- అనంతరం పోలవరం ప్రాజెక్టు పరిశీలన
అమరావతి(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవా రం ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు జీవనాడి ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభించనున్నారు. బ్యారేజీకు ఉన్న 117 గేట్లను మార్చాల్సి రావడంతో వాటి స్థానాల్లో కొత్తవి ఏర్పాటు చేసేందుకు గేట్లను అమర్చే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. కొత్త గేట్ల అమరికకు ప్రభుత్వం రూ.152.95 కోట్లు ఖర్చు చేయనుంది. పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 10.25 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు వేమగిరి గ్రామానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ వద్దకు చేరుకుంటారు. 11.25 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నూతన గేట్ల ఏర్పాటు పనులను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఆత్రేయపురం మండలం పిచ్చుకులంక గ్రామానికి 11.45 గంటలకు చేరుకుని రైతులతో సమావేశ మవుతారు. సుమారు గంట పాటు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు. ఈసీఆర్ఎఫ్ గ్యాప్ 2 పనులు, పవర్ హౌస్ నిర్మా ణాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహిస్తా రు. సాయంత్రం 5.20 గంటలకు పోలవరం ప్రాజెక్టు సందర్శన ముగించుకుని అమరావతికి చేరుకుంటారు.
















