- ప్రతి మూడో శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర
- మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం(చైతన్యరథం): మన పరిసరాలను కాపా డుకునే బాధ్యత మనందరిదని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఇంధన పొదుపు కార్యక్రమంలో భాగంగా జగన్నాథపురంలోని తన నివాసం నుంచి ఎలక్ట్రిక్ సైకిల్‌పై పలు ప్రాంతాల్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పర్యటించారు. రైతుబజార్ వద్ద వినియోగదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకు న్నారు. మార్కెట్‌లో వ్యాపారుల నుంచి కూరగాయలు కొనుగోలు చేశారు. వారితో కాసేపు సరదాగా మాట్లాడారు. మార్కెట్లో ప్లాస్టిక్ బ్యాగుల నిషేధానికి సహకరించాలని సూచించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులతో మాట్లాడారు. ప్రతిఒక్కరూ ఇంధన పొదుపులో భాగంగా ప్రజా రవాణా లేదా ఎలక్ట్రిక్ వాహ నాలు, పబ్లిక్ రవాణా వినియోగించాలని సూచించారు. రైతు బజార్ వద్ద చెత్తను శుభ్రం చేశారు. మచిలీపట్నంలోని రైతుబజార్ వద్ద స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి పాల్గొన్నారు.
తమ పరిసరాలను తామే శుభ్రం చేసుకుంటామని ప్రమాణం చేయిం చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రమైన రాష్ట్రాన్ని సాధించే లక్ష్యంతో ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. మనం కూడా మన పరిసరాల పరిశుభ్రత బాధ్యత తీసుకోవాలి. ఇప్పటికే రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషే ధించాం. జూన్‌లో వర్షాలు పడే నాటికి ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటి వాటిని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని సూచిం చారు. అవసరమైతే స్వచ్ఛాంధ్ర కమిటీలు ఏర్పాటు చేసి మొక్కల సంరక్షణ బాధ్యతలు చూసుకోవాలని సూచించారు. వచ్చే ఆది వారం మంగినపూడి బీచ్‌కు వెళ్లి అక్కడి చెత్త మొత్తాన్ని శుభ్రం చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, విద్యాసాగర్, కన్వీనర్ సుశీల్, మరకాని పరబ్రహ్మం, అల్లూరి సోమశేఖర్, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, బాబా ప్రసాద్, బోస్, స్వామి, మురళీకృష్ణ, రత్నాకర్ పాల్గొన్నారు.
















