- సాక్షి మీడియా ద్వారా కల్లోలానికి పన్నాగం
- అమరావతి మహిళలను అవమానించడం దారుణం
- ఉగ్రవాద వైసీపీతో జరిగేది విధ్వంసమే
- ప్రజలే వారికి బుద్ధి చెబుతారు
- లిడ్‌క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు
అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో చంద్రబాబు పాలనకు ఏడాది ముగిసిన సందర్భంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్న సమయంలో వివిధ వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జగన్ రెడ్డి కుట్రలకు తెరలేపారని రాష్ట్ర లిడ్‌క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాణిక్యరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు పాలన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి.విద్యాశాఖ మంత్రి లోకేష్ డీఎస్సీ నిర్వహించి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. భారీగా వస్తున్న పెట్టుబడులతో లక్షల్లో ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. దీంతో రాష్ట్ర యువత, విద్యార్థులు సంతోషంగా ఉన్నారు. మహిళలకు అనేక పథకాలు విడుదల చేయడంతో వారంతా చంద్రబాబు, కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పట్ల సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. గతంలో జగన్ రాష్ట్ర పరువు తీశాడు.
రాజధాని లేకుండా చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్న సమయంలో అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. అశాంతి రేకెత్తించాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో కల్లోలం సృష్టించే యత్నంలో ఉన్నాడు. రాష్ట్రంలో విద్వేష మంటలు రేపి చలికాచుకోవాలని చూస్తున్నాడు. అందుకుగాను సాక్షి పత్రిక, టీవీలను ఆయుధాలుగా మలచుకుంటున్నాడు. అందుకు పేటియం బ్యాచ్ సహకరిస్తోంది. వైసీపీ కార్యకర్తలకు మానవత్వంలేదు. కూటమి పాలనా కాలం ప్రారంభమై సంవత్సరం గడచిన సందర్భంగా సంబరాలు చేసుకుంటుంటే.. విషపుగొట్టు వైసీపీ దాన్ని నాశనం చేయాలని చూస్తోంది. రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు కారుకూతలు కూస్తూ అవాకులు, చవాకులు పేలుతున్నారు. వైసీపీ నాయకులు అమరావతి రైతుల ఆగ్రహానికి గురికాకతప్పదని మాణిక్యరావు స్పష్టం చేశారు.
రాష్ట్రంపై గౌరవం లేదు
జగన్మోహన్ రెడ్డికి జాతీయవాదం లేదు. రాష్ట్రం మీద గౌరవం లేదు. 29 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ దేశాన్ని భారతమాతగా, దేశ రాజధానిని తమ ఆత్మగౌరవ చిహ్నంగా భావిస్తారు. 13 ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రాన్ని తెలుగు తల్లిగా, రాష్ట్ర రాజధానిని ఆత్మగౌరవ పతాకగా భావిస్తారు. దేశానికి రాజధాని ఢల్లీి ఒక తల్లి లాంటిదైతే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు అమరావతి రాజధాని తల్లిలాంటిది. ఈ భావనకు వైసీపీ నాయకులు విఘాతం కలిగించారు. రాష్ట్ర ప్రజల్లో విభేదాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారు. దేశ భద్రతకు, సమైక్యతకు, రాష్ట్ర సమైక్యతకు, సమగ్రతకు ఎవరైనా విఘాతం కలిగించాలనుకుంటే ప్రజలనుండి ప్రతిఘటన ఎదుర్కోక తప్పదు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని జగన్ చూస్తున్నారు. రాజధాని అమరావతి మహిళల్ని వేశ్యలతో పోల్చడం చాలా తప్పు. నాయకులు రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్ర మహిళల గౌరవం పెంచాలి, సంక్షేమ పథకాలు అందించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.
జగన్ లాంటివారి రాజకీయ పుట్టుకే మారణహోమం. తండ్రి మరణానికి కారకుడు జగనే అనే వదంతులున్నాయి. జగన్ రాష్ట్ర క్షేమం కోరుకోడు. సొంత బాబాయినే అతి కిరాతకంగా చంపించారు. పైగా చంపినవారిని చిన్నపిల్లోడని సర్టిఫికెట్ ఇచ్చారు. విద్వేషాలను రెచ్చగొట్టాడు. కోర్టులను తప్పుదోవ పట్టించాడు. వ్యవస్థల్ని నాశనం చేశాడు. గతంలో వనరులన్నింటిని దోపిడీ చేశాడు. ఆదాయాన్నంతటిని తాడేపల్లిలోని తన ప్యాలెస్‌కు తరలించుకున్నాడు. ఆడవారిని అవమానించారు. విధ్వంసానికి తెరలేపారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే, రాష్ట్ర ప్రజల హితవు కోరే వ్యక్తులపై కక్షగట్టి జైల్లో పెట్టించారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను సైతం జైల్లో పెట్టించారు. సామాజిక కార్యకర్త రంగనాయకమ్మలాంటివారిని, దళితుడు డాక్టర్ సుధాకర్ లాంటివారిని ఇబ్బందులపాలు చేశారు. జగన్ వికృత పోకడలను ప్రజలు గమనించారు. అందుకే అధికారానికి దూరం చేశారు. 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా వారిలో పరివర్తన లేదు. సమీక్ష చేసుకుని మార్చు తెచ్చుకోవాలని మాణిక్యరావు హితవు పలికారు.
జగన్‌ది అరాచకవాదం
అమరావతి మహిళల్ని వేశ్యలని మాట్లాడతారా? రాష్ట్ర మహిళలు నీ దృష్టిలో వేశ్యలా? రాష్ట్ర రాజధాని కోసం రైతులు తమ విలువైన భూముల్ని ఇచ్చారు. వైసీపీ నాయకులు అమరావతి మహిళా రైతులపై మానసిక ఉగ్రదాడి చేశారు. కూటమి ప్రభుత్వం టెక్నాలజీని పెంచుతోంది. విద్యార్థులు బాగా చదువుకోవాలని వారి కోసం పరితపిస్తోంది. వారికి మంచి ఉద్యోగాలు రావాలి, రాష్ట్ర ప్రజలకు మంచి జీవన విధానం అందించాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. జగన్ చేసేదంతా ఉగ్ర రాజకీయం. తండ్రి చావును కూడా తనకు అనుకూలంగా మలచుకున్న వ్యక్తి జగన్. పదవి కోసం బాబాయిని చంపించారు. ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని తరిమేశాడు. పదవిలోకి రావాలనుకుంటే దాడులు చేయించే మనస్తత్వం జగన్‌ది. జగన్ అరాచకవాదాన్ని ప్రజలు సంవత్సరం క్రితమే పసిగట్టి పాతరేశారని వైసీపీ తెలుసుకోవాలి.
జగన్మోహన్ రెడ్డిది రాజకీయ పార్టీ కాదు, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజాస్వామ్యానికి లోబడి సామ్యవాదమో, మితవాదమో, అతివాదమో కూడిన రాజకీయాలు చేయాలి. కాని జగన్ ఉగ్రవాదం చేస్తున్నాడు. జగన్ ఉగ్రవాదంవల్ల విధ్వంసమే జరిగింది. జగన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయ పార్టీవల్ల రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఉగ్రవాద వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని కృష్ణంరాజు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిని సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ ఉగ్రవాద పార్టీ. దానివల్ల విధ్వంసమే జరుగుతుంది. చివరికి దానిలో ఉన్నవారు ఏదో ఒక విధంగా పతనం కాక తప్పదని మాణిక్యరావు హెచ్చరించారు.