చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

‘కలలకు రెక్కలు’ తొడుగుతా

మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌-3.0లో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Dec 6, 2025 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
‘కలలకు రెక్కలు’ తొడుగుతా
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వినూత్న పథకంతో విదేశీ విద్యకు సహకారం
  • పావలా వడ్డీకే విదేశీ విద్య రుణాలు
  • త్వరలో స్డూడెంట్స్‌ ఇన్నోవేటర్స్‌ పార్టనర్షిప్‌ సమ్మిట్‌
  • మూడేళ్లల్లో ఏపీ విద్యా విధానానికి దేశంలోనే గుర్తింపు దక్కాలి
  • పిల్లల్లో నైపుణ్యాలను గుర్తించాలి…
  • మట్టిలో మాణిక్యాలను వెలికితీసే బాధ్యత మనదే
  • ప్రయివేట్‌ కంటే ప్రభుత్వ స్కూళ్లల్లోని టీచర్లే బెస్ట్‌
  • విద్యాశాఖను సమర్థంగా నిర్వహిస్తోన్న లోకేష్‌కు అభినందనలు
  • మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌-3.0లో సీఎం చంద్రబాబు
  • భామిని ఏపీ మోడల్‌ స్కూల్‌ను పరిశీలించి.. విద్యార్థులతో ముచ్చట్లు

పార్వతిపురం (చైతన్య రథం): విద్యార్థుల ఉన్నత విద్యకు, విదేశీ విద్యకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికోసం ‘కలలకు రెక్కలు’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. విదేశీ విద్య కోసం ఎంత ఖర్చవుతుందో అంతమేర పావలా వడ్డీకే రుణం ఇప్పిస్తామని సీఎం ప్రకటించారు. ఉన్నత, విదేశీ విద్య అభ్యసించాలనే కోరికలు, ఆశలను విద్యార్థులు చంపుకోవాల్సిన అవసరం లేదన్నారు. మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌-3.0 కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. ఈ జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం భామిని గ్రామంలో ఏపీ మోడల్‌ హైస్కూల్లో జరిగిన పీటీఎం 3.0లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేరెంట్‌, టీచర్‌, విద్యార్థులతో సీఎం మాట్లాడారు. మోడల్‌ స్కూల్లో ఏర్పాటు చేసిన వివిధ ల్యాబ్స్‌ను పరిశీలించారు. అలాగే క్లిక్కర్‌ టూల్‌ ద్వారా విద్యార్థులకు ఎలాంటి బోధన చేస్తున్నారనే అంశాన్ని స్వయంగా పిల్లలతో కలిసి కూర్చుని చూశారు. ఈ సందర్భంగా భామిని ఏపీ మోడల్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ‘‘రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో ఎవ్వరూ ఊహించని ఫలితాలు వస్తాయి. దీనికి అందరూ సహకరించాలి. మూడేళ్లలో దేశంలోనే నెంబర్‌ వన్‌ చేసేలా ఆంధ్రా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ తెస్తానని మంత్రి లోకేష్‌ చెప్పారు. పిల్లలను సానబెడితే అద్భుతాలు సాధిస్తారు. విద్యలో పిల్లల బలాబలాలు తెలుసుకునేందుకు… దానికి అనుగుణంగా విశ్లేషించుకుని స్కై, మౌంటెన్‌, స్టీమ్‌ అనే మూడు రకాలుగా వర్గీకరించారు. క్లిక్కర్‌ అనే విధానం పిల్లలను మరింత ఆసక్తిగా చదువుకునేలా చేస్తోంది. నేను అనుకున్నదానికంటే విద్యా విధానం మెరుగ్గా ఉంది. పిల్లలు కూడా వాటిని అందిపుచ్చుకుంటున్నారు. పరీక్షలు జరిగిన తర్వాత సమర్ధత తెలుసుకోవడం కాకుండా… ఎప్పటికప్పుడు పిల్లల చదువును విశ్లేషించేలా క్లిక్కర్‌ బాగా పనిచేస్తోంది. పిల్లలు మట్టిలో మాణిక్యాలు… సరైన గైడెన్స్‌ ఉంటే ఏదైనా సాధించగలరు. అంధ క్రికెట్‌ క్రీడాకారిణి కరుణకుమారి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని అంధ మహిళల క్రికెట్‌ ప్రపంచ కప్‌ను సాధించింది. విద్యా విధానానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. నిరంతరం ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటోంది. అందుకే మెగా పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టాం. అంతే కాకుండా… ఈ తరహా సమావేశాల్లో అందరూ పాల్గొంటున్నాం. పల్నాడులో మెగా పీటీఎంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. అలాగే ప్రజా ప్రతినిధిలందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కష్టంగా కాదు… ఇష్టంగా చదవండి
‘ఒకప్పుడు పిల్లలు భారం అనుకునేవారు. కానీ ఇప్పుడు పిల్లలే ఆస్తి. పిల్లలే శ్రీరామ రక్ష. పిల్లలే భవిష్యత్‌. మధ్యాహ్న భోజనం నుంచి స్టూడెంట్‌ కిట్స్‌ వరకు నాణ్యత పెంచాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా, నాణ్యతతో అందిస్తున్నాం. స్టూడెంట్‌ కిట్లపై పార్టీ రంగులు, చిహ్నాలు, ఫొటోలు లేకుండా అందిస్తున్నాం. విలువలతో కూడిన సమాజాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో పని చేస్తున్నాం. దానికి సహకరించాలని చాగంటి కోటేశ్వరరావును కోరాం చాగంటి ప్రవచనాల ద్వారా విలువలను విద్యార్థులు చక్కగా అర్థం చేసుకుంటున్నారు. గతంలో టీచర్లకు చాలా యాప్‌ లు ఉండేవి. ఇప్పుడు అలాంటి ఇబ్బందులను తొలగించాం. శనివారం నో బ్యాగ్‌ డే… ఆడుతూ పాడుతూ విద్యార్ధులకు నచ్చిన పని చేస్తున్నారు. 24 గంటలు రుద్దితే చదువు అబ్బదు.. ఇష్టంతో తక్కువ సమయం చదివినా రాణిస్తారు. చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో ప్రతిభా అవార్డులు ఇస్తున్నాం. విద్యలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు క్లస్టర్‌ అప్రోచ్‌ ద్వారా ప్రయత్నిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న బెస్ట్‌ లెర్నింగ్‌ విధానాలు అధ్యయనం చేస్తున్నాం. విదేశాలకు వెళ్లి టీచర్లు అధ్యయనం చేస్తున్నారు. టీచర్లను రిక్రూట్‌ చేయకుండా చదువు చెబితే అది బూటకమే అవుతుంది. ప్రభుత్వ టీచర్లను నియమించాం… చక్కటి చదువు చెప్పిస్తున్నాం. మెగా డీఎస్సీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ దాన్ని సమర్ధంగా ఎదుర్కొని ఏడాదిలోనే ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేశాం. ట్రాన్సఫర్లను పారదర్శకంగా నిర్వహించాం. పిల్లలకు అవసరమైన విద్యను అందిస్తాం… దాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. అలాగే సామాజిక బాధ్యతగా డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టే బాధ్యత విద్యార్థులకూ ఉంది’’ అని సీఎం ఉద్భోదించారు.

