- కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ నిర్ణయం
- ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గుర్తింపు
- ‘స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన’కు ఆమోదం
- మారనున్న విశాఖ ఐటీఐల రూపురేఖలు
- విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ
అమరావతి(చైతన్యరథáం): దేశంలోనే తొలిసారిగా పీఎం సేతు(Pవీ-SజుTU పథకం అమలు చేయనున్న రాష్ట్రంగా ఏపీ నిలి చింది. ఆ ఘనత లభించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అరుదైన గుర్తింపు సాధించింది. ఈ మేరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్‌కు సంబంధించిన ‘స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన’కు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో విశాఖ ఐటీఐల రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రముఖ ఉక్కు దిగ్గజం ఆర్సెలార్ మిట్టల్ భాగస్వామ్యంతో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. జాతీయ స్థాయిలో రూ.60,000 కోట్ల బడ్జెట్‌తో చేపడుతున్న ఈ కార్యక్ర మంలో మొదటి దశలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజ వేసింది. విశాఖ ఐటీఐల అభివృద్ధికి అకడమిక్ భాగస్వామిగా నామ్‌టెక్ సంస్థ కూడా రంగంలోకి దిగింది. ఈ ప్రాజెక్టులో ‘హబ్ అండ్ స్పోక’ మోడల్‌ను అమలు చేయనున్నారు.
అంతర్జాతీయ ప్రమాణా లకు అనుగుణంగా ఐటీఐ విద్యార్థులకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. కోర్సు పూర్తి చేసిన వెంటనే విద్యార్థులకు నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే Pవీ-SజుTU లక్ష్యంగా కేంద్రం పేర్కొంది. ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనలో భాగంగా ప్రభుత్వ ఐటీఐలను బలోపేతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ బాటలోనే నడ వడానికి మరో 12 రాష్ట్రాలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పరిశ్రమల భాగస్వామ్యానికి వేగంగా టెండర్ ప్రక్రియ కొనసాగు తోందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.














