- సంక్షోభ నిర్వహణ వ్యవస్థపై అధ్యయనం
- మారో ఆర్కిటెక్ట్స’ ప్రతినిధులతో సమావేశం
సింగపూర్/ అమరావతి(చైతన్యరథం): పట్టణ ప్రణాళిక, సుస్థిర అభివృద్ధిపై అధ్యయనం కోసం సింగపూర్‌లో మంత్రుల పర్యటన శనివారం కూడా కొనసాగింది. ముందుగా సింగపూర్‌లో ప్రముఖ అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మారో ఆర్కిటెక్ట్స’ను సందర్శించా రు. మారో ఆర్కిటెక్ట’ ప్రతినిధులతో సమావేశమై అత్యాధునిక నగర నిర్మాణ నమూనాలు, స్మార్ట్ సిటీలపై చర్చించారు. ఏఐ అండ్ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా స్మార్ట్ సిటీల కోసం ప్రణాళికలు రూపొందించే మారో ఇంటెలిజెన్స్‌ను పరిశీలించారు. సింగపూర్ అనుసరిస్తున్న “సినా రియో ప్లానింగ” (పట్టణ ప్రణాళికలో భవిష్యత్తు అవసరాలను ముందే ఊహించి సన్నద్ధం కావడం), అర్బన్ డిప్లొమసీ (ప్రపంచం లోని ప్రధాన నగరాలు తన ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రయోజనాల కోసం అంతర్జాతీయ స్థాయిలో ఇతర నగరాలు లేదా సంస్థలతో కలిసి పనిచేయడం) వంటి సింగపూర్ అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, బి.సి.జనార్దన్‌రెడ్డి, వంగలపూడి అనిత, సత్యకు మార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు.
కొనసాగుతున్న మంత్రుల శిక్షణ
సింగపూర్ సంక్షోభ నిర్వహణ వ్యవస్థ గురించి మంత్రులు బృందానికి శిక్షణ కొనసాగింది. విపత్తు వేళలో సింగపూర్‌లో ప్రభుత్వ శాఖలు ఏకతాటిపైకి వచ్చి సమన్వయంతో పనిచేసే ‘హోల్-ఆఫ్-గవర్నమెంట’ విధానం గురించి వివరించిన ఎస్‌యÖఎసఎస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రజ్వానా వివరించారు. సంక్షోభంలో నాయకత్వం, నైతిక నిర్ణయాలు ప్రాధాన్యత, రాబోయే ప్రమాదాలను ముందే ఊహించి సిద్ధంగా ఉండటం వంటి అంశా లపై శిక్షణలో తెలిపారు.















