లాలో ఉత్తమ సేవలందించిన అధికారులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి లోకేష్‌ మాట్లాడుతూ…

ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు, ప్రజా సంఘాలకు మాట్లాడే స్వేచ్ఛ, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చిందన్నారు. చంద్రబాబు హామీలకు షరతులు ఉండవు. అనవసరమైన నిబంధనలతో సంక్షేమ కార్యక్రమాలు తొలగించం. ఏడాదికి రూ. 250 పెంచడం కాదు… ఒకే సారి వెయ్యి రూపాయిలు పెంచి రూ. 4వేల పెన్షన్‌ అమలు చేస్తున్నాం. మెగా డీఎస్సీ ప్రకటించి 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నాం. తల్లికి వందనం పథకాన్ని అమలుచేస్తాం, ఇంట్లో ఎంత మంది బడికి వెళ్లే పిల్లలు ఉంటే అంతమందికీ ఇస్తాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యం. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కాబోతుంది. పేద వాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఆర్థిక సాయం, ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేల సాయం అందిస్తాం, చేనేత వస్త్రాలకు జీఎస్టీ రద్దుపై కేంద్రంతో చర్చిస్తున్నామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

త్యాగధనుల పుట్టినిల్లు గుంటూరు జిల్లా!
గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాకొద్దీ తెల్లదొరతనం..పాటతో స్వాతంత్య్ర పోరాటంలో కదంతొక్కిన ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ ఈ నేలపైనే జన్మించారు. పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఆందోళనలు చేపట్టారు. క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో తెనాలికి చెందిన ఏడుగురు ప్రాణ త్యాగాలు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం తెలుగునేల ఎన్నో త్యాగాలు చేసింది. స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు, అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశం అంటే భక్తి ఉండాలి. తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉండాలి. ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి. ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు చూసాను. కానీ ఈ రోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తుంటాయి. శాంతి, అహింసే ఆయుధాలుగా మహాత్మా గాంధీ మార్గంలో మనం స్వాతంత్య్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింసే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారని మంత్రి లోకేష్‌ అన్నారు. ఈ

రైతులకు అండగా ప్రజాప్రభుత్వం
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రజాప్రభుత్వం రైతులకు అన్నివిధాలా అండగా నిలుస్తోంది. జిల్లాలో 92,000 హెక్టార్లలో సాగవుతున్న వివిధ పంటలను ఈ-పంట యాప్‌ ద్వారా నమోదు చేశాం. ఇప్పటివరకు 4,488 క్వింటాళ్ళ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,754 టన్నుల ఎరువులు రైతులకు సరఫరా చేస్తున్నాం. భూసార పరీక్షలు జరుగుతున్నాయి. పిఎం కిసాన్‌ పథకం క్రింద 85,400 మంది రైతు కుటుంబాలకు 17వ విడత ఆర్ధిక సహాయం రూ.17 కోట్లు అందించాం. ఈ సీజన్‌ లో జిల్లాలో 29వేల మంది కౌలు రైతులకు సిసిఆర్‌సి కార్డుల ద్వారా 30 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చాం. జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి నిధులిచ్చాం. జిల్లాలోని 10 రైతుబజార్ల ద్వారా ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందిస్తున్నాం. గుంటూరు, తెనాలి, దుగ్గిరాల మార్కెట్‌ యార్డుల్లో ఈ ఏడాది జులై నాటికి 35,186 మంది రైతులకు చెందిన 3,46,017 క్వింటాళ్ళ పంటలను ఈ-నామ్‌ ద్వారా విక్రయించారు. పశు కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం ద్వారా జిల్లాలోని 6,689మంది రైతులకు 20 కోట్లు రుణాలు మంజూరు చేశాం.

