- నీటి భద్రతకు స్థానిక బేసిన్ల అనుసంధానం
- మైక్రో-బేసిన్ అనుసంధాన ప్రక్రియపై అధ్యయనం
- ఉత్తమ విధానాలపై డాక్యుమెంటేషను చర్యలు
- జలహారతి పూర్తి అయ్యాక నివేదిక ఇవ్వాలి
- కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు
కుప్పం (చైతన్యరథం): రాష్ట్రంలో జలధార- జలహారతి పనుల ను నిర్దేశిత లక్ష్యంలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు అధికారులను ఆదేశించారు. కుప్పం పర్యటనలో భాగంగా రెండోరోజు శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో జలధార- జలహారతిపై సమీక్ష నిర్వహించారు. గడచిన ఐదు రోజులుగా జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో చేప ట్టిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమం కింద నిర్దేశించుకున్న 100 రోజుల గడువులోగా మంజూరు చేసిన పనులు పూర్తి చేసి తీరాలని దిశానిర్దేశం చేశా రు. దీనిపై జిల్లా కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని సూచిం చారు. జిల్లాల్లో నీటి భద్రత కోసం వివిధ నీటి వనరుల బేసిన్లను అనుసంధానించేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు. మిగులు నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించి స్థానిక నీటి అవసరాలకు నిల్వ సామర్ధ్యాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఆ మేరకు మిగులు నుంచి లోటు ప్రాంతాలకు నీటిని తరలించేలా అనుసంధాన పనులను చేపట్టాలన్నారు. ఈ ప్రక్రియ ద్వారా దీర్ఘకాలిక నీటి భద్రతను సాధించే అవకాశముంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మైక్రో బేసిన్ కనెక్టివిటీపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను గరిష్ఠంగా సద్వినియోగం చేసుకోవడానికి శాస్త్రీయ డేటా ఆధారిత విధానా న్ని అనుసరించాలని సూచించారు. మైక్రో-బేసిన్ అనుసంధాన ప్రక్రియలపై అధ్యయనం చేయాలని జలవనరుల శాఖను ఆదేశించారు.
ఉత్తమ విధానాల అమలు
నీటి భద్రత సాధించేందుకు, భూగర్భ జలాల పెంపునకు వివిధ జిల్లాల్లో అనుసరించిన ఉత్తమ విధానాలను కూడా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో అనుసరించిన ఉత్తమ విధానాలు, విజయవంతమైన పద్ధతులు డాక్యుమెంట్ చేయాలని స్పష్టం చేశారు. ఇతర జిల్లాల్లో సాధ్యమైన చోట బెస్ట్ ప్రాక్టీసెసన్ను అనుసరించాలని సూచించారు. కాస్కేడ్ వ్యవస్థలను కూడా పునరుద్ధరించాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నంద్యాల, కర్నూలు జిల్లా కలెక్టర్లు ప్రదర్శించిన కాస్కేడ్ పునరుద్ధరణ కార్యక్రమాలను ముఖ్యమంత్రి అభినందిం చారు. భూగర్భజలాల రీఛార్జితో పాటు ఉపరితల నీటి లభ్యతను పెంచేలా అన్ని జిల్లాల కలెక్టర్లు తమ ప్రాంతాల్లో కాస్కేడ్ వ్యవస్థ లను గుర్తించి పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయ ప్రణాళికలపై కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. సరైన నీటి నిర్వ హణతో పాటు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేలా జలవనరుల శాఖ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
జలధార- జలహారతిపై నివేదిక
ప్రత్యేకించి రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన జలధార- జలహారతి కార్యక్రమంతో వచ్చిన ఫలితాలను అంచనా వేసేందుకు శాస్త్రీయపరమైన విశ్లేషణ చేపట్టాలని నిర్దేశించారు. రాష్ట్రంలో వర్షపాతం, భూగర్భ జలాలల ప్రభావానికి సంబంధించిన అంశంపై లోతుగా పరిశీలన చేపట్టాలని సూచించారు. ఈ అంశాలను అధ్యయనంతో పాటు తదుపరి చర్యల కోసం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలన్నారు. వ్యవసాయంతో పాటు జలవనరుల ప్రణాళికలు అమలు చేసేందుకు డేటా ఆధారిత నమూనాల ద్వారా చేపట్టాలన్నారు. 100 రోజుల జలధార-జలహారతి కార్యక్రమం పూర్తి అయ్యాక ఆయా జిల్లాల్లో పనుల పరిస్థితి, ఆర్థిక వ్యయం, వర్షపాత విశ్లేషణ, భూగర్భ జలాల రీఛార్జి, నీటి నిల్వ సామర్థ్యంలో మెరుగుదల తదితర అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులు సహా అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు..
