సంబంధితవార్తలు

సిరిపురం సర్కిల్‌లో దివంగత సీఎం కొణిజేటి రోశయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్.

విశాఖలో ఏఐజీ హాస్పిటల్స్‌కు భూమిపూజ, శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.

యర్రగొండపాలెం నియోజకవర్గం గంటవానిపల్లి సమీపంలో వెలిగొండ ఫీడర్ కెనాల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు.

విద్యార్థులు… వినూత్న ఆలోచనలు
‘‘ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టీచరుకు 18మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. కానీ ప్రైవేట్‌ స్కూళ్లలో ఒక టీచరుకు 25 మంది పిల్లలు ఉన్నారు. అంటే ప్రభుత్వ స్కూళ్లే బెటర్‌ అని అర్థమవుతుంది. స్కూళ్లకు ఇంత మంది టీచర్లను రిక్రూట్‌ చేశాం… ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని అందరూ కోరుకునే పరిస్థితి రావాలి. గతంలో టీచర్లను అవమానించారు… మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు. టీచర్లను గౌరవించే బాధ్యత మాది… పిల్లలను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత టీచర్లది. ఏపీ విద్యా రంగాన్ని దేశంలో నెంబర్‌ 1 చేయాలి. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను అస్తవ్యస్థం చేసింది… మేం సరి చేస్తున్నాం. విద్యార్ధులతో మాక్‌ అసెంబ్లీ నిర్వహించాం… పిల్లలు అదరగొట్టారు. వచ్చే ఏడాది జనవరిలో స్టూడెంట్స్‌ ఇన్నోవేటర్స్‌ పార్టనర్షిప్‌ సమ్మిట్‌ నిర్వహించాలని భావిస్తున్నాం. ఏడో తరగతి నుంచి వినూత్నంగా ఆలోచించాలి. గ్రూప్‌ గా… వ్యక్తిగతంగా ఇన్నోవేషన్స్‌ చేసేలా ఆలోచన చేయాలి. ఇన్నోవేటివ్‌ గా ఆలోచించే వారిని జిల్లాల స్థాయిలో గుర్తిస్తాం. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగే ఇన్నోవేటర్స్‌ పార్టనర్‌ షిప్‌ సదస్సులో పాల్గొనే అవకాశం కల్పిస్తాం. ఆ సదస్సుకు వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తాం. పిల్లల ఆలోచనలు బాగుంటే వారి ప్రతిభను గుర్తించి రివార్డులు అందిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లోనూ సోలార్‌ ప్యానెళ్లు పెట్టుకుని విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.

