- రైతుసోదరులు స్వచ్ఛంద శ్రమదానం చేయాలి
- ఉద్యానపంటల సాగుపైనా దృష్టిపెట్టాలి
- ఆర్అండ్‌బీ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల/బనగానపల్లె(చైతన్యరథం): జలధార-జలహారతిలో భాగంగా శనివారం బనగానపల్లె బహిరంగ సభలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న అన్నమయ్య జిల్లాలలో నేడు భారీగా భూగర్భ జలాలు పెరిగాయని వివరించారు. గతంలో తెలుగుదేశం పార్టీ నీరు చెట్టు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తే వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. నీరు చెట్టు కార్యక్రమం ఎంతో ఉపయోగకరమో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎప్పుడో శ్రీకృష్ణదేవ రాయల కాలంలో తవ్విన కాలువలు చెరువులను తిరిగి పునరుద్ధ రించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. గత ఐదే ళ్లూ ఒక వాగు, వంక, చెరువు, కాలువలో మట్టి తీసిన పాపాన పోలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును నిలిపివేస్తే నేడు మేము పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. బనగానపల్లెలోని పడమటపల్లెలో తాగునీరు ఇచ్చేందుకు కృత నిశ్చయంతో పని చేస్తున్నామని వివరించారు.
నాడు కేవలం 9 నెలల కాలంలో దద్దనాల చెరువు ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశామని వివరించారు. రైతు సోదరులంతా కలిసి స్వచ్ఛందంగా ట్రాక్టర్లు, జేసీబీలు ఇస్తే ప్రభుత్వ సహకారంతో శ్రమదానం చేద్దామని పిలుపునిచ్చారు. వ్యవసాయంతో పాటు హార్టికల్చర్‌పై కూడా రైతులు దృష్టిపెట్టాలి. ఏ ఏ గ్రామాల్లో ఆ పంటలకు అనుకూలంగా ఉంటుందో అధి కారులు నివేదికను రూపొందించాలని సూచించారు. రైతులంతా స్వచ్ఛందంగా చేసే శ్రమదానానికి ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతం గా తాను కూడా సహకరిస్తామని తెలిపారు. కొలిమిగుండ్లలో ఈ విధానం సక్సెస్ అయితే భవిష్యత్తులో బనగానిపల్లిలో కూడా ఈ తరహాలో శ్రమదానం చేపడదామని సూచించారు.
















