- సీనియర్లను గౌరవం..కొత్త వారికి అవకాశం
- ఎంపికైన వారికి చంద్రబాబు శుభాకాంక్షలు
అమరావతి(చైతన్యరథం): పొందిన నేతలకు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లను గౌరవిం చుకుంటూ..కొత్త వారికి అవకాశం కల్పిస్తూ..సామాజిక న్యాయం పాటిస్తూ పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ఏర్పాటు చేశాం. పార్టీతో అనుబంధం, కష్టపడే తత్వం, యువరక్తం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ కమిటీలను నియమిం చాం. నిరంతరం రాష్ట్రాభివృద్ధిని కాంక్షించే పార్టీగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ఈ కొత్త కమిటీ లు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆశిస్తున్నాను. తెలు గుదేశం పార్టీలో పని చేయడమంటే.. రాష్ట్రాభి వృద్ధికి పని చేయ డమే అనే గొప్ప సంకల్పంతో మీకు ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
















