- పీపీపీ మెడికల్ కాలేజీలు వేగవంతం కావాలి
- మొదటి దశ, రెండో దశలో 10 పూర్తికావాలి
- త్వరలో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ
- రాష్ట్రమంతటా శరవేగంగా సంజీవని ప్రాజెక్టు
- సంజీవని సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశం
- అమరావతిలో నేచురోపతి సంస్థ కోసం
- కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయం
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మిం చ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెలరోజుల్లో ప్రారంభిం చేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయం లో బుధవారం సంజీవని ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వ హించారు. ముందుగా ఫేజ్ 1లోని నాలుగు మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని పనులు మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్ 2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడిక ల్ కాలేజీల నిర్మా ణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకురావాలని నిర్దేశించారు. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పటల్స్, మెడ్‌టెక్ ఉత్పాద నలు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్‌నెస్ ఫెసిలిటీస్ అందించడం, స్కిల్లింగ్, అమరావతి-వీఈఆర్ లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అమరావతిలో నేచరోపతి సంస్థ కేంద్ర నెలకొల్పేలా ఆయుష్ శాఖ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.
సంజీవని ప్రాజెక్టు ద్వారా లక్ష మందికి పైగా సేవలు
ప్రజలకు వైద్య ఖర్చులు భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజెన్ హెల్త్ స్క్రీనింగ్‌పై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ఇందుకోసం పబ్లిక్ హెల్త్ డేటాను వినియో గించుకోవాలన్నరు. సంజీవని ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 1.08 లక్షల మందికి వైద్య సేవలు పొందారని, 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేయగా, 19 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చా రు. సంజీవని ప్రాజెక్టు వేగంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేం దుకు ప్రణాళికలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ సేవలు డిజిటలైజ్ చేసినా క్షేత్రస్థాయిలో సిబ్బంది ఆశించిన స్థాయి లో పనిచేయకుంటే ఫలితాలు రావని తెలిపారు. దీనిపై అధికారు లు దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజారోగ్య రక్షణకు సంబం ధించి ప్రచారం జరగడం లేదని.. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్య సమస్యలు తగ్గించుకునేందుకు అవకాశం కలుగు తుందని స్పష్టం చేశారు. అనీమియా, డయాబెటిస్ వంటి వ్యాధు లు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ, ఆర్థిక, స్వర్ణ గ్రామ- స్వర్ణ వార్డు శాఖ, కార్మిక, మహిళా శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.















