Telugu Desam

చంద్రన్న పాలనలో మహిళా సంక్షేమం:

ఆవిర్భావం నుంచి మహిళా సాధికారత, స్త్రీ సంక్షేమం గురించి కృషి చేస్తోంది తెలుగుదేశం పార్టీ. ఆడపిల్లలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పిస్తూ తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళా సమానత్వానికి నాంది పలికారు. అలాగే ఎన్టీఆర్ తొలిసారిగా మహిళలకు 33 అసెంబ్లీ సీట్లు, 5 మంత్రి పదవులు ఇచ్చి రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచితే... నారా చంద్రబాబు నాయుడు శాసనసభకు తొలి మహిళా స్పీకరును అందించారు. ఎన్టీఆర్ మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పితే... తొలిసారిగా మహిళల కోసం 'రాష్ట్ర మహిళా కమిషన్' ను ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...

నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా సాధికారతతో ఇంటింటినీ, గ్రామగ్రామాన్నీ ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు ఆయన ఏర్పాటుచేయించిన ‘డ్వాక్రా’ సంఘాలు తెలుగునాట ఊరూరా ఓ విప్లవాన్ని తీసుకువచ్చాయి. పొదుపు ఉద్యమంలో మహిళలను ప్రధాన భాగస్వాములుగా తీర్చిదిద్ది నాడు 4.73 లక్షల స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేయించారు చంద్రబాబు. ఈ గ్రూపుల్లో ఆనాడే 65.11 లక్షల మంది సభ్యులు ఉండేవారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సభ్యుల్లో సగానికి సమానం. అంటే డ్వాక్రా సంఘాలు ఏ స్థాయిలో విజయవంతం అయ్యాయో చూడండి. వీరి కోసం మండల స్థాయిలో 350 మహిళా బ్యాంకులు పనిచేసేవి.
'లింగ వివక్ష లేని సామాజిక న్యాయం' నినాదంతో 1997 సంవత్సరాన్ని 'మహిళాభివృద్ది ప్రత్యేక సంవత్సరం'గా ప్రకటించి పలు కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు. ప్రభుత్వ శాఖలన్నింటా అభివృద్ధి కోసం చేసే ఖర్చులో మూడవ వంతు మహిళల కోసం ఖర్చు చేయాలన్న నిబంధన పెట్టారంటే మహిళాభ్యుదయం పట్ల చంద్రబాబుకు ఎంతటి నిబద్ధత ఉండేదో అర్థం చేసుకోవచ్చు. విద్య, ఉపాధి రంగాలలో మహిళలకు 33.33 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు చంద్రబాబు. అదే సమయంలో డీఎస్సీ వంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను చేపట్టడంతో మహిళలకు విరివిగా ఉద్యోగాలు వచ్చాయి. ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రతి పది మంది మహిళా టీచర్లలో ఆరుగురు నాడు చంద్రబాబు హయాంలో ఎంపికైనవారే.
అప్పట్లో కట్టెల పొయ్యి పై వంట చేస్తూ మహిళలు అనేక ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడేవారు. ఆ పరిస్థితి నుండి మహిళలను కాపాడేందుకు 'దీపం' పథకాన్ని ప్రవేశ పెట్టి పేదింటి మహిళలకు ఆ రోజుల్లోనే 32,68,675 గ్యాస్ కనెక్షన్లు ఇప్పించారు చంద్రబాబు.

నవ్యాంధ్రలో...