ఏపీలోని విద్యార్థుల బాధ్యత విద్యా మంత్రిదే
‘‘మంత్రి లోకేష్‌ చదువుకునే రోజుల్లో ఎలా చదువుతున్నారనే విషయన్ని తెలుసుకునేందుకు నేను ఎప్పుడూ స్కూలుకు వెళ్లలేదు… లోకేష్‌కు చదువు చెప్పే టీచర్లతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అంతా లోకేష్‌ తల్లి భువనేశ్వరీనే చూసుకునేవారు. కొన్ని అంశాల్లో లోకేష్‌కు ఫౌండేషన్‌ కోర్సుల్లో శిక్షణ ఇప్పించాం. తర్వాత చక్కగా చదువుకున్నారు. ఇప్పుడు మంత్రి అయ్యారు. రాజకీయాల్లోకి రమ్మని లోకేష్‌ను నేను ఫోర్స్‌ చేయలేదు. వ్యాపారంమీద ఇంట్రెస్ట్‌ ఉంటే వ్యాపారమే చేసుకోవాలని కూడా సూచించాను. కానీ లోకేష్‌ రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చారు. విద్యా శాఖ చాలాకష్టంగా ఉంటుందని చెప్పినా… విద్యా విధానాన్ని తీర్చిదిద్దేలా పని చేస్తానని లోకేష్‌ చెప్పారు. దానికి అనుగుణంగానే విద్యాశాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు మంత్రి లోకేష్‌ను అభినందిస్తున్నా. భువనేశ్వరి లోకేష్‌ను స్టాన్‌ఫోర్డ్‌ వరకు తీసుకెళ్లారు. ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులను కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత విద్యా మంత్రి లోకేష్‌దే’’ అని ముఖ్యమంత్రి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అమలు అవుతున్న ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ పాటించాలని ముఖ్యమంత్రి సూచించారు. సభ అనంతరం విద్యార్థులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌ మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో మంత్రి లోకేష్‌, ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సహా విద్యా శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 5-12-2025

Next Post

అద్భుతం.. ఉద్భవ్‌-2025

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 31-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 31-08-2026

కార్యకర్త
@ August 31, 2026
కరువు నేలకు కృష్ణమ్మ జలాలు
ఆంధ్రప్రదేశ్

కరువు నేలకు కృష్ణమ్మ జలాలు

చైతన్యరధం
@ August 31, 2026
ఆంధ్రప్రదేశ్

నేడు వెలిగొండ పండుగ

చైతన్యరధం
@ August 31, 2026
చైతన్యరధం ఈ పేపర్ 30-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 30-08-2026

కార్యకర్త
@ August 30, 2026
చైతన్యరధం ఈ పేపర్ 29-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 29-08-2026

కార్యకర్త
@ August 29, 2026
పనితీరుకు ప్రామాణికం.. విజన్ ప్లాన్
ఆంధ్రప్రదేశ్

పనితీరుకు ప్రామాణికం.. విజన్ ప్లాన్

చైతన్యరధం
@ August 29, 2026
డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!
ఆంధ్రప్రదేశ్

డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

చైతన్యరధం
@ August 29, 2026
ఒంగోలు నగరానికి నిరంతర తాగునీటి సరఫరా దిశగా కీలక అడుగు
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు నగరానికి నిరంతర తాగునీటి సరఫరా దిశగా కీలక అడుగు

చైతన్యరధం
@ August 29, 2026
Load More

ముఖ్య వార్తలు

నేడు వెలిగొండ పండుగ

చైతన్యరధం
@ August 31, 2026
డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

చైతన్యరధం
@ August 29, 2026
కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు

కరవు నేలపై కృష్ణమ్మ పరవళ్లు

చైతన్యరధం
@ August 29, 2026

రాజధాని గ్రామాల్లో మౌలికవసతులు

చైతన్యరధం
@ August 28, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

కరువు నేలకు కృష్ణమ్మ జలాలు

కరువు నేలకు కృష్ణమ్మ జలాలు

చైతన్యరధం
@ August 31, 2026

నేడు వెలిగొండ పండుగ

చైతన్యరధం
@ August 31, 2026
పనితీరుకు ప్రామాణికం.. విజన్ ప్లాన్

పనితీరుకు ప్రామాణికం.. విజన్ ప్లాన్

చైతన్యరధం
@ August 29, 2026
డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

డేట్ టైమ్ ప్లేస్ ఫిక్స్ చెయ్ జగన్.. చర్చకు మళ్లీ సవాల్ చేస్తున్నా!

చైతన్యరధం
@ August 29, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist