అమరావతి(చైతన్యరథం); కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పేదల సేవలో” కార్యక్రమాన్ని పండుగలా చేద్దామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. జూన్ 1న ఏపీ వ్యాప్తంగా జరగనున్న “ఎన్టీఆర్ భరోసా” పెన్షన్ పంపిణీ కార్యక్రమం, క్యాలెండర్ మీటింగ్స్ పై ఆదివారం పార్టీ శ్రేణులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 24 నెలల్లోనే రూ.66 వేల కోట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజల సంక్షేమం కోసం ఒక్క పెన్షన్ల పథకానికే అందజే శాం. ప్రతినెలా పెన్షన్ పథకానికి 5.2,728 5 62, 76,325 మందికి ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లను అందజేస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదల సంక్షేమం కోసం ఇంత మొత్తంలో అందజేయడం లేదు.
ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్ర మంలో రాష్ట్ర మంత్రుల నుంచి క్షేత్ర స్థాయి నాయకుల వరకు సచివాలయ ఉద్యోగులతో కలిసి ప్రతి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ను అందించే కార్యక్రమంలో పాల్గొందా మని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ యంత్రాంగాన్ని సంస్థాగతంగా బలో పేతం చేసేం దుకు ప్రతి బుధవారం నాలుగు స్థాయిలలో “క్యాలెండర్ మీటింగ్స్” సమావేశాలు జరగనున్నా యి. 1వ బుధవారం యూనిట్ స్థాయి, 2వ బుధవారం మండల స్థాయి, 3వ బుధవారం నియోజకవర్గ స్థాయి, 4వ బుధవారం పార్లమెంట్ స్థాయిలో కింది స్థాయి సమస్యలను పై స్థాయి సమా వేశాల్లో చర్చిస్తూ 3 నెలల కొకసారి స్టేట్ జనరల్ బాడీలో తీర్మానిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అంది స్తున్న సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిని ప్రజ ల్లోకి బలంగా తీసుకెళుతూ రేపటి పెన్షన్ల పంపిణీని విజయవంతం చేద్దామని కోరారు.