డ్వాక్రా రుణమాఫీకి హామీ ఇచ్చిన చంద్రబాబు తాను నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే హామీకి కార్యరూపం ఇచ్చారు. రుణమాఫీ ద్వారా కేవలం ఋణం తీసుకున్నవారికి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది కాబట్టి... స్వయం సహాయక బృందాలలోని సభ్యులందరికీ ప్రయోజనం కలిగేలా... 'చేయూత' పేరుతో రూ.8,604.3 కోట్లతో 86,04,304 మంది మహిళా సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.10 వేలు చొప్పున పెట్టుబడి సాయం కింద అందజేశారు. మళ్ళీ రెండో విడత కింద 'పసుపు-కుంకుమ' పేరుతో రూ.9,794.20 కోట్లతో 97,94,202 మంది ఆడపడుచులకు మళ్ళీ రూ.10 వేలు ఇచ్చారు. ఈ రకంగా ఒక్కో డ్వాక్రా సభ్యురాలికి మొత్తం రూ.20 వేల రూపాయలను అందించి మహిళల జీవితాల్లో ఆర్థిక వెలుగులు నింపారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ మహిళ సాధికారత సంస్థ ఏర్పాటు చేసి మహిళల అభివృధ్ధికోసం 'స్త్రీనిధి' ఏర్పాటు చేసారు.
మాతాశిశు మరణాలు తగ్గించే దిశగా తల్లీబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు. 'అన్న అమృతహస్తం' ద్వారా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పోషకాహారం అందించారు. గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార బుట్టలను అందజేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్కానింగ్‌ పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. ‘తల్లీబిడ్డ చల్లగా’ పథకంలో నగర ప్రాంతాల్లోని గర్భిణులకు రూ.5500, గ్రామీణ ప్రాంతాల వారికి రూ.6000 ప్రత్యేకంగా అందించారు. ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా చొరవ తీసుకోవడంతో రాష్ట్రంలో ప్రసవ మరణాలు చాలావరకు తగ్గాయి.
ఏజెన్సీలు, మారుమూల గ్రామాల్లో ఉండే బాలింతలు ప్రసవానంతరం బిడ్డను తీసుకుని ఇళ్లకు వెళ్లాలంటే నానా యాతన పడేవారు. ఈ సమస్యను అధిగమించి వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ‘తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌' పేరిట రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో జీపీఎస్‌తో కూడిన 279 వాహనాలను అందుబాటులో ఉంచారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు అనంతరం శిశువుల కోసం రూ.773 విలువైన ఎన్టీఆర్‌ బేబి కిట్‌ అందించారు.
రాష్ట్రంలో పేదల కోసం లక్షల కొద్దీ ఇళ్లను కట్టించి వాటిని మహిళల పేరిట ఇవ్వడం జరిగింది. 35 ఏళ్లు దాటిన మహిళలకు మాస్టర్‌ హెల్త్‌ చెకప్‌ పేరిట 11 రకాల 'ఉచిత వైద్య పరీక్షలు' చేయించారు. అవసరమైన వారికి తదుపరి వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేయించారు.
వివిధ శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవులను 60 రోజులకు పెంచింది చంద్రన్న సర్కారు. వీటికి అదనంగా ఐదు రోజుల స్పెషల్‌ క్యాజువల్‌ లీవులను కూడా ఇచ్చింది.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మందికి నెలకు వెయ్యి రూపాయల 'వితంతు పింఛన్లు' అందజేశారు.
మహిళల్లో విద్యావ్యాప్తికి సరైన రవాణా సౌకర్యం లేని ప్రాంతాలను గుర్తించి... 'బడికొస్తా' పథకం ద్వారా చదువుకుంటున్న పేద బాలికలకు 5.63 లక్షల సైకిళ్లు పంపిణీ చేశారు.
బాలికలు ఎదుర్కుంటున్న సమస్యలకు ముఖ్య కారణం యుక్త వయసులో వచ్చే శారీరక, మానసిక మార్పులపై వారికి సరైన అవగాహన లేకపోవడమే. అందుకోసం
11 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారికి రెసిడెన్షియల్ కాలేజీలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో చదువుతున్న 15.96 లక్షల మంది బాలికలే కాకుండా... బడి బయట ఉన్న 2.60 లక్షల మంది బాలికలకు 'కిశోరి వికాసం' కార్యక్రమం కింద ప్రత్యేక శిక్షణ ఇప్పించింది చంద్రన్న ప్రభుత్వం. సామూహిక శ్రీమంతాలు, అన్న ప్రాసన వంటి కార్యక్రమాలను నిర్వహించి మాతా శిశు సంరక్షణపై అవగాహన కలిగించారు.
సంపద సృష్టిలో మహిళలను భాగస్వాములను చేసేందుకు చంద్రన్న ప్రభుత్వం వారిని వివిధ వృత్తుల వైపు ప్రోత్సహించింది. చిల్లర దుకాణాలు, కుట్టు శిక్షణ, అగరబత్తీలు, పామాయిల్‌ తదితర చిన్నపాటి వ్యాపారాల వైపు నడిపిస్తూనే... ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మలు, మంగళగిరి, ధర్మవరం చీరలు, పూతరేకులు, చెక్క బొమ్మలు, పిల్లల ఆట బొమ్మల తయారీలో భాగస్వాములను చేసింది. 2,66,231 మంది మహిళలు వివిధ ఉత్పత్తుల తయారీలో భాగస్వాములయ్యారు. వీటిలో ప్రాచుర్యం కలిగిన 2,500 ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో పెట్టి అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది
పేద కుటుంబాలలోని ఆడపిల్లల వివాహానికి సాయంగా ఎస్టీలకు 'గిరిపుత్రిక కల్యాణ పథకం' కింద రూ.50వేలు... 'చంద్రన్న పెళ్ళికానుక' కింద ఎస్సీలకు రూ.40వేలు... బీసీలకు రూ.35వేలు... 'దుల్హన్' పథకం కింద ముస్లింలకు రూ.50వేల ఆర్థిక సాయాన్ని అందించారు.
రాష్ట్రవ్యాపంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో బోధకుల వేతనాన్ని రూ.7,500 నుంచి రూ.10,500కు, ఆయాల వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.6 వేలకు పెంచి వారిలో మరింత సామాజిక సేవా స్ఫూర్తిని రగిలించారు. అలాగే ఆశా వర్కర్ల వేతనాన్ని రూ.1,200 నుంచి రూ.3 వేలకు పెంచారు.
మహిళా సాధికారత కోసం భారతదేశంలోనే మొదటిసారిగా మహిళా పార్లమెంటు సదస్సు నిర్వహించిన ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఒకప్పుడు ఇంటికీ, వంటింటికే పరిమితమైన తెలుగు మహిళను ప్రగతి బాట పట్టించి.. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములను చేయడమే కాకుండా... మహిళల ఆత్మగౌరవానికి, మహిళల సంక్షేమానికి కూడా ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిన నేత నారా చంద్రబాబు నాయుడు.

అగ్ర వార్తలు

అత్యధికంగా వీక్షించినవి

తాజా సంఘటనలు

రాయలసీమ

ఆంధ్ర

తెలంగాణ

తెలుగుదేశంలో చేరండి

70 లక్షల కుటుంబంలో సభ్యులు కండి

Currently Playing

వితరణ

దానం చేయండి

వ్యక్తిగత వివరాలు :

  శ్రీ / శ్రీమతి

  పూర్తి పేరు

  ఫోను నంబరు

  ఇమెయిల్ ఐడి

  ఆఫ్‌లైన్ అప్లికేషన్ కోసం ఇ-ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేయండి

  Welcome Back!

  Login to your account below

  Create New Account!

  Fill the forms below to register

  *By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

  Retrieve your password

  Please enter your username or email address to reset your password.

  Add New Playlist