7 నియోజకవర్గాల్లో యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నస్టిక్‌ లేబరేటరీల ద్వారా 12,400 పశువులకు పరీక్షలు చేసి తగిన చికిత్స అందించాం. ఖరీఫ్‌ సీజన్లో జిల్లాలోని 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు 24 టిఎంసిల సాగునీరు అందించేలా ప్రణాళికను తయారుచేశాం. గుంటూరు ఛానల్‌ ఆధునీకరణ పనులకు 652 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. జిల్లాలో పెండిరగ్‌ లో ఉన్న 9 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. జిల్లాలో పిఎం మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) కింద సబ్సిడీపై మోపెడ్లు, ఐస్‌ బాక్సులు, త్రీ వీలర్స్‌, ఫోర్‌ వీలర్‌ వాహనాలను అందజేశాం. పౌరసరఫరాల శాఖ ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించి..బియ్యం, కందిపప్పు తక్కువ ధరకే అందిస్తున్నామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

తల్లికి వందనం పథకాన్ని అమలుచేస్తాం
తల్లికి వందనం పథకాన్ని అమలుచేస్తాం. జిల్లాలో 1 నుంచి 10వతరగతి వరకు చదువుతున్న 2,95,542 విద్యార్థులలో అర్హులైన విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా ఒక్కో విద్యార్థికి రూ. 15వేలు ఇస్తాం. ఎపి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విద్యార్థి మిత్ర స్కీమ్‌ లో భాగంగా 99,150మంది విద్యార్ధులకు స్టూడెంట్‌ కిట్స్‌ అందించాం. మన బడి ` భవిష్యత్తులో భాగంగా 562 పాఠశాలల్లో 204 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. 1071 పాఠశాలలలో రోజుకి సుమారు 73,000 మంది విద్యార్ధులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అందజేస్తున్నాం. జిల్లాలో పిఎం మాతృ వందన యోజన పథకం, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ అప్‌ గ్రేడేషన్‌ చేపట్టాం. ఎన్టీఆర్‌ వైద్యసేవ ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నాం. నాబార్డ్‌ నిధులతో ఆస్పత్రి భవనాల నిర్మాణం సాగుతోంది. గుంటూరు మెడికల్‌ కాలేజిలో 40 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి చేతులు మీదుగా ప్రారంభమైన మంగళగిరి ఎయిమ్స్‌ లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. 1480 అంగన్‌ వాడీ సెంటర్ల ద్వారా చిన్నారులకు, గర్భిణులు, పాలిచ్చే మహిళలకు పోషకాహారం అందిస్తూ, ఆరోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నాం.

ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ను ఒకేసారి రూ. 4వేలకు పెంచాం. దివ్యాంగుల పెన్షన్‌ రూ. 6000లకు పెంచాం. శాశ్వత వైకల్యంతో బాధపడేవారికి రూ. 15వేల పెన్షన్‌ ఇస్తున్నాం. కిడ్నీ బాధితులకు పెన్షన్‌ రూ.10వేలకి పెంచి ఇంటి వద్దే అందిస్తున్నాం. జిల్లాలో ఈ నెల 1వ తేదిన 2,60,192 మంది పింఛనుదారులకు 110 కోట్ల 69 లక్షలరూపాయలను 4,840 మంది సచివాలయ,ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దనే పంపిణీ చేశామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

ఉపాధి హామీ పథకంలో 29లక్షల పనిదినాలు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంలో ఈ సంవత్సరం 29 లక్షల పనిదినాలు కల్పించడం లక్ష్యంగా నిర్దేశించుకుని, ఇప్పటికే 20.85 లక్షల పనిదినాలు కల్పించాం. వేతనదారులు 52 కోట్ల రూపాయల లబ్ధి పొందారు. జిల్లాలో ఆసియన్‌ బ్యాంకు నిధులు, పిఎంజిఎస్‌వై-3, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, నాబార్డ్‌ గ్రాంటు క్రింద 115 కోట్ల రూపాయల అంచనా విలువతో 378 కి.మీ.ల రహదారుల నిర్మాణ పనులు చేపట్టాం. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 2025 నాటికి, జిల్లాలో 454 గ్రామాలకు ఇంటింటి కుళాయి కనెక్షన్లు అందించేందుకు 194.28 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. జిల్లాలో అదనంగా 94 చెత్తనుంచి సంపద సృష్టించే కేంద్రాలను నిర్వహణలోనికి తీసుకు వస్తాం. జిల్లాలో 248 కోట్ల రూపాయల అంచనాతో 232 కి.మీ.ల రహదారులు అభివృద్ధి చేస్తున్నాం. జిల్లాలోని 14 ప్రాంతాల్లో గురువారం నుండి అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో నీటికొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 903 కోట్ల రూపాయలతో చేపట్టిన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి స్కీమ్‌ పనులు త్వరలో పూర్తిచేస్తాం. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అండర్‌ గ్రౌండ్స్‌ డ్రైనేజి స్కీమ్‌ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం.

గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలోని సుమారు 20వేల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా ఒకే విడత 9 గంటల పగటి పూట నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం. జిల్లాలో 75,228 మంది ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 40 కోట్ల రూపాయలతో జగజ్జీవన్‌ జ్యోతి పధకం ద్వారా ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని మంత్రి లోకేష్‌ చెప్పారు.

మంగళగిరిలో జ్యుయలరీ పార్కు ఏర్పాటు చేస్తాం
మంగళగిరిలో జెమ్స్‌, జ్యుయలరీ పార్కు, వీవర్స్‌ ఫౌండేషన్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తాం. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు 320 ఎంఎస్‌ఎంఇల ద్వారా 34 కోట్లరూపాయల పెట్టుబడితో 725 మందికి ఉపాధి కల్పించాం. ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పాలసీ కింద ఇప్పటివరకు 263 యూనిట్లకు 197 లక్షల రూపాయలు వివిధ రాయితీలు ఇచ్చాం. పిఎంఇజిపి కింద 41యూనిట్లకు 318 లక్షల మార్జిన్‌మనీ సబ్సిడీ ఇచ్చాం. తెనాలిలో దాల్‌ మిల్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రధానమంత్రి చేనేత ముద్రా యోజన క్రింద ఈ ఆర్థిక సంవత్సరములో 110 మంది లబ్ధిదారులకు 1.07 కోట్లరూపాయల రుణం మంజూరైంది. చేనేత రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా నైపుణ్యగణన చేపడుతున్నాం. జిల్లాలోని ఎంబిటిఎస్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కాలేజిలో స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకొచ్చాం. ఉచిత ఇసుక విధానాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతాం. బలహీన వర్గాల వారిని పేదరికం నుండి బయటకు తీసుకురావడానికి అనేక ప్రణాళికలు అమలు చేస్తున్నాం. 2024 కేంద్ర వార్షిక బడ్జెట్‌ లో రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. సిఆర్‌డిఎ పర్యవేక్షణలో రాజధాని నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాం. నల్లపాడు-బీబీనగర్‌ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ను, అమరావతి మీదుగా ఎర్రుపాలెం, నంబూరు స్టేషన్‌ల మధ్య కొత్తగా నిర్మించే రైల్వే బ్రాడ్‌ గేజ్‌ లైనుని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల కోసం భూ సేకరణ పూర్తి చేసి, పనులు ప్రారంభించానికి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్‌ తెలిపారు.

వికసిత్‌ ఆంధ్ర కోసం ప్రణాళికాబద్ధంగా కృషి
ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్‌ భారత్‌ 2047 స్పూర్తితో వికసిత్‌ ఆంధ్ర 2047 లక్ష్య సాధనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాం. డిస్ట్రిక్ట్‌ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేసి అక్టోబర్‌ 2వ తేదీన ఆవిష్కరిస్తాం. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి, డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ప్రణాళికతో కఠినమైన చర్యలు తీసుకున్నాం. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు సహకారం అందిస్తున్న ప్రజా ప్రతినిధులకు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అమరులైన స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలకు, జిల్లాను ప్రగతి పధంలో నడిపిస్తున్న జిల్లా కలెక్టరు, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమిస్తున్న ఎస్పీ, సత్వర న్యాయ సేవలందిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయాధిపతులు, వారి యంత్రాంగానికి నా ప్రత్యేక అభినందనలు. జిల్లా అభివృద్దికి సహకరిస్తున్న అధికారులు, అనధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకర్లకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేష్‌, జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్య్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.

మువ్వన్నెల పతాకంలా కలిసి మెలిసి ఉందాం
అమరావతి: అంతకుముందు ఎక్స్‌ వేదికగా ప్రజలకు లోకేష్‌ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఆనందాలు నిండుగా సాగే జెండా పండగ మన దేశ సమత, మమతలకు నిదర్శనం. సమరయోధుల త్యాగ ఫలం మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమాలకు పాటుపడి స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుదాం. శాంతి, సామరస్యాలతో మెలుగుతూ మువ్వన్నెల పతాకంలా కలిసి మెలిసి ఉందామని లోకేష్‌ పిలుపు ఇచ్చారు.

Previous Post

పేదవాడు ఆకలితో ఉండకూడదు

Next Post

భూ రికార్డులు సరిచేస్తాం

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

November 8, 2026
చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

November 7, 2026
చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం
ఆంధ్రప్రదేశ్

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

November 7, 2026
బోటు మునిగి తమిళ జాలర్లు మృతి
ఆంధ్రప్రదేశ్

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

November 7, 2026
చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం
ఆంధ్రప్రదేశ్

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

November 7, 2026
ప్రతి అడుగులోనూ భరోసా!
ఆంధ్రప్రదేశ్

ప్రతి అడుగులోనూ భరోసా!

November 7, 2026
Next Post
భూ రికార్డులు సరిచేస్తాం

భూ రికార్డులు సరిచేస్తాం

ముఖ్య వార్తలు

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

చివరి బాధితుడికీ సాయం అందేలా చూస్తాం

by చైతన్యరధం
November 7, 2026

అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన పొలం గట్లు, పంట బోదెలపై వెళ్తూ దెబ్బతిన్న పంటల పరిశీలన జిల్లెళ్లమూడి...

ప్రతి అడుగులోనూ భరోసా!

ప్రతి అడుగులోనూ భరోసా!

by చైతన్యరధం
November 7, 2026

రైతు కష్టం తెలిసిన నాయకుడిగా... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన అటు సమీక్షలు, ఇటు పర్యటనలతో నిరంతరం సమన్వయం అమరావతి (చైతన్యరథం): సచివాలయంలో సమీక్షలే...

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

వాగులు, వంకలు పొంగుతున్నాయి..అప్రమత్తంగా ఉండండి

by చైతన్యరధం
November 5, 2026

లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి ముంపు ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టండి అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం అమరావతి (చైతన్యరథం): ఏలూరు జిల్లాలో...

మున్సిపోల్స్ లో  కూటమికే పట్టం

మున్సిపోల్స్ లో కూటమికే పట్టం

by చైతన్యరధం
November 4, 2026

కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూటమి అభ్యర్థుల విజయకేతనం సంబరాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు అమరావతి (చైతన్యరథం): పురపాలక సంస్థల ఎన్నికల ఫలితాలు కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న అచంచలమైన...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 08-11-2026

by కార్యకర్త
November 8, 2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 07-11-2026

by కార్యకర్త
November 7, 2026

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

చెప్పిన అబద్ధమే వంద సార్లు.. అదే జగన్ నైజం

by చైతన్యరధం
November 7, 2026

2019లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదు ఉద్యోగులకు కనీసం ఒక్క డీఏ కూడా ఇవ్వకుండా రివర్స్ పీఆర్సీతో దగా చేసిన ఘనుడు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే...

బోటు మునిగి తమిళ జాలర్లు మృతి

వారం వ్యవధిలోనే రెండు తుఫాన్లతో తీవ్రంగా నష్టపోయాం

by చైతన్యరధం
November 7, 2026

ఉపశమనం కోసం తక్షణ సాయం అందించండి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సీఎం చంద్రబాబు లేఖ అమరావతి (చైతన్యరథం): వరుస తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.